Panchang 21 June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుష్టశక్తులు తరిమేసే ఆంజనేయ స్తోత్రం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..
జూన్ 21 మంగళవారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 21- 06 - 2022
వారం: మంగళవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం
తిథి : అష్టమి మంగళవారం రాత్రి 1.21 వరకు తదుపరి నవమి
వారం : మంగళవారం
నక్షత్రం: పూర్వాభాద్ర ఉదయం 10.12 వరకు తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం : రాత్రి 7.42 నుంచి 9.17 వరకు తిరిగి 10.54 నుంచి 11.37
దుర్ముహూర్తం : ఉదయం 8.15 నుంచి 8.59వరకు
అమృతఘడియలు : తెల్లవారుజామున 5.13
సూర్యోదయం: 05:30
సూర్యాస్తమయం : 06:33
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
మంగళవారం ఆంజనేయుడికి ప్రీతికరమైన రోజు. కొందరు అమ్మవారికి పూజ చేస్తే మరికొందరు హనుమాన్ కి జై అంటారు. ఈ సందర్భంగా ఆంజనేయుడి భక్తుల కోసం శ్రీ ఆంజనేయ స్తోత్రం
హనుమాన్ గాయత్రీ మంత్రం
ఓం ఆంజనేయాయ విద్మహే వాయు పుత్రాయ ధీమహి!
తన్నో హనుమత్ ప్రచోదయాత్!!
ఆంజనేయ స్తోత్రమ్ (Sri Anjaneya Swamy Stotram)
రంరంరం రక్త వర్ణం దినకరవదనం తీక్షదంష్ట్రాకరాళం
రంరంరం రమ్య తేజం గిరిచలనకరం కీర్తిపంచాది వక్త్రం
రంరంరం రాజయోగం సకల శుభనిధిం సప్త భేతాళం భేద్యం
రం రం రం రాక్షసాంతం సకల దిశయశం రామదూతం నమామి.
ఖం ఖం ఖం ఖడ్గహస్తం విషజ్వరహరణం వేద వేదాంగదీపం
ఖం ఖం ఖం ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం
ఖంఖంఖం కల్పవృక్షం మణిమయ మకుటం మాయామాయా స్వరూపం
ఖం ఖం ఖం కాలచక్రం సకల దిశయశం రామదూతంనమామి.
ఇం ఇం ఇం ఇంద్రవంద్యం జలనిధికలనం సౌమ్యసామ్రాజ్యలాభం
ఇం ఇం ఇం సిద్ధియోగం నతజవసదయం ఆర్యపూజ్యార్చితాంగం
ఇం ఇం ఇం సింహనాదం అమృతకరతలం ఆది అంత్య ప్రకాశం.
ఇం ఇం ఇం చిత్స్వరూపం సకలదిశయశం రామదూతం నమామి.
సం సం సం సాక్షిభూతం వికసిత వదనం పింగలాక్షం సురక్షం
సం సం సం సత్యగీతం సకలమునినుతం శాస్త్రసంపత్కరీయం
సం సం సం సామవేదం నిపుణ సులలితం నిత్యతత్త్వ స్వరూపం
సం సం సం సావధానం సకలదిశయశం రామదూతం నమామి
హం హం హం హంసరూపం స్పుటవికటముఖం సూక్ష్మ సూక్ష్మావతారం
హం హం హం అంతరాత్మం రవిశశినయం రమ్యగంభీర భీమం
హం హం హం అట్టహాసం సురవరనిలయం ఊర్థ్వరోమం కరాళం
హం హం హం హంసహంసం సకల దిశయశం రామదూతం సమామి.
Also Read: ఈ వారం ఈ రాశులవారికి అనుకోని ధనలాభం ఉంటుంది, గౌరవం పెరుగుతుంది