Rudraksha Rules in Telugu: రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ నియమాలు తప్పక పాటించాలి, లేకపోతే?
రుద్రాక్ష సాక్ష్యాత్తు ఆ పరమ శివుడి కన్నీళ్ల నుంచి ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. రుద్రాక్ష ధరించేందుకు తప్పని సరిగా కొన్ని నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు.
రుద్రాక్ష సాక్ష్యాత్తు ఆ పరమ శివుడి కన్నీళ్ల నుంచి ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. రుద్రాక్షను పవిత్రమైందిగా భావిస్తారు. రుద్రాక్ష ధరించేందుకు తప్పని సరిగా కొన్ని నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు.
మహాదేవుడు, మహా శివుడి కంటి నుంచి రాలిన అశ్రుబిందువు రుద్రాక్షగా మారింది. దీనికి ప్రత్యేకమైన హీలింగ్ లక్షణాలున్నాయి. రుద్రాక్ష, యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు, వజ్రాలు చాలా శక్తిమంతమైనవి. రుద్రాక్షను ధరించేవారికి, రుద్రాక్షను ఆరాధించేవారికి చాలా రకాల ఆధ్యాత్మిక లాభాలను పొందగలరు. కొందరు సంపదను, మన:శాంతిని, ఆరోగ్యాన్ని పొందుతారు.
అయితే రుద్రాక్ష ధరించాలని అనుకునే వారు కొన్ని నియమాలను పాటించాలని పండితులు సూచిస్తున్నారు. పవిత్ర రుద్రాక్షను పూజించేందుకు కానీ, ధరించేందుకు కానీ ఈ నియమాలు తప్పకుండా పాటించాలి.
రుద్రాక్ష – నియమాలు
☀ ఉదయం రుద్రాక్ష ధరించే సమయంలో తప్పకుండా రుద్రాక్ష మంత్రం తొమ్మిది సార్లు పఠించాలి. రాత్రి తీసిన తర్వాత దాన్ని పవిత్రంగా భద్రపరచాలి.
☀ రుద్రాక్ష ధరించేవారు ఉదయాన్నే ధరించడం మంచిది. ఉదయం స్నానం చేసిన వెంటనే రుద్రాక్ష మంత్రం పఠించి రుద్రాక్ష ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది. రుద్రాక్షను పూజలో ఉంచేవారు నేతి దీపం, అగరు పొగను రుద్రాక్షకు సమర్పించాలి.
☀ రుద్రాక్షను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. రుద్రాక్ష పూసలో దుమ్ము, ధూళీ చేరే ఆస్కారం ఉంటుంది. వీలనంత తరచుగా రుద్రాక్షను శుభ్రం చేసుకోవాలి. రుద్రాక్షలను గుచ్చి పెట్టకున్న దారం తెగిపోయినా లేదా పాతదైపోయినా వెంటనే కొత్తది వేసుకోవాలి. శుభ్రమైన నీళ్లతో లేదా పాలతో శుభ్రం చేస్తే వాటి వైశిష్ట్యం నిలిచి ఉంటుంది.
☀ రుద్రాక్ష మాలలో 108 లేదా 54 పూసలు ఉంటాయి. 27 పూసలతో కూడా చిన్న జపమాలలు కూడా ఉంటాయి. ధరించే రుద్రాక్షను జపమాలగా ఉపయోగించకూడదు.
☀ స్నానం చేసే సమయంలో రుద్రాక్ష తీసి పక్కన పెట్టాలి. సబ్బు వినియోగించడం వల్ల రుద్రాక్షలు పాడైపోతాయి. రుద్రాక్షను ప్రేమగా, భక్తిగా, నమ్మకంతో ధరించాలి. రుద్రాక్షలు అన్ని వయసుల వారు లింగభేధం లేకుండా ధరించవచ్చు.
☀ సోమవారం రోజున రుద్రాక్షధరిస్తే చాలా మంచిది. సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైన రోజు కనుక విశేష ఫలితం ఉంటుంది. రుద్రాక్ష ఎల్లప్పుడు ధరించవచ్చు. ప్రతిరోజూ ఆరాధించవచ్చు.
☀ రుద్రాక్షలను శుభ్రం చేసిన తర్వాత వాటికి నూనె రాయాలి. వాటిని చాలా కాలం పాటు ధరించకూడదని అనుకున్నపుడు శుభ్రమైన పారదర్శకమైన పాత్రలో ఉంచి భద్రపరచాలి.
☀ ఒకరు ధరించిన రుద్రాక్ష మరొకరు ధరించకూడదు. మన రుద్రాక్ష ఎవరికీ ఇవ్వకూడదు.
☀ రుద్రాక్షను ఎరుపు లేదా పసుపు దారంతో ధరించడం మంచిది.
☀ రుద్రాక్ష ధరించి అంత్యక్రియలు, శవ ఊరేగింపు, దహనసంస్కారాల వంటి కార్యక్రమాల్లో పాల్గొన వద్దని శాస్త్రం చెబుతోంది. ఇలాంటి సందర్భాల్లో రుద్రాక్ష తీసి పక్కన పెట్టాలి.
☀ ఈ నియమాలు పాటిస్తూ రుద్రాక్ష ధరిస్తే ఆ పరమశివుడి కృపాకటాక్షాలు మీ వెన్నంటి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.
Also Read : Vastu Tips in Telugu: ఇంట్లో పగిలిన వస్తువులు, ఫర్నీచర్ ఉన్నాయా? ఈ కష్టాలు తప్పవు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.