Panchang 8th July 2022: జులై 8 శుక్రవారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శుక్రవారం పఠించాల్సిన మహాలక్ష్మి అష్టకం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 8 శుక్రవారం పంచాంగం
తేదీ: 08-07 -2022
వారం: శుక్రవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాడమాసం
తిథి : నవమి శుక్రవారం మధ్యాహ్నం 1.12 వరకు ఆ తర్వాత దశమి
నక్షత్రం: చిత్త శుక్రవారం ఉదయం 8.06 వరకు తదుపరి స్వాతి
వర్జ్యం : మధ్యాహ్నం 1.33నుంచి 3.06 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 8.10 నుంచి 9.02 వరకు తిరిగి మధ్యాహ్నం 12.31 నుంచి 1.23 వరకు
అమృతఘడియలు : రాత్రి 10.54 నుంచి 12.27 వరకు
సూర్యోదయం: 05:34
సూర్యాస్తమయం : 06:35
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: జులై 10 తొలి ఏకాదశి, ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిదని ఎందుకంటారు!
శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి అష్టకం...
మహా లక్ష్మ్యష్టకం- ఇంద్ర ఉవాచ
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ।
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 1 ॥
నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి ।
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 2 ॥
సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి ।
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 3 ॥
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని ।
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 4 ॥
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి ।
యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 5 ॥
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే ।
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 6 ॥
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి ।
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 7 ॥
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే ।
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 8 ॥
మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః ।
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ॥
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ ।
ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ॥
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ ।
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ॥
ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణం
Also Read: శుక్రవారం రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి!
Also Read: మంగళసూత్రానికి పిన్నీసులు తగిలిస్తున్నారా!