అన్వేషించండి

Tirumala News: తిరుమల వెళ్లే వీఐపీలకు షాకింగ్ న్యూస్ - ఈ రోజుల్లో వెళ్లకపోవడమే ఉత్తమం, సామాన్య భక్తులూ..

Tirumala News: తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకూ శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

TTD Dismissed VIP Break Darshanams: తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. వారికి శ్రీవారి దర్శనం వీలైనంత వేగంగా కల్పించేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జూన్ 30 వరకూ వారాంతాల్లో అంటే శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని (VIP Break Darshanam) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, వేసవి సెలవులు, విద్యార్థుల పరీక్షా ఫలితాలు వెల్లడి, ఎన్నికలు పూర్తికావడం వంటి కారణాలతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు దాదాపు 30 నుంచి 40 గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మార్పును గమనించి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

20 గంటల సమయం

మరోవైపు, శ్రీవారి దర్శనం కోసం భక్తులు కి.మీల మేర బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగ్ రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకూ సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. వీరికి స్వామి దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతుందని అధికారులు ప్రకటించారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఇబ్బంది లేకుండా తాగునీరు, పాలు, అన్న ప్రసాదాలు అందిస్తున్నారు. ఈ రద్దీ వారాంతం వరకూ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, గురువారం స్వామి వారిని 65,416 మంది భక్తులు దర్శించుకోగా.. 36,128 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.51 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Also Read: TTD Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆగస్ట్ నెల దర్శన కోటా టికెట్లు విడుదల

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

కన్యా రాశి వారఫలాలు ఆగస్టు 9-15: గ్రహాల నుంచి అనుకూల సంకేతం! నిలిచిపోయిన పనులు వేగవంతం!
కన్యా రాశి వారఫలాలు ఆగస్టు 9-15: గ్రహాల నుంచి అనుకూల సంకేతం! నిలిచిపోయిన పనులు వేగవంతం!
09-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
09-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
వృషభ రాశి 2026 ఆగస్టు 09 - 15 వారఫలం: కష్టం, ఆర్థిక మరియు సంబంధాల విషయాలలో సహనం అవసరం!
వృషభ రాశి 2026 ఆగస్టు 09 - 15 వారఫలం: కష్టం, ఆర్థిక మరియు సంబంధాల విషయాలలో సహనం అవసరం!
మేష రాశి వారఫలాలు: ఆగస్టు 9-15, అదృష్టం, ఆర్థిక లాభాలు మీ సొంతం!
మేష రాశి వారఫలాలు: ఆగస్టు 9-15, అదృష్టం, ఆర్థిక లాభాలు మీ సొంతం!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget