Today Panchang 10th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, జయాన్నిచ్చే హనుమంతుడి శ్లోకం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి...
మే 10 మంగళవారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 10- 05 - 2022
వారం: మంగళవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్లపక్షం
తిథి : నవమి మంగళవారం మధ్యాహ్నం 3.01 వరకు తదుపరి దశమి
వారం : మంగళవారం
నక్షత్రం: మఖ మధ్యాహ్నం 2.52 తదుపరి పుబ్బ
వర్జ్యం : రాత్రి 11.13 నుంచి 12.53
దుర్ముహూర్తం : ఉదయం 8.13 నుంచి 8.58 తిరిగి రాత్రి 10.47 నుంచి 11.32
అమృతఘడియలు : మధ్యాహ్నం 12.18 నుంచి 2.00
సూర్యోదయం: 05:34
సూర్యాస్తమయం : 06:18
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
మంగళవారం ..అంటేనే జయవారం. మంగళవారం రోజు ఉపవాసం చేసి ఆంజనేయ ఉపాసన చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని భక్తుల విశ్వాసం. మంగళవారానికి నవగ్రహాల్లో అంగారకుడు అధిపతి. అలాంటి అంగారకుని వల్ల ఏర్పడే ఈతిబాధలు, దోషాలు తొలగిపోవాలంటే.. ఆంజనేయ స్వామిని మంగళవారం పూట అర్చించాలి.
ధ్యానం :-
వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాన్వితం
దివ్యాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం హలం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి వీరాపాహమ్!!
ఆంజనేయ స్తోత్రం
నమో వాయుపుత్రాయ భీమరూపాయధీమతే
నమస్తే రామదూతాయ కామరూపాయశ్రీమతే
మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే
భగ్నాశోక వనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే
గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయచ
వనౌకసాం వరిష్ఠాయ వశినే వననాసినే
తత్త్వజ్ఞాన సుధాసింధు నిమగ్నాయ మహీయసే
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ
జన్మమృత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయచ
నేదిష్ఠాయ మహాభూతప్రేత భీత్యాది హారిణే
యాతనా నాశనాయాస్తు నమో మర్కటరూపిణే
యక్షరాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహ్నతే
మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధృతే
హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే
బలినా మగ్రగణ్యాయ నమః పాపహరాయతే
లాభ దోసిత్వేమేవాసు హనుమాన్ రాక్షసాంతక
యశోజయంచ మే దేహి శత్రూన్ నాశయ నాశయ
స్వాశ్రితానామ భయదం య ఏవం స్తౌతి మారుతిం
హానిమేతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్.
Also Read: పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయ్ అంటారు కదా, ఆ పాతకాలు ఏంటో తెలుసా
బుద్ధిబలం, ధైర్యం సిద్ధించాలంటే....
హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణమ్
త్రిమూరత్యాత్మక మాత్మస్థం జపాకుసుమ సన్నిభమ్
నానాభూషణ సంయుక్తం ఆంజనేయం నమామ్యహమ్
పంచాక్షర స్థితం దేవం నీల నీరద సన్నిభమ్..!!
పెద్ద చెక్కిళ్లు గలవాడు, వాయుదేవుని వరప్రసాదంతో పుట్టినవాడు, బ్రహ్మచారి, త్రిమూర్తి స్వరూపుడు, ఆత్మజ్ఞాని, మంకెనపువ్వులాగా ఉన్నవాడు, దేదీప్యమానంగా ప్రకాశించే సమస్తమైన నగలను ధరించినవాడు, పంచబీజాక్షరాలతో ఉన్నవాడు, నల్లని మేఘంతో సమానమైనవాడు అయిన హనుమంతుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అర్థం.