Pitru Paksham 2023: మహాలయ పక్షంలో మరణిస్తే మంచిదేనా లేదంటే అశుభమా!
Pitru Paksham 2023: భూమిపై మన కాలం ముగియగానే మరణం అనేది సృష్టి చట్టం. దానికి సమయం లేదు, వ్యవధి ఉండదు. అదే విధంగా పితృపక్షంలో ఎవరైనా చనిపోతే అది శుభసూచకమా.? లేక అరిష్ట సంకేతమా.?
Pitru Paksham 2023: పితృ పక్షం 15 రోజులు చాలా ప్రత్యేకమైన కాలం. ఎందుకంటే ఈ సమయంలో మరణించిన పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. ఇది వారి ఆత్మకు శాంతి చేకూర్చుతుంది, ఈ సంవత్సరం పితృ పక్షం సెప్టెంబరు 30 నుంచి ప్రారంభమై అక్టోబర్ 14వ తేదీన ముగుస్తుంది.
పూర్వీకుల ఆశీస్సులు, అనుగ్రహం ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పుడూ సుఖః సంతోషాలతో ఉంటాడని చెబుతారు. పితృదేవతల కోపానికి గురయితే జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే పితృ పక్షంలో కుటుంబంలో ఎవరైనా మరణిస్తే ఏమవుతుందో తెలుసా..? పితృ పక్షంలో చనిపోయిన వారి ఆత్మ స్వర్గానికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా.?
Also Read : పితృ పక్షంలో బిడ్డ పుడితే కుటుంబంలో జరగబోయే మార్పులేంటో తెలుసా!
1. పితృపక్షంలో మరణిస్తే శుభప్రదమా? అశుభమా?
హిందూ ధర్మ గ్రంధాలలో పితృ పక్షం గురించి చాలా ప్రస్తావనలు ఉన్నాయి. ఈ సమయంలో పూర్వీకులకు తర్పణం ఇవ్వడం చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. పురాణాల ప్రకారం, శ్రీరాముడు తన తండ్రి దశరథుని శ్రాద్ధ కర్మలు నిర్వహించినప్పుడు, ఆయన ఆత్మకు శాంతి లభించింది. పితృ పక్షంలో సంతానం కలగడం కూడా శుభప్రదమని చెబుతారు. అయితే పితృ పక్షం సమయంలో ఎవరైనా మరణిస్తే అది శుభమో, అశుభమో.? ధర్మ గ్రంధాల ప్రకారం, పితృ పక్షంలో కుటుంబంలో ఎవరైనా మరణిస్తే అది శుభప్రదంగా పరిగణించాలని తెలిపారు. ఈ 15 రోజుల్లో ఎవరైనా మరణిస్తే, వారు అదృష్టవంతులని, వారి ఆత్మకు త్వరలో మోక్షం లభిస్తుందని నమ్ముతారు.
2. స్వర్గ మార్గాలు తెరవడం
ఒక వ్యక్తి పితృ పక్షంలో మరణిస్తే, అతనికి స్వర్గ మార్గం తెరుచుకుంటుంది. ఎందుకంటే యమ ధర్మరాజు పితృ పక్షంలో 15 రోజుల పాటు స్వర్గానికి మార్గం తెరుస్తాడు. అటువంటి పరిస్థితిలో ఆత్మ నేరుగా స్వర్గానికి వెళుతుంది. వారి ఆత్మ అన్ని దుఃఖాల నుంచి విముక్తి పొందుతుంది.
Also Read : ఈ 15 రోజులు ఈ 4 జంతువులు, పక్షులకు ఆహారం అందిస్తే మీ వంశం వృద్ధి చెందుతుంది!
హిందూ ధర్మ గ్రంధాల ప్రకారం, పితృపక్షాన్ని ఆధ్యాత్మిక పండుగగా పరిగణిస్తారు. ఈ సమయంలో మరణించిన వారి ఆత్మ నేరుగా తదుపరి ప్రపంచానికి వెళుతుందని నమ్ముతారు. అలాంటి ఆత్మలు మరణానంతరం స్వర్గానికి చేరుతాయి. పితృ పక్షంలో ఓ వ్యక్తి మరణించినప్పుడు అతనికి, అతని కుటుంబానికీ శుభం కలుగుతుందని అర్థం. మరణించిన ప్రాణి ‘ఆత్మ’ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి భూమ్మీద జీవాత్మగా వస్తుంది. మరణించిన పితృదేవతలకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకం లోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. పుత్రులు రుణం తీర్చుకుంటేనే పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. ఈ రుణం తీర్చుకునేందుకు ఈ 15 రోజులు చాలా ప్రత్యేకమైనవి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.