అన్వేషించండి

Chanakya Niti : పిల్లల భ‌విష్య‌త్ బాగుండాలంటే చాణ‌క్యుడు చెప్పిన సూచ‌న‌లివే

Chanakya Niti : పిల్లలు ప్ర‌యోజ‌కులుగా మారాలంటే, వారి భ‌విష్య‌త్ బంగారుమ‌యం కావాలంటే తల్లిదండ్రులు ఎలా పెంచాలో చాణక్యుడు స్ప‌ష్టంగా తెలిపాడు.

Chanakya Niti : ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విషయాలు చెప్పాడు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతిబంధకాలను ఎలా దాటాలో కూడా సూచించాడు. ఆనాడు ఆయ‌న‌ చెప్పిన విష‌యాలు ఈనాడు మన జీవితాల‌కు సరిగా సరిపోతున్నాయి. ఆయ‌న‌ సూచనలు, సలహాలు మన జీవన మార్గానికి బాసటగా నిలుస్తున్నాయి. జీవితంలో మనం ఎలా ముందుకెళ్లాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఎలా నడుచుకోవాలో చాణ‌క్యుడు చ‌క్క‌గా వివరించాడు. పిల్లలు ప్ర‌యోజ‌కులుగా మారాలంటే, వారి భ‌విష్య‌త్ బంగారుమ‌యం కావాలంటే తల్లిదండ్రులు ఎలా పెంచాలో స్ప‌ష్టంగా తెలిపాడు. ఆ సూచ‌న‌ల‌ను ఖ‌చ్చితంగా పాటిస్తే మన సంతానం సన్మార్గంలో నడవటం ఖాయమ‌ని వివ‌రించాడు.

సంస్కారం అత్యంత ముఖ్యం
సంస్కారం లేని వాడు వాసన లేని పువ్వు లాంటి వాడు. సంస్కారం లేని వ్య‌క్తికి స‌మాజంలో విలువ ఉండదు. మనిషిలో ఉండే సంస్కారమే అతడిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. పిల్లలను పెంచే క్రమంలో వారికి సంస్కారం అలవాటు చేయాలి. ఎదుటి వారితో మనం ప్రవర్తించే తీరునే సంస్కారం అంటారు. సంస్కారం కరువైతే అందరు దూరమవుతారు. మంచి సంస్కారంతో ఉంటే అందరు దగ్గరకొస్తారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నట్లు పిల్లవాడి నైతిక ప్రవర్తన మీదే అతని సంస్కారం ఆధారపడి ఉంటుంది.

విద్యతోనే భ‌విష్య‌త్‌
విద్య లేని వాడు వింత పశువు అన్నారు. విద్యతోనే వినయం కలుగుతుంది. అందుకే అందరూ చదువుకోవాలి. అది మన భ‌విష్య‌త్‌కు ఉపయోగపడాలి. సరిగా చదువుకోకపోతే మనకు విజ్ఞానం ఉండదు. దీంతో తెలివితేటలు ఉండవు. మంచి విద్యావంతుడు అయితేనే గుణవంతుడుగా మారతాడు. విద్య లేకపోతే ఏమి ఉండదు. భవిష్యత్ అంధకారమే. అందుకే అందరూ చదువుకోవాలి. తల్లిదండ్రుల గౌరవం నిలబెట్టాలి. అప్పుడే స‌మాజంలో స‌మున్న‌త స్థానంలో నిలుస్తారు.

అదుపులో ఉంచాలి
పిల్ల‌ల‌ను అతిగా ముద్దుచేసి, గారాబం చేయడం మంచిది కాద‌ని చాణ‌క్యుడు ఆనాడే చెప్పాడు. పిల్లలను త‌ల్లిదండ్రులు త‌మ అదుపులో ఉంచాల‌ని, వారి అదుపులోకి వెళ్లకూడద‌ని స్ప‌ష్టంచేశాడు. సంతానాన్ని లాలించే సమయంలో లాలించాలి. దండించే దండించాలి. అప్పుడే వారికి భ‌విష్య‌త్‌పై ఓ అవగాహన వస్తుంది. అంతేకాని ఒకడే కొడుకు అని ఒకతే కూతురు అని అతిగా గారాబం చేస్తే వారు ఎందుకు పనికి రాకుండా పోతారు. బ్లాక్ మెయిల్‌కు చేసి త‌ల్లిదండ్రుల‌తోనే అన్ని పనులు చేయించుకుంటారు. మొండిగా ఉండే పిల్లలను సైతం తమ దారికి తెచ్చుకుని, తమ మాట వినేలా తల్లిదండ్రులు చేసుకోవాలి.

పనులు అప్పగించాలి
పిల్లలకు అప్పుడప్పుడు కొన్ని పనులు అప్పగించాలి. చిన్న‌చిన్న ప‌నులు అప్ప‌గించ‌డం ద్వారా వారి కార్య‌ద‌క్ష‌త త‌ల్లిదండ్రులు గుర్తించే అవ‌కాశం ఉంటుంది. అయితే అప్పగించిన పనులు ఎలా చేస్తున్నారో త‌ల్లిదండ్రులు గమనించాలి. ఎలాంటి ఆటంకాలు లేకుండా త‌మ‌కు అప్ప‌గించిన ప‌నులు పిల్ల‌లు పూర్తి చేస్తే మంచిదే. కానీ చెప్పిన పని చేయకుండా ఇతర పనులు చేస్తే కచ్చితంగా దారిలో పెట్టాలి. అప్పగించిన పనులు సరిగా చేసేలా చూడాలి. చిన్నప్పటి నుంచే వారిని ఇలా గాడిలో పెడితే పెరిగాక ఎలాంటి సమస్యలు లేకుండా తన పనులు తాము చేసుకుంటే త‌ల్లిదండ్రుల‌కు కూడా ముచ్చటగా ఉంటుంది. ఇలా ఆచార్య చాణక్యుడు పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
Embed widget