అన్వేషించండి

Ujjain Mahakal Bhasma Aarti: మహాకాల్ ఆలయంలో భస్మ హారతి కోసం బుకింగ్ ఇకపై ఆన్‌లైన్‌లో! ఎంత చెల్లించాలి, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి!

Bhasma Aarti online tatkal ticket: మహాకాలేశ్వర ఆలయంలో భస్మ హారతిని వీక్షించడానికి, మీరు ఇకపై ఆన్‌లైన్‌లో టిక్కెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బుకింగ్ కోసం మీరు ఎంత చెల్లించాలో తెలుసుకోండి.

Ujjain Mahakal Bhasma Aarti: మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో  షిప్రా నది ఒడ్డున వెలసిన శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత మహిమాన్వితమైనది. ఇక్కడ శివుడు 'కాలానికి, మరణానికి అధిపతి'గా  మహాకాలుడిగా పూజలందుకుంటాడు. ఇక్కడ శివలింగం దక్షిణాభిముఖంగా ఉండటం విశేషం. ప్రతిరోజూ తెల్లవారుజామున ఇక్కడ జరిగే 'భస్మ హారతి'అత్యంత ప్రత్యేకం.
 
మహాకాలేశ్వర ఆలయంలో ఈ భస్మ హారతిని వీక్షించడానికి, మీరు ఇకపై ఆన్‌లైన్‌లో టిక్కెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఉచిత భస్మ హారతి సేవ నిలిపివేశారు.  
 
మహాకాలేశ్వర ఆలయంలో జరిగే ప్రసిద్ధ భస్మ హారతికి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఉచిత ఆఫ్‌లైన్ అనుమతిని పూర్తిగా నిలిపివేశారు. ఇకపై భక్తులు భస్మ హారతిలో పాల్గొనడానికి ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఆన్‌లైన్ బుకింగ్ కోసం భక్తులు ఒక్కొక్కరికి రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ఒక భక్తుడు ఏప్రిల్ 18న జరిగే భస్మ హారతిలో పాల్గొనాలనుకుంటే,  ఏప్రిల్ 17న ఉదయం 8:00 గంటలకు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
 
https://www.shrimahakaleshwar.mp.gov.in/ ఈ అధికారిక వెబ్‌సైట్‌లో మీరు మహాకాలేశ్వర్ వద్ద జరిగే భస్మ హారతి కోసం తక్షణ బుకింగ్‌లు చేసుకోవచ్చు. తక్షణ బుకింగ్ కోసం 300 మంది సందర్శకులను మాత్రమే అనుమతిస్తారు.

పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. ముందుగా వచ్చిన వారికి ముందుగా స్లాట్‌లు కేటాయిస్తారు

మహాకాల్ భస్మ హారతి కోసం బుకింగ్‌లను ఆలయ అధికారిక వెబ్‌సైట్‌లో చేసుకోవాలి. గతంలో, బుకింగ్‌లు మూడు నెలల ముందుగానే ప్రారంభమయ్యేవి, కానీ ఇప్పుడు దీనిని ఒక నెలకు తగ్గించారు. జూన్ నెల బుకింగ్‌లు మే 1వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయి.
 
పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరానికి "అవంతిక" అని పేరు.. ఏడు మోక్షధామాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది ఉజ్జయిని.  కృతయుగం నాటికి చెందిన  ఈ ఉజ్జయిని జ్యోతిర్లింగ క్షేత్రం ఎన్నో రహస్యాలకు నెలవు. ఈ క్షేత్రంలోని శివలింగం మంత్ర శక్తిలో ఏర్పడిందని భావిస్తారు. అందుకే ఇక్కడ  మహాకాళేశ్వరుడి దర్శనం భయం, పాపాల నుంచి విముక్తిని కలిగిస్తుందని  భక్తుల విశ్వాసం. ఇక్కడ మహాకాళేశ్వరుడు దక్షిణాభిముఖంగా వెలసి ఉండడం వల్ల ఈ స్వామిని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఓంకారేశ్వర మహాదేవ విగ్రహం మహాకాళ విగ్రహం పైన ఉంటుంది. ఉజ్జయిని మహాకాళేశ్వరుని దేవాలయం 5 అంతస్తుల్లో ఉంటుంది.  ఒకటి భూ అంతర్భాగం. శివ లింగాలు మూడంతస్థులుగా ఉంటాయి.  
 
మహాకాళేశ్వరుని ఆలయంలో తప్పకుండా చూడాల్సింది భస్మ హారతి. ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ఈ హారతి దర్శనం చేసుకోవాలంటే   పూర్వజన్మ సుకృతం ఉండాలని పెద్దలు చెబుతారు. మహాకాళేశ్వరునికి జరిగే భస్మాభిషేకం రెండు రకాలుగా ఉంటుంది.

మొదటి రకం విభూత్యాభిషేకంలో భాగంగా తెల్లని పలచని బట్టలో ఆవు పేడతో తయారైన మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పై పట్టుకుని మరో మూటతో దానిని కొడతారు. ఆ సమయంలో భస్మం కేవలం శివలింగంపైనే కాదు..మొత్తం అంతరాలయాన్ని చుట్టేసేతుంది. ఆ సమయంలో శంఖాలు, బేరీలు, పెద్ద పెద్ద మృదంగాలు మోగిస్తారు. ఆ క్షణం అక్కడున్న భక్తులు అలౌకిక ఆనందంలో మునిగిపోతారు

రెండో రకం భస్మహారతిలో భాగంగా  బ్రాహ్మీ ముహూర్తంలో స్మశానానికి వెళ్లి అప్పుడే కాలిన శవం నుంచి భస్మాన్ని సేకరించి ఆలయానికి చేరుకుంటారు అర్చకులు. ఆ శవ భస్మంతో స్వామికి  భస్మాభిషేకం చేస్తారు. భస్మ హారతి  సాక్షాత్తు కైలాసంలో పరమేశ్వరుని దర్శించిన అనుభూతి కలుగుతుంది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

కన్యా రాశి ఆగస్టు 16-22 వారఫలం
కన్యా రాశి ఆగస్టు 16-22 వారఫలం
సింహ రాశి ఆగస్టు 16-22 వారఫలం
సింహ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కర్కాటక రాశి ఆగస్టు 16-22 వారఫలం
కర్కాటక రాశి ఆగస్టు 16-22 వారఫలం
15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Embed widget