Panchang 19th July 2022: జులై 19 తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, హనుమాన్ జయమంత్రం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 19 మంగళవారం పంచాంగం
తేదీ: 19-07 -2022
వారం: మంగళవారం ( భౌమవాసరే)
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు,ఆషాఢ మాసం,బహుళ పక్షం
తిథి : షష్ఠి మంగళవారం మధ్యాహ్నం 1.07 వరకు తదుపరి సప్తమి
నక్షత్రం: ఉత్తరాభాద్ర సా 5.54 వరకు తదుపరి రేవతి
వర్జ్యం : రాత్రి 10.58 నుంచి 11.42 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08.20 నుంచి 9.04 వరకు
అమృతఘడియలు : రాత్రి 1.09 నుంచి 2.44 వరకు
సూర్యోదయం: 05:38
సూర్యాస్తమయం : 06:34
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read:హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి, పఠిస్తే కష్టాలెందుకు తీరుతాయి
బుద్ధి, బలం,జ్ఞానం, సమయస్ఫూర్తి, విజయం ఇవన్నీ ఆంజనేయుడిని పూజిస్తే వస్తాయంటారు. రామభక్తుడిని కొలిచేందుకు చాలా మంత్రాలున్నాయి అయితే..అన్నటి కన్నా హనుమాన్ జయమంత్రం పఠిస్తే చాలు ఎంతటి కష్టమైనా పారిపోతుందంటారు. దీనిని వాయుపత్రుడు ఏ సందర్భంగా చెప్పాడంటే.. లంకలో ఆశోకవనంలో ఉన్న సీతాదేవిని...రామబంటు హనుమంతుడు చూస్తాడు. రాక్షసులెవ్వరూ లేని సమయం చూసి వెళ్లి మాట్లాడి ఆమెకు ధైర్యం చెబుతాడు. అయితే ఇదంతా చూసిన కొందరు రాక్షస స్త్రీలు ఏదో కోతి వచ్చి మీరు తీసుకొచ్చిన మహిళతో మాట్లాడుతోందని చెబుతారు. ఆగ్రహించిన రావణుడు 80 వేల మంది రాక్షస కింకరులని పిలిచి ” మీరందరూ వెళ్ళి ఆ మహా వానరాన్ని పట్టి బంధించండి, లేకపోతె సంహరించండి ” అని చెప్పి పంపించాడు. వాళ్లంతా వెళ్లేసరికి హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చుని శ్లోకం చెప్పాడు. దానినే హనుమాన్ జయమంత్రం అంటారు. ఇది సుందరకాండలో ఓ ఘట్టం...
హనుమాన్ జయమంత్రం
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః|
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః||
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః|
హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||
అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్|
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్||
రాముడు, లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు. ఆ రాముడి అండతో వానర రాజైన సుగ్రీవుడు జయంతో శోభిల్లుతున్నాడు. అలాంటి రాముడికి దాసానుదాసుడిని నేను. నా పేరు హనుమ, నేను యుద్ధంలో ప్రత్యేక ఆయుధాలను వినియోగించను. ఈ రావణుడి సైన్యాన్ని నా అరికాళ్ళ కింద పెట్టి తోక్కేస్తాను, నా పిడి గుద్దులతో చంపేస్తాను, పెద్ద పెద్ద చెట్లతో, రాళ్ళతో కొడతాను. వెయ్యిమంది రావణాసురులు నా భుజాల కింద ఒక కీటకంతో సమానం. నన్ను ఆపగలిగేవాడు ఈ లంకా పట్టణంలో లేడు. సీతమ్మకి నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను, నన్ను పట్టగలిగే మొగాడు ఈ లంకా పట్టణంలో లేడు ” అని జయ మంత్రాన్ని చెప్పాడు.
Also Read: అనారోగ్యం, శనిబాధలు తొలగిపోవాలంటే మంగళవారం ఇలా చేయండి