News
News
వీడియోలు ఆటలు
X

Vastu Tips In Telugu: ఇంట్లో బుద్ధ విగ్రహం పెడుతున్నారా , ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి

బుద్ధ విగ్రహం అమర్చడం వల్ల అందం ఎలాగూ వస్తుంది. నియమానుసారం అలంకరించుకుంటే మరింత మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు వాస్తు నిపుణులు.

FOLLOW US: 
Share:

Vastu Tips In Telugu:  చాలా మంది బుద్ధ విగ్రహాలను తీసుకొచ్చి ఇంట్లో అలంకరించుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. అయితే ఈ బుద్ధ విగ్రహం ఎక్కడ పెట్టుకోవాలి? ఏదిక్కున పెట్టుకుంటే మంచిది వాటి గురించి కొన్ని వాస్తునియమాలు ఉన్నాయి. వాస్తు ప్రకారం బుద్ధుడిని పెడితే అంతా మంచి జరుగుతుందని చెబుతారు వాస్తు నిణుపులు. అవేంటో చూద్దాం...

Also Read: మీ బెడ్ రూమ్ లో అద్దం ఎటువైపు ఉంది, మంచం ఏ దిక్కున గోడకు వేశారు!

బుద్ధుడి విగ్రహం ఎక్కడ పెట్టాలి

  • ఇంటి ప్రధాన ద్వారం దగ్గర బుద్ధుడి విగ్రహం ఉంచడం మంచిది. ద్వారం దగ్గర ఉండే బుద్ధ విగ్రహం బయటి వచ్చే ప్రతికూల శక్తిని నిలువరిస్తుంది. దృష్టి నివారణకు ఇలా ప్రవేశ ద్వారం దగ్గర బుద్ధ విగ్రహం పెట్టుకోవాలి. ఇలా ఇంటి బయట పెట్టే విగ్రహం భూమి నుంచి 3,4 అడుగుల ఎత్తులో అమర్చుకోవాలి.
  • లివింగ్ రూమ్ లో కూడా బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ గదిలో ఉన్నపుడు పశ్చిమ దిక్కుగా దీన్ని అమర్చుకోవాలి. ఇది ఇంటిని ప్రశాంతంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది. బుద్ధ విగ్రహాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉండే టేబుల్ లేదా షెల్ఫ్ లో ఉంచాలి. బుద్ధ విగ్రహం వల్ల ఇల్లు శాంతిగా అందంగా కనిపిస్తుంది. 
  • తోట స్థలం ఉన్నవారు మొక్కల మధ్య బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ధ్యాన భంగిమలో ఉన్న విగ్రహం తోటలో పెట్టుకుంటే బావుంటుంది. లేదా విశ్రాంతి భంగిమలో ఉన్న బుద్ధ విగ్రహం కూడా తోటలో పెట్టుకోవడానికి మంచి ఆప్షన్
  • పూజ గదిలో బుద్ధుని పూజిస్తారు కొందరు. ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది. అలాగే యోగా, ధ్యానం సాధన చేసే చోట కూడా బుద్ధ విగ్రహం పెట్టుకోవడచ్చు. ఇది ఏకాగ్రత పెంచుతుంది. ఇంట్లో తూర్పు భాగంలో బుద్ధ విగ్రహాన్ని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
  • పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టడం లేదని అనిపిస్తే వారు చదువుకునే చోట ఒక బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యండి. పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. క్రమంగా చదువు మీద ఆసక్తి కూడా పెరుగుతుంది.

మార్కెట్ లో రకరకాల బుద్ధ విగ్రహాలు దొరుకుతాయి. వాటి అర్థాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. అవి తెలుసుకుని మీకు అవసరమైన చిన్న విగ్రహం తెచ్చుకుని ఇంట్లో అలంకరించుకోవచ్చు.

Also Read: వాస్తు ప్రకారం ఈ మూలలు పెరిగిన స్థలాలు అస్సలు కొనకూడదు

బుద్ఢుడి విగ్రహం ఎలా అమర్చాలి

  • బుద్ధుడి విగ్రహం ఎప్పుడూ నేల మీద ఉంచకూడదు. కంటి చూపు కంటే పై స్థాయిలో ఉండే విధంగా ఏర్పుటు చేసుకోవాలి.
  • రిఫ్రిజిరేటర్ల వంటి పెద్ద పెద్ద ఎలక్ట్రానికి వస్తువుల దగ్గరగా పెట్టకూడదు. వీటి నుంచి వచ్చే వైబ్రేషన్ సానుకూల శక్తిని అడ్డుకుంటాయి.
  • విగ్రహం తూర్పు అభిముఖంగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఈశాన్యంలో కూడా పెట్టుకోవచ్చు.
  • స్టోర్ రూమ్, లాండ్రి గదుల వంటి చోట పెట్టకూడదు.
  • తోటల్లో, ఆరుబైట ఏర్పాటు చేసిన విగ్రహాన్ని శుభ్రంగా ఉంచాలి. మురికి కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
  • బుద్ధుడు జ్ఞానోదయం పొందిన వాడు కనుక బుద్ధ విగ్రహాన్ని సరైన చోట పెట్టినపుడు ఇంట్లో సామరస్యం, ప్రశాంతత, జ్ఞానం వెల్లివిరుస్తాయి. కనుక బుద్ధ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మరింత మంచి ఫలితాలు పొందవచ్చు.

Note: వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.  ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.

Published at : 06 May 2023 10:16 AM (IST) Tags: statue Vastu Tips budha gouthama buddha

సంబంధిత కథనాలు

Chanakya Niti - చాణక్య నీతి: ఇలా సంపాదించే డబ్బు అస్సలు నిలవదు!

Chanakya Niti - చాణక్య నీతి: ఇలా సంపాదించే డబ్బు అస్సలు నిలవదు!

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

Hanuman Sindoor: హనుమంతుడు సింధూరం ధరించడం వెనుక రహస్యం ఇదే

Hanuman Sindoor: హనుమంతుడు సింధూరం ధరించడం వెనుక రహస్యం ఇదే

Laxmi Yog:ఈ రాశులవారికి ఈ రోజు(మే 30) నుంచి లక్ష్మీయోగం

Laxmi Yog:ఈ రాశులవారికి ఈ రోజు(మే 30) నుంచి లక్ష్మీయోగం

Pitru Dosha Symptoms: మీకు ఇలా జరుగుతుంటే పితృ దోషం ఉన్న‌ట్టే !

Pitru Dosha Symptoms: మీకు ఇలా జరుగుతుంటే పితృ దోషం ఉన్న‌ట్టే !

టాప్ స్టోరీస్

Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు - నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !

Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు -  నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !

Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Telangana Congress :  టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?