Valentine's Day 2024: మనిషిని బతికించేంత శక్తి ఉంది ప్రేమకు - ఇదిగో ప్రూఫ్!
Valentine's Day 2024 : పురాణాల్లో ప్రస్తావించే కొన్ని ప్రేమకథల గురించి తెలుసుకున్నప్పుడు ఇది నిజంగా జరిగిందా అని ఆశ్చర్యపోతారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అలాంటి లవ్ స్టోరీ...
The story of Savitri and Sathyavan: పురాణాల్లో సావిత్రి అనగానే మీకు ఠక్కున గుర్తుకురాకపోవచ్చు కానీ సతీ సావిత్రి అంటే తెలుస్తుంది. ఆమె గురించి మొత్తం తెలియకపోయినా భర్త ప్రాణాలు యముడి దగ్గర్నుంచి తీసుకొచ్చిందట కదా అని మాత్రం చెప్పుకుంటారు. ఆమె ప్రేమ కథ గురించి తెలుసా మరి...
సావిత్రి-సత్యవంతుడు
ముద్ర అనే దేశానికి రాజైన అశ్వపతి - మాళవిల కుమార్తె సావిత్రి. సంతానం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు నిర్వహించారు ఆ దంపతులు. 18 సంవత్సరాల ఉపవాస ఫలితంగా జన్మించింది సావిత్రి. ఆమెకు యుక్త వయసు రాగానే ఆమె కోరుకున్న వరుడికి ఇచ్చి పెళ్లిచేయాలి అనుకున్నారు. అప్పటికే సత్యవంతుడి గురించి విన్న సావిత్రి...తననే పరిణయమాడుతానంది. అయితే సత్యవంతుడు ఏడాది కన్నా ఎక్కువ కాలం బతకడు అని అశ్వపతికి తెలియడంతో పెళ్లికి నిరాకరిస్తాడు. కానీ సావిత్రి మాత్రం తనని తప్ప మరొకర్ని పెళ్లిచేసుకోనని చెప్పడంతో విధిలేక వివాహం జరిపిస్తాడు.
Also Read: ఎవరీ రతీ మన్మధులు - వీరి ప్రేమకథ ఎందుకంత ప్రత్యేకం!
సమీపించిన మరణం
సత్యవంతుడు తండ్రి రాజ్యాన్ని కోల్పోతాడు. సావిత్రి భర్తకు మరణ ఘడియలు సమీపించాయి. ఆ విషయం ముందే గ్రహించిన సావిత్రి వారం ముందునుంచే ఉపవాసం ప్రారంభించింది. ఓ రోజు ఉదయాన్నే సత్యవంతుడు అడవిలో కలప తీసుకొచ్చేందుకు బయలుదేరుతాడు. తాను కూడా వెంట వస్తానని సావిత్రి అడగడంతో సరే అంటాడు. ఎత్తైన చెట్టు కింద మెత్తటి ఆకులతో ఆసనాన్ని ఏర్పాటు చేస్తాడు. ఓ వైపు చెక్కలు నరకుతూనే మరోవైపు ఆమెకోసం పూలు కోస్తాడు. మధ్యాహ్నానికి అలసిపోయిన సత్యవంతుడు కాసేపటి తర్వాత వచ్చి సావిత్రి ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. అంతలో తన ఎదురుగా నిల్చున్న వ్యక్తిని చూసి ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తుంది సావిత్రి. నేను ఎవ్వరికీ కనపడను కదా అని ఆలోచించిన యముడు.. సావిత్రి మహా ప్రతివ్రత కావడంతో కనిపించానని గ్రహిస్తాడు. సత్యవంతుడి ప్రాణాలు తీసుకెళ్లేందుకు వచ్చానంటాడు యముడు.
Also Read: రాక్షసిని దేవతగా మార్చిన అద్భుతమైన ప్రేమకథ!
యముడిని అనుసరించిన సావిత్రి
భర్త ప్రాణాలు తీసుకెళుతున్న యముడిని అనుసరించడం ప్రారంభించింది సావిత్రి. ఆమెను గమనించిన యముడు నువ్వెందుకు నా వెనుకే వస్తున్నావని ప్రశ్నిస్తాడు. భర్త వెంట నడవడమే పతివ్రత ధర్మం అని చెబుతుంది. ఇద్దరి మధ్యా చాలాసేపు వాదన నడుస్తుంది. ఎట్టకేలకు ఆమె పతిభక్తి మెచ్చిన యముడు ఓ వరం కావాలో కోరుకో నీ పతి ప్రాణాలు తప్ప అని షరతు పెడతాడు.
మొదటి వరం
అంధులైన తన అత్తమామలకు కళ్లు రావాలి అని కోరుకుంటుంది - తథాస్తు అంటాడు యముడు.. అయినప్పటికీ సావిత్రి అనుసరిస్తూనే ఉంటుంది
రెండో వరం
రెండో వరంగా తమ రాజ్యం తిరిగి కావాలని అడుగుతుంది. తథాస్తూ అంటాడు యముడు... ఇంకా అనుసరిస్తూనే ఉంటుంది
మూడో వరం
మరో వరం ఇస్తాను కోరుకో..నీ పతి ప్రాణాలు తప్ప అని గుర్తుచేస్తాడు యముడు.. అప్పుడు సావిత్రి తనకు తనయుడు కావాలని అడుగుతుంది. తథాస్తు అన్న యముడితో..సత్యవంతుడు లేకుండా అదెలా సాధ్యం అని అడుగుతుంది. తథాస్తు అన్న యముడికి సావిత్రి ముందు తలొంచక తప్పలేదు.- సత్యవంతుడిని బతికించాడు...
Also Read: ఫిబ్రవరి 14 వసంతపంచమి - శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!
ప్రేమ - వివాహ బంధం ఎంత గొప్పగా ఉండాలో చెప్పేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది. తాను వలచిన వ్యక్తి ఏడాదిలో మరణిస్తాడని తెలిసినా తన ప్రేమతో బతికించుకుంది. ఆమె పతి ప్రేమ యమపాశాన్ని కూడా వెనక్కు తీసుకునేలా చేసింది. అందుకే ఐదుగురు పతివ్రతలు అని చెప్పే పేర్లలో సావిత్రి పేరొకటి..