IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Vasant Panchami 2022: వసంత పంచమి రోజు మాత్రమే కాదు... నిత్యం ఈ శ్లోకాలు చదివితే చాలా మంచిది...

వసంతపంచమిని మాఘశుద్ధపంచమి, శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ రోజు సరస్వతీ దేవిని పూజిస్తే జ్ఞానవంతులు, అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం. ఇంట్లో ఉండి పూజ చేసుకోవాలి అనుకునేవారు ఈ శ్లోకాలు చదువండి...

FOLLOW US: 

ఈ నెల 5 వ తేదీ శనివారం వసంతపంచమి.  వేకుమజామునే స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకుని, సరస్వతీ దేవికి నమస్కరించి ఈ శ్లోకాలు చదువుకుంటే మంచిదని చెబుతారు పండితులు. 

ప్రణోదేవీ సరస్వతీ, వాజేభిర్వాజినీ వతీ ధీనామ విత్ర్యవతు
సరస్వతీ శ్లోకం
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||

యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా 
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభిర్దేవై సదావందితా
సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశేష  జాడ్యాపహా

పోతన చెప్పిన శ్లోకం
తల్లీ  నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ 
నీవునా యుల్లంబందున నిల్చి జ్రుంభణముగా సూక్తుల్ 
సుశబ్దంబుశోభిల్లన్ బల్కుము నాదు వాక్కునను సంప్రతిన్ 
జగన్మోహినీ పుల్లాభాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా....

సరస్వతీ దేవి ద్వాదశనామ స్తోత్రం
 సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ
ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ  తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా 
పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ
నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ  ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ 
బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ 
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ!!

పై శ్లోకాన్ని నిత్యం 11 సార్లు చెప్పుకుని సరస్వతి దేవికి నమస్కరించాలి. ఆర్థిక సమస్యలతో చదువుకోలేకపోతున్న పిల్లలకు సహాయపడటం, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయడం వల్ల చదువుల తల్లి కరుణ ఉంటుందని చెబుతారు. 

                ఓం వాగ్దేవ్యైచ విద్మహే....బ్రహ్మపత్న్యైచ
                ధీమహీ...తన్నో వాణీ ప్రచోదయాత్............

 శ్రీ పంచమి  రోజే బాసరలో వ్యాసమహర్షి ఇసుకతో అమ్మవారిని ప్రతిష్టించాడని చెబుతారు. ప్రకృతిలోని చెట్ల ఆకులన్నీ పసుపుగా మారి అమ్మ రాకకోసం నేలనంతా పసుపుతో అలికాయా అనట్టుగా ఉంటుంది వాతవరణమంతా. ఈ శ్రీ పంచమి రోజు విద్యాభ్యాసం మొదలుపెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని విశ్వాసం.  అందుకే చాలామంది తల్లిదండ్రులు వసంతపంచమి రోజు బాసరలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు.  సాధారణంగా దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. కానీ సరస్వతీ దేవి రూపులో ఎక్కడా ఆయుధాలు కనిపించవు. జ్ఞానమే ఆమె ఖడ్గం, సంగీతమే ఆమె సాధనం, ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం. అందుకే పుస్తకం, వీణలను చేతపట్టి ధవళ వస్త్రాలతో కనిపిస్తుంది. తత్వ విచారానికీ, పరిపూర్ణ వ్యక్తిత్వానికీ చిహ్నమైన కమలం మీద ఆశీనులై ఉంటుంది. అందుకే జ్ఞానాన్ని ఆశించే ప్రతి ఒక్కరూ  ‘సరస్వతీ నమస్తుభ్యం’ అంటూ ఆమెకు తొలిపూజలందిస్తారు. 

Published at : 03 Feb 2022 01:16 PM (IST) Tags: basant panchami 2022 basant panchami 2022 date vasant panchami 2022 basant panchami vasant panchami 2022 date vasant panchami basant panchami kab hai vasant panchami 2022 me kab hai basant panchami kab hai 2022 basant panchami 2022 mein kab hai basant panchami 2022 date time basant panchami puja vidhi 2022 vasant panchami basant panchami ki kahani vasant panchami kab hai 2022 happy basant panchami 2022 basant panchami 2022 kab hai

సంబంధిత కథనాలు

Shani Jayanti 2022: మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది

Shani Jayanti 2022: మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో

Hanuman Jaya Mantram: హనుమాన్ జయమంత్రం, పిల్లలతో నిత్యం ఇది చదివించడం చాలా అవసరం - ఎందుకంటే!

Hanuman Jaya Mantram: హనుమాన్ జయమంత్రం,  పిల్లలతో  నిత్యం ఇది చదివించడం చాలా అవసరం - ఎందుకంటే!

Sundarakanda Parayanam: వివాహం, సంతానం, శని బాధలు ఇలా సుందరకాండలో ఏ ఘట్టం చదివితే ఎలాంటి సమస్యలు తీరుతాయో తెలుసా

Sundarakanda Parayanam: వివాహం, సంతానం, శని బాధలు ఇలా సుందరకాండలో ఏ ఘట్టం చదివితే ఎలాంటి సమస్యలు తీరుతాయో తెలుసా

Horoscope Today 24th May 2022: మంగళవారం ఈ రాశులవారికి జయాన్నిస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 24th May 2022: మంగళవారం ఈ రాశులవారికి జయాన్నిస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Punjab CM Bhagwant Mann : కాంట్రాక్టుల్లో లంచాలు తీసుకున్న ఆరోగ్యమంత్రి - పదవి తీసేసి అరెస్ట్ చేయించిన పంజాబ్ సీఎం

Punjab CM Bhagwant Mann :  కాంట్రాక్టుల్లో లంచాలు తీసుకున్న ఆరోగ్యమంత్రి -  పదవి తీసేసి అరెస్ట్ చేయించిన పంజాబ్ సీఎం

Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్

Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Quad Summit 2022: భారత్‌, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్‌

Quad Summit 2022: భారత్‌, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్‌