అన్వేషించండి

Sri Kurmam Temple : శ్రీ మహా విష్ణు అవతారమైన కూర్మ జయంతి , శ్రీకూర్మంలో ఘనంగా ఏర్పాట్లు

శ్రీకూర్మ జయంతి వేడుకలకు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకూర్మం ముస్తాబైంది. ఏటా జ్యేష్ఠ బహుళ ద్వాదశి రోజున కూర్మనాథుని జయంతి నిర్వహిస్తారు. జ్యేష్ఠ బహుళ ద్వాదశి ( జూన్ 25) రోజు కూర్మ జయంతి

మంధనాచల ధారణ హేతో, దేవాసుర పరిపాలవిభో 
కూర్మాకార శరీర నమో, భక్తం తే పరిపాలయమామ్

జూన్ 25 శనివారం కూర్మజయంతి సందర్భంగా శ్రీకూర్మం ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు. స్వామివారికి నిత్యప్రాభోదిక సేవ, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఉత్సవమూర్తులను ముఖమండపంలో ప్రత్యేక వేదికపై ఉంచి వేడుకలు జరుపుతారు.

త్రిమతాచార్యుల సందర్శన
శ్రీ కూర్మనాథ క్షేత్రాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రతిష్టించినట్టు స్థలపురాణం చెబుతోంది. శ్వేతరాజు తపోఫలంగా శ్రీకూర్మనాథస్వామి ఇక్కడ వెలసినట్టు పద్మ, బ్రహ్మాండ పురాణాలద్వారా తెలుస్తోంది. ఆలయం ఎప్పు డు నిర్మింతమైందన్నదానికి చారిత్రక ఆధారాలు లేవు. నాలుగో శతాబ్ధం నుంచి 14, 16 శతాబ్ధాల వరకూ ఏయే రాజులు ఈ ఆలయాభివృద్ధికి ఎంతెంత ఇచ్చారన్నది శాసనాల ద్వారా వివరించారు. 1135లో అనంతవర్మ చోళగంగదేవుడు దండయాత్రలు చేస్తూ పశ్చిమోత్తర దేశాన్ని జయించినట్టు ఒక శాసనంలో ఉంది. 12వ శతాబ్దానికి పూర్వం దీనిని శైవక్షేత్రంగా వ్యవహరించేవారని ఒక వాదన ఉంది. ఈ ఆలయం పైభాగం అష్టదశ పద్మాకారంలో ఉంటుంది. ద్వారాలపై చక్కని శిల్పసంపద కనిపి స్తోంది. ఆలయానికి రెండు ధ్వజస్తంభాలు ఉండడం విశేషం. సాధారణంగా ఆల యాల్లో మూలవిరాట్ తూర్పునకు అభిముఖంగా ఉండడం చూస్తుంటాం కానీ.. ఈ క్షేత్రంలో స్వామివిగ్రహం పశ్చిమాభిముఖంగా ఉండడం విశేషం. అపురూపమై న శిల్పసంపదలతో చుట్టూ అందమైన శిల్పాల స్తంభాలతో ప్రదక్షణ మండపం ఉంది. ఎదురుగా శ్వేతపుష్కరిణి ఉంది. ఇందులో స్నానం చేసి భక్తులు స్వామిని దర్శించుకుంటారు. రామానుజాచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యుని శిష్యుడైన నరహరి తీర్ధా లు స్వామిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. లవకుశలు, బలరాముడు, జయదే వమహాకవి, శ్రీనాథ కవి, జాబాలి, వక్రాంగధుడు, నారదమహాముని కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించారని చెబుతారు. శివుడుక్షేత్రపాలకుడిగా ఉన్న ఈ క్షేత్రంలో పితృకార్యాలు ఆచరించి అస్తికలు నిమజ్జనం చేస్తే అవి కొద్దిరోజులకు సాలగ్రామాలుగా మారుతాయని పురాణాల్లో ప్రస్తావించారు. 

Also Read: ఈ ఆలయం నుంచి వారణాసికి సొరంగ మార్గం! ఇక్కడ పుష్కరిణిలో అస్తికలు కలిపితే గంగలో కలిపినట్టే!

జూన్ 25న కూర్మజయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు అధికారులు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కూర్మావతారంలో దర్శనమిచ్చే ఆలయం ఇదొక్కటే. అందుకే జీవితకాలంలో ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకోవాలని చెబుతారు. 

శ్రీ కూర్మ స్తోత్రం :-
నమామి తే దేవ పదారవిందం
ప్రపన్న తాపోప శమాతపత్రం 
యన్మూలకేతా యతయోఽ౦జసోరు
సంసారదుఃఖం బహిరుత్క్షిపంతి

ధాతర్యదస్మిన్భవ ఈశ జీవా
స్తాపత్రయేణోపహతా న శర్మ 
ఆత్మన్లభంతే భగవంస్తవాంఘ్రి
చ్ఛాయాం స విద్యామత 
ఆశ్రయేమ 

మార్గంతి యత్తే ముఖపద్మనీడై
శ్ఛన్దస్సుపర్ణైరృషయో వివిక్తే 
యస్యాఘమర్షోదసరిద్వరాయాః
పదం పదం తీర్థపదః ప్రపన్నాః 

యచ్ఛ్రద్ధయా శ్రుతవత్యా చ భక్త్యా
సంమృజ్యమానే హృదయేఽవధాయ 
జ్ఞానేన వైరాగ్యబలేన ధీరా
వ్రజేమ తత్తేఽ౦ఘ్రి సరోజపీఠమ్ 

విశ్వస్య జన్మస్థితిసంయమార్థే
కృతావతారస్య పదాంబుజం తే 
వ్రజేమ సర్వే శరణం యదీశ
స్మృతం ప్రయచ్ఛత్యభయం స్వపుంసామ్ 

యత్సానుబంధేఽసతి దేహగేహే
మమాహమిత్యూఢ దురాగ్రహాణాం 
పుంసాం సుదూరం వసతోపి పుర్యాం
భజేమ తత్తే భగవన్పదాబ్జమ్

తాన్వా అసద్వృత్తిభిరక్షిభిర్యే
పరాహృతాంతర్మనసః పరేశ 
అథో న పశ్యన్త్యురుగాయ నూనం
యేతే పదన్యాస విలాసలక్ష్మ్యాః 

పానేన తే దేవ కథాసుధాయాః
ప్రవృద్ధభక్త్యా విశదాశయా యే 
వైరాగ్యసారం ప్రతిలభ్య బోధం
యథాఞ్జసాన్వీయురకుంఠధిష్ణ్యమ్ 

తథాపరే చాత్మసమాధియోగ-
బలేన జిత్వా ప్రకృతిం బలిష్ఠాం 
త్వామేవ ధీరాః పురుషం విశన్తి
తేషాం శ్రమః స్యాన్న తు సేవయా తే 

తత్తే వయం లోకసిసృక్షయాద్య
త్వయానుసృష్టాస్త్రిభిరాత్మభిః స్మ 
సర్వే వియుక్తాః స్వవిహారతంత్రం
న శక్నుమస్తత్ప్రతిహర్తవే తే 

యావద్బలిం తేఽజ హరామ కాలే
యథా వయం చాన్నమదామ యత్ర 
యథో భయేషాం త ఇమే హి లోకా
బలిం హరన్తోఽన్న మదన్త్యనూహాః 

త్వం నః సురాణామసి సాన్వయానాం
కూటస్థ ఆద్యః పురుషః పురాణః 
త్వం దేవశక్త్యాం గుణకర్మయోనౌ
రేతస్త్వజాయాం కవిమాదధేఽజః 

తతో వయం సత్ప్రముఖా యదర్థే
బభూవిమాత్మన్కరవామ కిం తే 
త్వం నః స్వచక్షుః పరిదేహి శక్త్యా
దేవ క్రియార్థే యదను గ్రహాణామ్

ఇతి శ్రీమద్భాగవతే కూర్మస్తోత్తం

Also Read: శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ram Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP DesamGame Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Embed widget