Chanakya Niti - చాణక్య నీతి: ఇలా సంపాదించే డబ్బు అస్సలు నిలవదు!
ఇతరులను అవమాన పరిచేవాడు ఎన్నటికీ ధనవంతుడు కాలేడని, నిజాయితీ లేని సంపాదన దారిద్ర్యాన్ని వదిలించలేదని, మరింత కష్టాల పాలు చేస్తుందని చాణిక్య నీతి చెబుతోంది.
ఆచార్య చాణిక్యుడు రాజనీతిజ్ఞుడు, నీతి శాస్త్ర కోవిధుడు, మొట్ట మొదటి ఆర్థిక వేత్త. ఆయన జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని గురించి వివరణలు ఇచ్చాడు. తన రచనల ద్వారా జీవితానికి అవసరమయ్యే అనేకానేక విషయాలను చర్చించాడు. ఆస్తి, అమ్మాయిలు, మిత్రుల, వృత్తి, వైవాహిక వ్యక్తిగత జీవితం గురించిన అనేక విషయాల గురించి విషయాలను చెప్పారు. ఆయన తన నీతి శాస్త్రం ద్వారా ఎన్నో ఇప్పటికీ ఆచరణీయ రహస్యాలను గురించి ప్రస్తావించారు. కౌటిల్యుడిగా ఎన్నో రకాల ఆర్థిక సూత్రాలను కూడా బోధించారు. ఆయన బోధల ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యక్తిగత అంశాలెన్నింటినో నేర్చుకొన వచ్చు. ఆచరించి విజయాలను కూడా పొందవచ్చు. డబ్బు సంపాదించే విధానాలు మాత్రమే కాదు, ఎలా డబ్బు సంపాదించడం ద్వారా చాతుర్విద పురుషార్ధాలు సిద్ధిస్తాయో కూడా తెలియజేశాడు. ఎంత డబ్బు సంపాదించినా దాన్ని దుబారా చేసి నిలువరించలేకపోయినా లేదా డబ్బు సంపాదనకు బానిసగా మారి నీతినిజాయితీలను ఫణంగా పెట్టి లోభిగా మారినా డబ్బు నిలిచి ఉండదని, త్వరలోనే ఆ సంపద నాశనం అవుతుందని ఆయన హెచ్చరిస్తున్నాడు.
ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం తప్పుడు మార్గాల్లో సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం పాటు నిలవదు. అలాంటి సంపద నాశనమైపోతుందని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడు ఒక శ్లోకంలో తప్పుడు మార్గాల్లో సంపాదించిన సంపద ఎక్కువ కాలం పాటు నిలవదని వివరించాడు. ఇతరులను అవమాన పరిచేవాడు ఎన్నటికీ ధనవంతుడు కాలేడని, నిజాయితీ లేని సంపాదన దారిద్ర్యాన్ని వదిలించలేదని, మరింత కష్టాల పాలు చేస్తుందని చాణిక్య నీతి చెబుతోంది. డబ్బు ఏ మార్గాల్లో సంపాదించాలో, ఎటువంటి డబ్బు నిజాయితీ కలిగిందో తెలుసుకుందాం.
అన్యాయోపార్జింత్ విత్తం దశ వర్షాణి తిష్ఠాతి
ప్రాప్తే చౌకాదేశే వర్షే సమూల్ తత్ వినష్యతి
లక్ష్మీ చంచలమైందని అది ఒక చోట నిలిచి ఉండేది కాదని ఎవరైనా సరే దొంగతనం, జూదం ద్వారా లేదా అన్యాయంగా, మోసం ద్వారా డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు త్వరగా నశించి పోతుందని , అందుకే తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించ కూడాదని చాణక్యుడు వివరించాడు.
ఆత్మపరాధవృక్షస్య ఫలన్యేతాని దేహినామ్ ।
దారిద్ర్యరోగ దు:ఖాని బంధన్వసనాని చ ।।
ఈ శ్లోకం ద్వారా పేదరికం, వ్యాధి, దు:ఖం, బానిసత్వం, చెడు అలవాట్లన్నీ కూడా మనుషుల కర్మ ఫలితాలని వివరణ ఇచ్చాడు. ఎలాంటి విత్తనం వేస్తే అలాంటి పంట వస్తుందని, అందుకే ఎప్పుడూ మనుషులు మంచి పనులే చెయ్యాలని చాణిక్యుడు ఈ శ్లోకం ద్వారా వివరించాడు.
ధన్హినో న చ హీనశ్చ ధనిక్ స సునిశ్చః ।
విద్యా రత్నేన్ హీనో యః S హీన్: సర్వవస్తుషు.
ఈ శ్లోకంలో చాణక్యుడు ఎవరినీ డబ్బులేని వారుగా చూడకూడదని సలహా ఇస్తున్నాడు. ఏ వ్యక్తి కూడా జ్ఞానానికి తక్కువ వాడు కాదు, ధనానికి తక్కువ వాడు కాదు. వినయం అనే రత్నం లేని వాడే నిజానికి అందరికంటే కూడా పేదవాడుగా చెప్పుకోవాలి అని అంటున్నాడు. జ్ఞానార్జనతో పాటు వినయ విధేయతలు కలిగి ఉండడమే అన్నింటి కంటే పెద్ద సంపద కలిగి ఉండడమని వివరించాడు.
Also read: ఎన్టీఆర్ వన్‌మ్యాన్ షో ‘దాన వీర శూర కర్ణ’ - అన్నీ తానై ప్రేక్షకులతో ఔరా అనిపించారు!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.