Solar Eclipse : 2025 లో సూర్యగ్రహణం రోజే శని సంచారంలో మార్పు.. ఈ 3 రాశులవారికి అదృష్టం మామూలుగా ఉండదు!
Solar Eclipse and Saturn Transit in 2025: సూర్య గ్రహణం రోజే శని రాశి పరివర్తనం చెందుతోంది... ఈ సంచారం కొన్ని రాశులవారికి అదృష్టాన్నిస్తోంది...
Coincidence of Solar Eclipse and Saturn Transit in 2025: 2024కి గుడ్ బై చెప్పేసి 2025కి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారంతా. అయితే కొత్త ఏడాదిలో ఏర్పడే మొదటి సూర్య గ్రహణం రోజే శని సంచారంలో మార్పు జరుగుతోంది. సూర్యుడి పుత్రుడు శని దేవుడు. గ్రహణం రోజు శని రాశిమార్పు ప్రభావం కొన్ని రాశులవారికి అదృష్టాన్నిస్తుంది
2025 మార్చి 29 న పాక్షిక సూర్య గ్రహణం
మార్చి 29 ఫాల్గుణ బహుళ అమావాస్య శనివారం రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణం బెర్ముడా , ఫోర్చుగల్, కెనడా, USA, మెక్సికో ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, జర్మనీ, డెన్మార్క్, నార్వే , స్వీడన్ సహా పలు దేశాల్లో కనిపిస్తుంది. మన దేశంలో ఎక్కడా కనిపించదు. అందుకే ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు..
అయితే ఈ గ్రహణం రోజే శని భగవానుడు రాశి పరివర్తనం చెందుతాడు. రెండున్నరేళ్లకోసారి రాశి మారే శని... 2025 మార్చి 29న కుంభం నుంచి మీన రాశిలోకి పరివర్తనం చెందుతాడు. సూర్య గ్రహణం రోజే శని రాశి పరివర్తనం కొన్ని రాశులవారికి శుభం జరుగుతుంది.
Also Read: 2024 డిసెంబర్ 23 to 29 ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల వారఫలాలు!
మిథున రాశి
శని సంచారం , సూర్యగ్రహణం మిథునరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారస్తులు ఊహించని విధంగా ఆర్థిక లాభాలు పొందుతారు. ఎప్పటి నుంచో వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. యువత కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఏ పని చేసినా కలిసొస్తుంది. ఉద్యోగుసు కార్యాలయంలో పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది. విద్యార్థులకు శుభసమయం.
ధనుస్సు రాశి
ఈ రాశి విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. నూతన విషయాలు అధ్యయనంపై ఆసక్తి పెరుగుతుంది. కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరించేందుకు ఇదే మంచి సమయం. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Also Read: 2025 కి స్వాగతం పలికే ముందు సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల వారఫలాలు
మకర రాశి
సూర్యగ్రహణం , శని సంచార కలయిక మకర రాశి వారికి ఫలప్రదంగా ఉంటుంది. ఆస్తికి సంబంధించి కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు మునుపటి పెట్టుబడుల నుంచి ఆర్థిక లాభాలు అందుకుంటారు. అదే సమయంలో, కెరీర్‌కు సంబంధించి కొనసాగుతున్న ఆందోళనలు తొలగిపోతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది.
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం
నీలాంజనం అంటే నల్లటి కాటుక రూపంలో ఉండేవాడు. రవిపుత్రం అంటే సూర్యభగవానుడి పుత్రుడు. యమాగ్రజం అంటే యముడికి సోదరుడు. ఛాయా మార్తాండ సంభూతం అంటే ఛాయా దేవికి మార్తాండుడికి అంటే సూర్య భగవానుడికి జన్మించినటువాడు అని అర్థం. అలాంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నా అని అర్థం.
Also Read: కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2025 - శని నుంచి విముక్తి , ఆర్థిక వృద్ధి, మానసిక ఆనందం ఉంటుంది కానీ..!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.