By: ABP Desam | Updated at : 06 Apr 2022 06:49 PM (IST)
Edited By: RamaLakshmibai
Sri Ram Navami 2022
త్రిలోకసంచారి అయిన నారదుడు...ఓసారి శ్రీహరి దర్శనార్థం వైకుంఠానికి వెళ్లాడు. భక్తితో నమస్కరించి..స్వామీ రామనామం మహిమ గురించి తెలుసుకోవాలి అనుకుంటన్నాను అన్నాడు. అయ్యో నారదా నీకు రామనామం గురించి తెలియదా..అదిగో ఆ చెట్టుకొమ్మపై చిలుక ఉంది అడుగు అని చెప్పాడు శ్రీహరి. ఆ ఆజ్ఞను శిరసావహించి నారదుడు చెట్టు దగ్గరకు వెళ్లాడు.
చిలుకను ప్రశ్నించిన నారదుడు: ఓ చిలుకా! రామ అంటే నీకు అర్ధం తెలుసా అని ప్రశ్నించాడు. 'రామ అనే శబ్దం వినేటప్పటికీ ఆ చిలుక చెట్టుపై నుంచి కిందపడి ప్రాణం విడిచింది. అదేంటి రామా అంటే అర్థం ప్రాణం పోవడమా ఇలా జరిగిందేటంని మళ్లీ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి మీరు చెప్పినట్టే చిలుకలను అడిగితే అది వెంటనే కిందపడి ప్రాణం వదిలింది. ఆ చిలుక చావుకు నేను కారకకుడను. ఎంత పాపం చేశానని బాధపడ్డాడు. ఓదార్చిన నారాయణకుడు బాధపడకు నారదా..భూలోకంలో ఓ బ్రాహ్మణుడి ఇంట్లో ఓ ఆవుకు దూడ పుట్టింది వెళ్లి ఆ దూడను అడుగు అన్నాడు. సరే అని చెప్పినప్పటికీ నారదుడికి భయం వేసింది.
Also Read: ఈ లక్షణాలుంటే మీరు కూడా రాముడే-దేవుడే
దూడను ప్రశ్నించిన నారదుడు: చిలుక లానే ఆవుదూడ కూడా చనిపోతే ఆ యజమాని తనను కొరడా పట్టుకుని కొడతాడేమో అనుకుంటాడు. ఏదైనా కానీ రామానామం మహిమ, అర్థం తెలుసుకోవాల్సిందే అనుకుంటూ ఆ దూడ దగ్గరకు వెళ్లి 'ఓ దూడా! రామ అంటే అర్ధం ఏంటి అని అడిగాడు. తక్షణమే ఆ దూడ కూడా ప్రాణం విడుస్తుంది. అనుకున్నంతా అయిందనుకున్న నారదుడు అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. మళ్లీ నారాయణుని వద్దకు వెళ్లి స్వామీ! ఆవు దూడకు కూడా చిలుకకు పట్టిన గతే పట్టింది. దీని అర్ధం ఇంతేనా అని అడిగాడు.
రాకుమారుడిని ప్రశ్నించిన నారదుడు: నారదా... ఇప్పుడే ఓ మహారాజుకు లేక లేక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని అడుగు అన్నాడు. దైవాజ్ఞకు ఎదురు చెప్పలేక నారదుడు బయలుదేరాడు. కానీ కొంతదూరం పోయి వెనుకకు తిరిగి వచ్చాడు. ఆ చిలుకకు, దూడకు ఎవ్వరూ లేరుకాబట్టి నాకేం కాలేదు కానీ ఇప్పుడా రాకుమారుడికి ఏమైనా జరిగితే పరిస్థితేంటి నాకు నీ దర్శనం కూడా లేకుండా పోతుందంటీనే... సరే ఏం జరిగినా అంతా నీదే భారం అనుకుంటూ రాజ్యానికి వెళతాడు. వారసుడు పుట్టినందుకు సంతోషించిన ఆ రాజు నారదుడిని చూసి సకల మర్యాదలతో ఆహ్వానం పలుకుతాడు. మీరు మంచి సమయానికి వచ్చారు. లేక లేక నాకు కుమారుడు జన్మించాడు. మీరు ఆశీర్వదించండి అని ప్రార్థిస్తాడు. లోపల భయం ఉన్నప్పటికీ చిరునవ్వులు చిందిస్తూ రాకుమారుడిని చేతుల్లోకి తీసుకుంటాడు నారదుడు.
Also Read: రాముడి కోదండం ఆకారంలో ఆలయం, చుట్టూ రామాయణ ఘట్టాలు, ఈ అద్భుత ఆలయాన్ని ఒక్కసారైనా చూసితీరాల్సిందే
తన సందేహం తీర్చుకునే సమయం ఆసన్నమైనదనుకుని నాయనా! రాజకుమారా! శతమానం భవతి, అంటూ వేదమంత్రాలను చదువుతూ మంత్రాలతో కలసి పోయేటట్లుగా సంస్కృతంలో, ఓ రాజకుమారా! రామ అంటే అర్ధం ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్ని వింటూనే రాజకుమారుడు నవ్వుతాడు. హమ్మయ్య బతికిపోయాను రాకుమారుడికి ఏం కాలేదని అనుకుంటాడు నారదుడు. అప్పుడు ఆ చిన్నారి ఇలా చెబుతాడు...'బ్రహ్మమానసపుత్రా! సర్వం తెలిసిన మీకు రామనామం అర్థం, మహిమ తెలియదా... నేను చెట్టు మీద చిలుకగా ఉన్నప్పుడు మీరు వచ్చి రామనామం అర్ధం ఏంటని ప్రశ్నించారు. ఒక్కసారి రామనామం వినేసరికి నా జన్మ సార్థకమైంది. వెంటనే దేహాన్ని విసర్జించి ఒక బ్రాహ్మణుని ఇంట ఆవు దూడనై పుట్టాను. మీరు అక్కడికి వచ్చి అదే ప్రశ్న వేసారు. రెండవసారి రామనామం విని ఆ జన్మను కూడ విసర్జించి ఇప్పుడు రాజకుమారుడిగా పుట్టాను అన్నాడు.
పక్షి, ఆవుదూడ, రాకుమారుడు...అంటే రామనామ శ్రవణంలోనే ఇంత మహిమ ఉంటే రామానామ కీర్తనం వల్ల ముక్తికలుగుతుందనడంలో సందేహం లేదంటారు పండితులు. ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ పొందుతామని... ఈ జన్మలో అంతఃకరణ శుద్ధికి, మరుజన్మ లేకుండా ఉండేందుకు రామనామ కీర్తనం చేయాలంటారు.
ఎవరి విశ్వాసాలు వారివి..ఏ మత గ్రంధం అయినా మంచి నేర్చుకోమని, చెడును వదిలేయాలనే చెబుతుంది. అందులో భాగమే ఇలాంటి పురాణ కథలు...వీటిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...
Panchang 3 July 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, అనారోగ్యాన్ని తొలగించే సూర్యుడి శ్లోకం
Rath Yatra 2022: పూరీ ఆలయంపై పక్షులు ఎందుకు ఎగరవో తెలుసా? ఆ చక్రానికి, విమానాలకు లింక్ ఏంటి?
Tirumala Brahmotsavam 2022 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, రెండేళ్ల తర్వాత అత్యంత వైభవంగా
Horoscope 2nd July 2022: ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉండదు, జులై 2 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Panchang 2nd July 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఏలినాటి, అష్టమ, అర్దాష్టమ శనిదోష నివారణ స్తోత్రం
Krishna Vamsi: రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్ - కృష్ణవంశీపై అంత నమ్మకమా?
Vi Hotstar Plan: రూ.151కే మూడు నెలల హాట్‌స్టార్ - డేటా కూడా - వీఐ సూపర్ ప్లాన్!
Actress Arrested: పోలీస్ ఆఫీసర్ ని కరిచిన నటి - పూణేలో అరెస్ట్
Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !