అన్వేషించండి

Spirituality: దేశంలో ముఖ్యమైన ఈ 10 ఆలయాల్లో ప్రసాదం చాలా ప్రత్యేకం!

ప్రసాదం అంటే ఆ రుచే వేరు. చాలా ఆలయాల్లో కామన్ గా ఇచ్చే ప్రసాదాలే ఎక్కువ. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే పది ఆలయాల్లో ప్రసాదం మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది.

Spirituality:  ప్ర‌పంచంలో ఏ హిందూ ఆల‌యంలోకి వెళ్లినా స‌రే కచ్చితంగా పూజ‌లు, అభిషేకాలు, హార‌తి  కార్య‌క్ర‌మాలు ముగిశాక భ‌క్తుల‌కు ప్ర‌సాదం అందిస్తారు. దేవుడి నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికీ ఇస్తారు.  దేవుడి చూపు ప్రసరించిన ఆ పదార్థం తినడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. సాధారణంగా ప్రసాదం అంటే పులిహోర, లడ్డు, దద్ధ్యోజనం, పొంగలి ఇలా ఉంటాయి. కానీ కొన్ని ఆలయాల్లో వాటితో పాటూ ప్రత్యేక ప్రసాదాలుంటాయి. అలాంటి పది ఆలయాల్లో అందించే భిన్నరకాల ప్రసాదాల గురించి ఇప్పడు చూద్దాం.

పూరీ జ‌గ‌న్నాథ్ ఆల‌యం
ఈ ఆల‌యంలో ప్ర‌సాదాన్ని మ‌హాప్ర‌సాదంగా భావిస్తారు. రోజుకు మొత్తం 6 సార్లు స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్ర‌సాదం పంచి పెడ‌తారు. కేవ‌లం మట్టికుండ‌ల్లో మంట‌పై మాత్ర‌మే ప్ర‌సాదాన్ని వండుతారు. ముందుగా దేవుడికి నైవేద్యం పెట్టాకే ప్ర‌సాదాన్ని పంచి పెడ‌తారు. అర‌టి ఆకుల‌పై ప్ర‌సాదాన్ని భ‌క్తుల‌కు అంద‌జేస్తారు. అందులో 56 ర‌కాల ప‌దార్థాలు ఉంటాయి. అందుక‌నే దాన్ని మ‌హాప్ర‌సాదం అని పిలుస్తారు.

Also Read: పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, పెద్దమ్మ వీళ్లంతా పార్వతీదేవి సంతానమే - పోతురాజు సృష్టికర్త శివుడు!

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స్వామి ఆల‌యం
కేర‌ళ‌లో ఉన్న శబరిమల ఆలయంలో ప్రసాదం చాలా ప్రత్యేకం. ఇది ఈ ఆలయంలో తప్ప మరే ఆలయంలోనూ ఉండదు. 18 మెట్లు ఎక్కి భగవంతుడికి ఇరుముడి సమర్పిస్తారు. స్వామిని దర్శించుకుని వచ్చిన భక్తులకు  అప్పం, అర‌వ‌ణ పాయ‌సం అన‌బ‌డే ప్ర‌సాదాల‌ను పంచి పెడ‌తారు.

శ్రీ‌కృష్ణ ఆల‌యం, అంబ్ల‌పుర‌, కేర‌ళ
ఈ ఆల‌యంలో బియ్యంతో వండిన వంట‌కాన్ని ప్ర‌సాదంగా అందిస్తారు. దాన్ని పాల్పాయ‌సంగా పిలుస్తారు. ఇది చాలా భిన్న‌మైన రుచి క‌లిగి ఉంటుంది. ఇందులో ఏమేం పదార్థాల‌ను ఉప‌యోగిస్తారో ఇప్ప‌టికీ ఎవ‌రికీ తెలియ‌దు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర ఆల‌యం, తిరుప‌తి
తిరుపతిలో ల‌డ్డూ ప్రసాదం గురించి అందరికీ తెలుసు. ఈ ల‌డ్డూకు జియోగ్రాఫిక‌ల్ కాపీ రైట్స్ కూడా ల‌భించాయి. మొత్తం 2 ర‌కాల సైజుల్లో ల‌డ్డూల‌ను అందిస్తారు. ఒక ట‌న్ను శ‌న‌గ‌పిండి, 10 ట‌న్నుల చ‌క్కెర‌, 700 కిలోల జీడిప‌ప్పు, 150 కిలోల యాల‌కులు, 300 నుంచి 500 లీట‌ర్ల నెయ్యి, 500 కేజీల చ‌క్కెర పాకం, 540 కేజీల కిస్మిస్‌లు వేసి నిత్యం ల‌డ్డూల‌ను త‌యారు చేస్తారు. శ్రీ‌వారి ల‌డ్డూకు 300 ఏళ్ల‌కు పైగా చ‌రిత్ర ఉంది. ల‌డ్డూ ప్ర‌సాదాన్ని భ‌క్తులు ప‌ర‌మ‌ప‌విత్ర‌మైన‌దిగా భావిస్తారు. 

Also Read: గ్రామానికి, కుటుంబానికి ఆపద రాకూడదంటూ సమర్పించే బోనం, ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు!

అలగార్ కోవిల్, త‌మిళ‌నాడు 

మ‌ధురై నుంచి ఈ ఆల‌యం సుమారుగా 21 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆల‌యానికి స‌మీపంలో ఉన్న అనేక మంది రైతులు ఇక్క‌డికి బియ్యం, తృణధాన్యాలు తీసుకువ‌స్తారు. ఆ ధాన్యాల‌తో దోశ‌ల‌ు వేసి నైవేద్యం పెడతారు. అనంత‌రం వాటిని భ‌క్తులు ప్ర‌సాదంగా స్వీక‌రిస్తారు.

చైనీస్ కాళీ ఆల‌యం, కోల్‌క‌తా
చైనా నుంచి కోల్‌క‌తాకు వ‌చ్చిన‌వారు ఈ ఆల‌యాన్ని నిర్మించారు. అందువ‌ల్ల ఈ ఆల‌యం ఉన్న ప్రాంతాన్ని చైనాటౌన్ ఆఫ్ కోల్‌క‌తా అని కూడా పిలుస్తారు. ఇందులో చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ అయిన నూడుల్స్‌, చాప్సే, ఫ్రైడ్ రైస్‌ల‌ను ప్ర‌సాదంగా పంచి పెడ‌తారు

ధ‌ర్మ‌స్థ‌ల మంజునాథ స్వామి ఆల‌యం, క‌ర్ణాట‌క
క‌ర్ణాట‌క‌లోని నేత్రావ‌తి న‌దీ తీరంలో ఈ ఆల‌యం ఉంది. ఇక్క‌డ శివ‌పార్వ‌తుల‌ను చంద్ర‌నాథ్‌, మంజునాథ‌, అమ్మ‌న‌వారుగా భ‌క్తులు పూజిస్తారు. ఈ ఆల‌యంలో అన్నాన్నే ప్ర‌సాదంగా స్వీక‌రిస్తారు. నిత్యం 10వేల మందికి ఇక్క‌డ అన్న‌దానం చేస్తారు.

గోల్డెన్ టెంపుల్‌, అమృత‌స‌ర్
సిక్కులు ఈ టెంపుల్‌ను అత్యంత ప‌విత్ర‌మైందిగా భావిస్తారు. ఇక్క‌డ‌కి ఏటా కొన్ని ల‌క్ష‌ల సంఖ్య‌లో భ‌క్తులు వ‌స్తుంటారు. దాదాపుగా అనేక మ‌తాల‌కు చెందిన వారు ఈ టెంపుల్‌ను సంద‌ర్శిస్తారు. ఇక్క‌డ 100 క్వింటాళ్ల గోధుమ పిండిని ఉపయోగించి నిత్యం రొట్టెల‌ను త‌యారు చేస్తారు. వాటినే ఇక్క‌డ ప్ర‌సాదంగా పెడ‌తారు. 25 క్వింటాళ్ల తృణ‌ధాన్యాల‌తో రొట్టెల్లోకి కూర చేస్తారు. వంటల్లో ఉల్లి, వెల్లుల్లి నిషిధ్ధం.  మ‌రో 10 క్వింటాళ్ల బియ్యంతో అన్నం వండి వ‌డ్డిస్తారు. 

గ‌ణ‌ప‌తిపూలె ఆల‌యం, మ‌హారాష్ట్ర
ఈ ఆలయంలో కొలువైన వినాయకుడికి కిచ్‌డీ, ప‌చ్చ‌ళ్లు, బూందీ ప్ర‌సాదంగా పెడ‌తారు. సాయంత్రం వేళ‌ల్లో మ‌సాలా రైస్‌, ప‌చ్చ‌ళ్లు సమర్పిస్తారు.  

వైష్ణోదేవి, కాట్రా, జ‌మ్మూ అండ్ కాశ్మీర్
ఈ ఆల‌యానికి ఏటా వేల సంఖ్య‌లో భ‌క్తులు వ‌స్తుంటారు. ఇక్క‌డ ప్ర‌సాదాన్ని ప్లాస్టిక్ ప్యాకెట్ల‌లో పెట్టి ఇస్తారు. అందులో కొబ్బ‌రి, చ‌క్కెర ఉండ‌లు, డ్రై యాపిల్స్ ఉంటాయి. వాటిని భ‌క్తులు ప్ర‌సాదాలుగా స్వీక‌రిస్తారు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget