Nava Grahalu: నవ గ్రహాల అనుగ్రహం కావాలా? సింపుల్‌గా ఇలా చెయ్యండి చాలు.. అన్ని సమస్యలు తొలగిపోతాయ్
నిత్యం ఎన్నో బాధలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇందుకు కారణం ఆ నవ గ్రహాలే. వాటిని ప్రసన్నం చేసుకుంటేనే మనం సుఖసంతోషాలతో ఉండగలం. అందుకు ఈ చిన్న చిన్న పరిష్కారాలను ప్రయత్నించి చూడండి. కష్టాలు తొలగిపోవచ్చు.
Nava Grahalu: జ్యోతిష్యశాస్త్రలో నవ గ్రహాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఒక మనిషి పుట్టిన దగ్గరి నుంచి చనిపోయే వరకు వాళ్ళ భూత, భవిష్యత్, వర్తమానాలను గ్రహాల కదలిక ఆధారంగా జ్యోతిష్యులు అంచనా వేస్తారు. అయితే కొందరి జాతకాలలో గ్రహాలు బాగా లేవని వారి కష్టాలు ఆయా గ్రహాల నీచత్వ కారణంగానే అని పండితులు చెప్తుంటారు. వాటి నివారణ కోసం పెద్ద పెద్ద పూజలు చేయించుకోమని సూచిస్తుంటారు. అయితే ఆ పూజలకు వేలకు వేల రూపాయలు ఖర్చు అవుతుంటాయి. కొన్ని సార్లు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కూడా పూజలు హోమాలు చేస్తుంటారు. అంత డబ్బు ఖర్చు పెట్టి పూజలు యాగాలు చేయలేని వారికోసమే పరిహార శాస్త్రంలో చిన్న చిన్న రెమిడీలు ఉన్నాయని తంత్ర శాస్త్రికులు చెప్తున్నారు. ఆ రెమిడీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యుడు:
నవగ్రహాలలో అత్యంత ముఖ్యమైనది రవి గ్రహం. అధికారానికి, ఆరోగ్యానికి, రాజకీయంగా ఎదుగుదలకు రవి కారకుడు. రవి గ్రహ అనుగ్రహం కోసం తల్లిదండ్రులను గౌరవించాలి. వారికి ఎప్పుడూ సేవ చేస్తుండాలి. జాతకంలో సూర్యుడి స్థితిని అనుసరించి ఎవరి నుంచి ఏ వస్తువు ఉచితంగా తీసుకోకూడదు.
చంద్రుడు:
నవగ్రహాల్లో చంద్రుడు రెండవ గ్రహం. చంద్రడు మనః కారకుడు. క్రీడా, సినీ రంగాల్లో రాణించడానికి చంద్రబలం చాలా అవసరం. చంద్ర గ్రహ అనుకూలత కోసం ఎప్పుడూ తల్లిదండ్రులను గౌరవించాలి. జాతకంలో చంద్రుడు యొక్క స్థితిని తెలుసుకుని పాలు, నీళ్ళు ఎవరికీ ఉచితంగా ఇవ్వకూడదు. మాంసాహారం తినరాదు.
కుజుడు:
నవగ్రహాల్లో మూడో గ్రహం కుజుడు. కుజుడు భూమి సంబంధమైన సంపదలకు కారకుడు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలన్నా.. కోట్లు సంపాదించాలన్నా సంపూర్ణమైన కుజ బలం ఉండాల్సిందే.అయితే జాతక చక్రంలో కుజుడి యొక్క స్థితిని ఆధారంగా కొందరు చక్కెర వ్యాపారం చేయరాదు. మరియు వికలాంగులకు దూరంగా ఉండాలి.
Also Read: జూన్ 30 రాశి ఫలాలు: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి - దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది
బుధుడు:
నవ గ్రహాల్లో అత్యంత తెలివైన గ్రహం బుధుడు. వ్యాపారంలో రాణించాలన్నా.. అఖండమైన పరిజ్ఞానాన్ని పొందాలన్నా బుధ గ్రహ బలం ముఖ్యం. ఇక జాతకంలో బుధ గ్రహం యొక్క స్థితిని ఆధారంగా చూసుకుని మాంసాహారం గుడ్లు చేపలు తినరాదు. మేనమామను ఆదరించాలి. యోగక్షేమాలు చూసుకోవాలి. అప్పుడే బుధుడు కరుణిస్తాడని పండితులు చెప్తున్నారు.
గురువు:
నవగ్రహాల్లో అత్యంత శుభప్రదమైన గ్రహం గురు గ్రహం. గురు గ్రహాన్నే బృహస్పతి అంగారక గ్రహం అని కూడా పిలుస్తారు. అఖండమైన ఆర్థిక యోగాన్ని, విద్యాయోగాన్ని కలిగించేదే గురుగ్రహం. గురు గ్రహ అనుగ్రహం కోసం ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలి. రోజు పసుపును పాలతో కలిపి నుదుటన బొట్టు పెట్టుకోవాలి. ఆడవారు అయితే ముఖానికి పసుపు రాసుకోవాలి.
శుక్రడు:
సమస్త భోగభాగ్యాలను ప్రసాదించేదే శుక్ర గ్రహం. ఒక మనిషి అఖండమైన రాజయోగంతో బతుకుతుంటే అయనకు శుక్రదశ తిరిగింది అంటారు. అత్యంత విలాసవంతమైన జీవితాన్ని కూడా శుక్రుడే అనుగ్రమం వల్లే కలుగుతుంది. అటువంటి శుక్రుడి అనుగ్రహం కలగాలంటే ఇంటి ఆడ పిల్లలను గౌరవించాలి. ఆదరించాలి. ఒకవేళ ఇంటిలో ఆడపిల్లలు లేకుంటే మేనత్తను గౌరవించాలి. అత్త కూడా లేకుంటే కన్నతల్లిని గౌరవించాలి. అప్పుడే శుక్రుడి అనుగ్రమం లభిస్తుందంటున్నారు పండితులు.
శని:
నవగ్రహాల్లో శని ఎంతటి భయాన్ని కల్గిస్తాడో అంతకన్నా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే గ్రహం. మనిషి ఆయుర్ధాయానికి శని గ్రహమే కారణం. అటువంటి శని గ్రహం అనుకూలించాలి అంటే ఇంట్లో పని మనుషులను చికాకు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పనివారికి తగినంత జీతం ఇవ్వాలి. ఇంట్లో పని వారు లేకుంటే బీద సాదలను వికలాంగులను ఆదరించాలి. అప్పుడే శని చల్లని చూపు మన మీద పడుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు.
రాహువు:
మనుషుల అనూహ్య ఎదుగుదలకు, పతనానికి రాహువే కారకుడు. క్రమశిక్షణకు కారకుడు రాహు గ్రహం. అంటువంటి రాహు గ్రహం అనుగ్రహం కోసం జాతకంలో రాహువు స్థితి ఆధారంగా బ్లూ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్సులు వేసుకోరాదు. అలాగే కుక్కలను పెంచరాదు. కుక్కలను పెంచినట్లయితే రాహువు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు.
కేతువు:
నవగ్రహాల్లో ఆఖరి గ్రహం కేతు గ్రహం. జాతకంలో కేతువు ఉచ్చ స్థితిలో ఉంటే ఆ వ్యక్తి ఏ రంగంలో ఉన్నా నెంబర్ వన్ పొజిషన్‌కు వెళ్తాడని జ్యోతిష్యులు చెప్తున్నారు. అటువంటి కేతు గ్రహం అనుగ్రహం కోసం జాతకంలో కేతువు ఉన్న స్థితి ఆధారంగా తప్పుడు వాగ్దానాలు చేయకూడదట. అలాగే సంతానం లేని వారి నుంచి భూమిని కొనరాదని జ్యోతిష్యులు చెప్తుంన్నారు.
ఈ చిన్న పరిహారాలు పాటిస్తే.. నవగ్రహాల అనుగ్రహం కలగడంతో పాటు జీవితంలో ఉన్నతి స్థితికి వెళ్తారని పండితులు చెప్తున్నారు. వీటిని పాటించే ముందు తమ వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్యుల దగ్గర తెలుసుకున్న తర్వాతే పాటించాలని సూచిస్తున్నారు.
ALSO READ: యక్షిణిలు ఎవరు ? భూమ్మీద ఉన్నారా - యక్షిణి సాధన ఎందుకు చేస్తారు..ఎవరు చేస్తారు!