అన్వేషించండి

Spirituality: శుక్రవారం రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి!

శుక్రవారం రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఈ రోజు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవి పాటించకపోతే లక్ష్మీదేవి బదులు జ్యేష్టా దేవి ఇంట్లో తిష్టవేసుకుని ఉంటుంది.

శుక్రవారం లక్ష్మీదేవి సెంటిమెంట్ చాలామంది ఉంది. ఈ రోజు కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఇంట్లో ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వశిస్తారు. అదే సమయంలో శుక్రవారం అస్సలు చేయకూడని కొన్ని పనుల గురించి కూడా తెలుసుకోవాలంటారు. అవేంటంటే...

  • శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పూజలు చేస్తుంటారు. అందుకే ఈ రోజు ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మవారి విగ్రహాన్ని కానీ, ఫొటోను కానీ దేవుడి మందిరంలోంచి బయటకు తీయరాదు
  • కొంతమది పాతది లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తది ఉంచుతారు. పాత విగ్రహాన్ని మరిచిపోయి కూడా శుక్రవారం రోజు నిమజ్జనం చేయరాదు.కొత్త విగ్రహాన్ని పెట్టుకోవచ్చు కానీ పాతది తీయరాదు.
  • శుక్రవారం రోజు అప్పు తీసుకోవద్దు, ఇవ్వొద్దు. ఎవరికైనా సహాయం అవసరం అయితే చేయండి కానీ రుణం రూపంలో ఇచ్చి పుచ్చుకోవడాలు వద్దు.
  • శుక్రవారం నాడు కొంతమంది వైభవ లక్ష్మీ ఉపవాసం పాటిస్తారు. ఈ రోజు అమ్మాయిలకు అన్నదానం చేస్తారు. అందుకే పొరపాటున కూడా అమ్మాయిలపై కోప్పడవద్దు  ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్లలుంటే వారిని తిట్టడం లాంటివి చేయరాదు.
  • ఈ రోజు లక్ష్మీదేవి విగ్రహం ఎవ్వరికీ ఇవ్వకండి. విగ్రహాన్ని ఇంటికి తీసుకురావొచ్చు కానీ తీసుకెళ్లి ఇవ్వొద్దు. పొరపాటున కూడా  అమ్మవారి ప్రతిమ శుక్రవారం రోజు మీ ఇంటి గడప దాటరాదు
  • శుక్రవారం రోజున బూజు దులపడం అస్సలు చేయకూడదు
  • మగవారు, ఆడవారు జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం, షేవింగ్ చేసుకోవడం లాంటివి చేస్తే వారిపై లక్ష్మీ కటాక్షం ఉండదని చెబుతారు.
  • ఈ రోజున మాసినబట్టలు ధరించకూడదు
  • బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం, ఇతరులకు ఇవ్వడం అస్సలు వద్దు

Also Read: జూన్ 10న నిర్జల ఏకాదశి, ఈ నియమాలు పాటిస్తే ఆర్థిక, అనారోగ్య సమస్యలుండవ్

చేయాల్సిన పనులు

  • శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రం పఠించడం వల్ల ఇంటికి సంపద, వైభవం, శ్రేయస్సు వస్తుంది.
  • ఈ రోజు దానధర్మాలు చేస్తే ఆ ఇంట లక్ష్మీదేవి ఎప్పటికీ కొలువుంటుందని చెబుతారు
  • శాస్త్రాల ప్రకారం సంధ్యాసమయంలో కొంతసేపు ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండాలి, వెనుక ద్వారం మూసివేసి ఉండాలని చెబుతారు. ఆ సమయంలో అమ్మవారు ఇంట్లోకి అడుగుపెడుతుందని విశ్వాసం.
  • పసుపు, ఎరుపు, ఆకుపచ్చ దుస్తులు ధరించి పూజచేయాలి
  • తులసి మొక్క దగ్గర తప్పనిసరిగా దీపం వెలిగిస్తే సుమంగళి యోగం లభిస్తుంది
  • అమ్మవారికి తెల్లటి పూలతో పూజిస్తే ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది
  • పాలతో పాయసం చేసి నివేదించాలి... ఈ పాయసం ఇంటికొచ్చిన వారికి పెట్టొచ్చు కానీ ఇల్లు దాటి బయటకు ఇవ్వరాదు
  • శుక్రవారం రోజు లక్ష్మీగణపతి ఆలయాన్ని దర్శించుకుని గరికమాల సమర్పిస్తే కోరుకున్న కోర్కెలు నెరవేరతాయి
  • శుక్రవారం ఉదయం, లేదా సాయంత్రం వెళల్లో దేవాలయాని వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుంటే కష్టాలు తొలగిపోతాయి 

Also Read: మంగళసూత్రానికి పిన్నీసులు తగిలిస్తున్నారా!
Also Read: ఇంట్లో లక్ష్మీదేవి, కృష్ణుడు, ఆంజనేయుడి ఫొటోలు ఎలాంటివి ఉండాలంటే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget