By: ABP Desam | Updated at : 15 Apr 2022 08:36 AM (IST)
Edited By: RamaLakshmibai
Today Panchang April 15
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
ఏప్రిల్ 15 శుక్రవారం
తేదీ : 15 - 04 - 2022,
వారం : భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం,
తిధి : చతుర్దశి రా1.53 వరకు తదుపరి పూర్ణిమ
నక్షత్రం : ఉత్తర ఉ8.44 వరకు, తదుపరి హస్త
యోగం : ధృవం ఉ7.15 వరకు తదుపరి వ్యాఘాతం తె5.27 వరకు
కరణం : గరజి మ2.12 వరకు తదుపరి వణిజ రా1.53 వరకు,
వర్జ్యం : సా5.05 నుంచి 6.41 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 8.17 నుంచి 9.06 & మధ్యాహ్నం 12.24 - 1.14
అమృతకాలం : రాత్రి 2.39 - 4.14,
రాహుకాలం : ఉదయం 10.30 - 12.00,
యమగండం : మధ్యాహ్నం 3.00 - 4.30,
సూర్యరాశి : మేషం
చంద్రరాశి : కన్య
సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.11
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి))
Also Read: స్థిరాస్తులు వృద్ధి చేయాలనుకుంటే ఈ రాశివారికి ఇదే మంచి సమయం, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి
ఈ రోజు విశేషం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి కళ్యాణోత్సవం
దేశంలో ఎక్కడా లేని విధంగా పున్నమి వెలుగుల్లో రాములోరి కళ్యాణం ఒంటిమిట్టకే ప్రత్యేకం. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించడం తెలుగునాట ఆనవాయితీ, దానికి పునాది భద్రాచలంలో పడిందని చెబుతారు. మన తెలుగు రాష్ట్రాల్లో మరో రామక్షేత్రమైన ఒంటిమిట్టలో దీనికి కాస్త విభిన్నమైన సంప్రదాయం కనిపిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా పౌర్ణమి రోజు రాములోరి కల్యాణం జరుగుతుంది.
Also Read: శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమే
ఈ రోజు చదువుకోవాల్సిన మంత్రం
శ్రీ మహాలక్ష్మి అష్టకం
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తు తే || 1 ||
నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే || 2 ||
సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే || 3 ||
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తు తే || 4 ||
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తు తే || 5 ||
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే || 6 ||
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తు తే || 7 ||
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోస్తు తే || 8 ||
మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ |
ద్వికాల్ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ||
ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్
Vastu Shastra-Spirituality: ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆపేశారా, అయినప్పటికీ ఈ పనులు మాత్రం పూర్తిచేయాల్సిందే
Shani Jayanti 2022: అమావాస్య రోజు ఈ పనులు చేశారంటే దరిద్రం ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుందట
Kaala Bhairava Temple: ఇక్కడ దేవుడికి పేడ పూస్తే వర్షాలు కురుస్తాయి, ఇంకెన్నో మహిమలున్న ఆలయం
Today Panchang 26 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, మతత్రయ ఏకాదశి ప్రత్యేకత
Horoscope Today 26th May 2022: ఈ రాశివారి బలహీనతను ఉపయోగించుకుని కొందరు ఎదుగుతారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
PM Modi Hyderabad Tour: కేసీఆర్పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!
Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!
Stock Market News: సెన్సెక్స్ - 250 నుంచి + 500కు! ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఎగబడ్డ ఇన్వెస్టర్లు!