అన్వేషించండి

Swapna Shastra: దేవుడికి పూజ చేసినట్టు కల వచ్చిందా ఎప్పుడైనా - అది దేనికి సంకేతమో తెలుసా!

Dream Meaning : నిద్రపోతున్నప్పుడు రకరకాల కలలు వస్తాయి. కొన్ని కలలు సహజంగా ఉంటే, కొన్ని కలలకు అర్థం ఉండదు. కానీ మీరు భ‌గ‌వంతుడిని పూజించిన‌ట్టు కల వ‌స్తే దాని అర్థం ఏమిటి?

Dream Meaning : నిద్రపోతున్నప్పుడు కలలు కనడం సాధారణం. మనం చూసే కొన్ని కలలు మన భవిష్యత్తుకు సంబంధించినవి అయితే మరికొన్నిటికి  మ‌న‌కు అర్థం తెలియ‌దు. కలలు భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటనలను సూచిస్తుంటాయి. భ‌గ‌వంతుడిని పూజిస్తున్న‌ట్టు మీకు క‌ల వ‌స్తే, అది మీ జీవితంలో గొప్ప మార్పును సూచిస్తుంది. స్వ‌ప్న శాస్త్రం ప్రకారం, మీరు లేదా మీ కుటుంబ సభ్యులు పూజలు చేస్తున్నట్లు కల వస్తే దాని అర్థం ఏమిటో తెలుసుకుందాం.

1. కుటుంబంతో క‌లిసి పూజ‌               

స్వప్న శాస్త్రం ప్రకారం  కుటుంబంతో కలిసి మీరు భ‌గ‌వంతుడిని ఆరాధిస్తున్న‌ట్టుగా మీకు క‌ల వ‌స్తే, అది శుభ సంకేతంగా పరిగణించాలి. దీని అర్థం మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారని, అందులో మీకు మీ మొత్తం కుటుంబం మద్దతు లభిస్తుందని అర్థం. అంతేకాకుండా, ఈ కల విజయాన్ని కూడా సూచిస్తుంది. అలాంటి కలలు మీ అన్ని ప్రయత్నాలలో సానుకూల ఫలితాలను తెస్తాయని నమ్ముతారు.

Also Read : శ‌రీరంపై బల్లి పడితే ఏమ‌వుతుంది..?

2. మీరు పూజ చేస్తున్న‌ట్టు క‌ల‌            

స్వప్న శాస్త్రం ప్రకారం, మీరు స్వ‌యంగా పూజ చేస్తున్న‌ట్టు మీకు క‌ల వ‌స్తే అది కూడా శుభ సంకేతంగా పరిగణించాలి. ఈ కల మీ అచంచలమైన భక్తికి చిహ్నంగా గుర్తించాలి. మీరు భగవంతుని భక్తిలో పూర్తిగా మునిగిపోయారని అర్థం. ఈ కల ఇంట్లో శ్రేయస్సుకు చిహ్నంగా భావించాలి. మీకు అలాంటి కల వస్తే, మీ ఇంట్లో కొన్ని మంచి మార్పులు జరుగుతాయని ముంద‌స్తు సంకేతంగా విశ్వ‌సించాలి. ఇది మీ జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది. అలాంటి కల వ‌చ్చిన వెంట‌నే మీరు లేచి భగవంతుడిని చూడాలి.

3. పూజారులు పూజ చేస్తున్న‌ట్టు క‌ల‌          

స్వ‌ప్న శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి కలలో ఒక పూజారి గుడిలో పూజలు చేయడాన్ని చూస్తే, అది మీ కొన్ని గొప్ప కోరికలు త్వ‌ర‌లోనే నెరవేర‌తాయ‌ని తెలిపే సంకేతం. మీకు ఈ కల వస్తే వెంటనే ఆ ఆలయాన్ని సందర్శించాలి. మీరు చాలా కాలంగా ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటూ వెళ్లలేకపోయినట్లయితే, మీరు వెంటనే ఆలయాల‌ను సందర్శించాలని ఈ కల సూచిస్తుంది.

Also Read : న‌గ‌దు చెల్లించకుండా తీసుకోకూడని వస్తువులు ఇవే - ఎందుకో తెలుసా!

మీ కలలో పై సూచనలను చూడటం మంచి సంకేతం. ఇది మీకు భ‌గ‌వంతుడి అనుగ్ర‌హానికి సంబంధించిన సంకేతాల‌ను ఇస్తుంది. అలాంటి కలలు వచ్చిన వెంటనే భగవంతుని దర్శనం చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోకండి.

Disclaimer : ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

ధనస్సు రాశి ఆగస్టు 16-22 వారఫలం
ధనస్సు రాశి ఆగస్టు 16-22 వారఫలం
వృశ్ఛిక రాశి ఆగస్టు 16-22 వారఫలం
వృశ్ఛిక రాశి ఆగస్టు 16-22 వారఫలం
తులా రాశి ఆగస్టు 16-22 వారఫలం
తులా రాశి ఆగస్టు 16-22 వారఫలం
కన్యా రాశి ఆగస్టు 16-22 వారఫలం
కన్యా రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Embed widget