News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Weekly Horoscope: ఈ వారం ఈ రాశులవారికి అనుకోని ధనలాభం ఉంటుంది, గౌరవం పెరుగుతుంది

Weekly Horoscope:ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

FOLLOW US: 
Share:

2022 జూన్‌ 20 నుంచి 26 వరకు వారఫలాలు (Weekly Horoscope 20 june to 26 june)
మేషం
ఈ వారం ఈ రాశి ఉద్యోగుల పురోగతి బావుంటుంది. వ్యాపారానికి సంబంధించి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు తొలగిపోతాయి. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థులు కూడా అనుకూలంగా మారుతాయి. వారం మధ్యలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. రాజకీయనాయకులకు ఈ వారం మంచి సమయం.

వృషభం
ఈ వారం స్థిరాస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేసే ప్రణాళికలు వేస్తారు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధు మిత్రులతో వివాదాలు తొలగడంతో కాస్త ప్రశాంతంగా ఉంటుంది. మీ సమయాన్ని మంచి పనులకోసం వినియోగించండి. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇంటా-బయటా గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి సమయం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

Also Read: ఈ వారం ఈ రాశులవారికి అనారోగ్యం, మానసిక ఆందోళన

మిథునం
అనుకున్న పనులు అనుకున్నంత ఫాస్ట్ గా సాగవు. కార్యాలయంలో పనులు నెమ్మెదిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితుల సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. ఎవ్వరితోనూ వివాదం వద్దు. అనుభవజ్ఞుల సూచనలు ఫలిస్తాయి.సేవాకార్యక్రమాలు చేపడతారు. వ్యాపార విస్తరణకు ఇదే మంచి అవకాశం. కళారంగం వారికి కలిసొచ్చే కాలం ఇది. వారం ప్రారంభంలో ఇంట్లో చిన్న చిన్న వివాదాలుంటాయి. 

కర్కాటకం
ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. తలపెట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగి సాఫీగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు. ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. కొన్ని సంఘటనల ద్వారా మీ చుట్టూ ఉండే వ్యక్తుల గురించి నిజనిజాలు తెలుస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటన అవకాశాలు వస్తాయి. 

Also Read: ఈ రాశివారు అక్రమ సంబంధాలకు దూరంగా ఉండాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

సింహం
ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తిచేయగలుగుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటా-బయటా మీ గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వారం చివర్లో కొన్ని ఇబ్బందులుంటాయి. 

కన్య
కొత్త పనులు ప్రారంభించేందుకు మీకిది అనువైన సమయం. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఎంత పెద్ద సమస్యని అయినా అధిగమించగలుగుతారు. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారం పుంజుకుంటుంది. ఉద్యోగుల సమస్యలు తీరుతాయి. రాజకీయనాయకులకు కొన్ని ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం ఉంటుంది. 

Also Read: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం,శ్రీ చంద్రమౌళీశ్వర వర్ణమాలా స్తోత్రం

Published at : 20 Jun 2022 06:50 AM (IST) Tags: Weekly Horoscope Horoscope Today 2022 rasi phalalu saptahik rashifal 20 june to 26 june

ఇవి కూడా చూడండి

TTD News: అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో మ‌ల‌య‌ప్ప స్వామి

TTD News: అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో మ‌ల‌య‌ప్ప స్వామి

Daily Horoscope September 25th :ఈ రోజు ఈ 5 రాశులవారి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు, సెప్టెంబరు 25 రాశిఫలాలు

Daily Horoscope September 25th :ఈ రోజు ఈ 5 రాశులవారి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు, సెప్టెంబరు 25 రాశిఫలాలు

Horoscope Today September 24th: ఈ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం అవుతారు, సెప్టెంబరు 24 రాశిఫలాలు

Horoscope Today September 24th: ఈ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం అవుతారు, సెప్టెంబరు 24 రాశిఫలాలు

Weekly Horoscope 25 September - 01 October 2023: సెప్టెంబరు ఆఖరి వారం ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం

Weekly Horoscope 25 September - 01 October 2023: సెప్టెంబరు ఆఖరి వారం ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం

25 సెప్టెంబర్- 01 అక్టోబర్ 2023 వారఫలాలు: సెప్టెంబరు ఆఖరివారం ఈ రాశులవారికి అనుకోని ఇబ్బందులు

25 సెప్టెంబర్- 01 అక్టోబర్ 2023 వారఫలాలు: సెప్టెంబరు ఆఖరివారం ఈ రాశులవారికి అనుకోని ఇబ్బందులు

టాప్ స్టోరీస్

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!