News
News
X

Panchang 17th June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దారిద్ర్యం తొలగించే శ్రీ సిద్ధిలక్ష్మీ స్తోత్రం

కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..

FOLLOW US: 
Share:

జూన్ 17 శుక్రవారం పంచాంగం

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

తేదీ: 17- 06 - 2022
వారం:  శుక్రవారం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం

తిథి  : తదియ  శుక్రవారం ఉదయం 10.24 వరకు తదుపరి చవితి
వారం : శుక్రవారం
నక్షత్రం:  ఉత్తరాషాడ మధ్యాహ్నం 2.32  వరకు తదుపరి శ్రవణం
వర్జ్యం : సాయంత్రం 6.17 నుంచి 7.47 వరకు 
దుర్ముహూర్తం : ఉదయం 8.05 నుంచి 8.58 వరకు తిరిగి మధ్యాహ్నం 12.27 నుంచి 1.19
అమృతఘడియలు  : ఉదయం 8.32 నుంచి 10.02 వరకు తిరిగి రాత్రి తెల్లవారుజామున 3.17 నుంచి 4.47 వరకు
సూర్యోదయం: 05:29
సూర్యాస్తమయం : 06:31

( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)

Also Read: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి

శుక్రవారం సందర్భంగా దారిద్ర్యం తొలగించే శ్రీ సిద్ధిలక్ష్మీ స్తోత్రం

ఓం అస్య శ్రీ సిద్ధిలక్ష్మీస్తోత్రస్య హిరణ్యగర్భ ఋషిః అనుష్టుప్ ఛందః సిద్ధిలక్ష్మీర్దేవతా మమ సమస్త దుఃఖక్లేశపీడాదారిద్ర్యవినాశార్థం సర్వలక్ష్మీ ప్రసన్న కరుణార్థం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాప్రీత్యర్థం చ సిద్ధిలక్ష్మీస్తోత్రజపే వినియోగః 

కరన్యాసః |
ఓం సిద్ధిలక్ష్మీ అంగుష్ఠాభ్యాం నమః |
ఓం హ్రీం విష్ణుహృదయే తర్జనీభ్యాం నమః |
ఓం క్లీం అమృతానందే మధ్యమాభ్యాం నమః |
ఓం శ్రీం దైత్యమాలినీ అనామికాభ్యాం నమః |
ఓం తం తేజఃప్రకాశినీ కనిష్ఠికాభ్యాం నమః |
ఓం హ్రీం క్లీం శ్రీం బ్రాహ్మీ వైష్ణవీ మాహేశ్వరీ కరతలకరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః |
ఓం సిద్ధిలక్ష్మీ హృదయాయ నమః |
ఓం హ్రీం వైష్ణవీ శిరసే స్వాహా |
ఓం క్లీం అమృతానందే శిఖాయై వషట్ |
ఓం శ్రీం దైత్యమాలినీ కవచాయ హుమ్ |
ఓం తం తేజఃప్రకాశినీ నేత్రద్వయాయ వౌషట్ |
ఓం హ్రీం క్లీం శ్రీం బ్రాహ్మీం వైష్ణవీం అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్బంధః |

ధ్యానమ్ |
బ్రాహ్మీం చ వైష్ణవీం భద్రాం షడ్భుజాం చ చతుర్ముఖామ్
త్రినేత్రాం చ త్రిశూలాం చ పద్మచక్రగదాధరామ్ |
పీతాంబరధరాం దేవీం నానాలంకారభూషితామ్
తేజఃపుంజధరాం శ్రేష్ఠాం ధ్యాయేద్బాలకుమారికామ్ ||

స్తోత్రమ్ |
ఓంకారలక్ష్మీరూపేణ విష్ణోర్హృదయమవ్యయమ్ |
విష్ణుమానందమధ్యస్థం హ్రీంకారబీజరూపిణీ ||
ఓం క్లీం అమృతానందభద్రే సద్య ఆనందదాయినీ |
ఓం శ్రీం దైత్యభక్షరదాం శక్తిమాలినీ శత్రుమర్దినీ || 
తేజఃప్రకాశినీ దేవీ వరదా శుభకారిణీ |
బ్రాహ్మీ చ వైష్ణవీ భద్రా కాలికా రక్తశాంభవీ || 
ఆకారబ్రహ్మరూపేణ ఓంకారం విష్ణుమవ్యయమ్ |
సిద్ధిలక్ష్మి పరాలక్ష్మి లక్ష్యలక్ష్మి నమోఽస్తు తే || 
సూర్యకోటిప్రతీకాశం చంద్రకోటిసమప్రభమ్ |
తన్మధ్యే నికరే సూక్ష్మం బ్రహ్మరూపవ్యవస్థితమ్ || 
ఓంకారపరమానందం క్రియతే సుఖసంపదా |
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే || 
ప్రథమే త్ర్యంబకా గౌరీ ద్వితీయే వైష్ణవీ తథా |
తృతీయే కమలా ప్రోక్తా చతుర్థే సురసుందరీ || 
పంచమే విష్ణుపత్నీ చ షష్ఠే చ వైష్ణవీ తథా |
సప్తమే చ వరారోహా అష్టమే వరదాయినీ || 
నవమే ఖడ్గత్రిశూలా దశమే దేవదేవతా |
ఏకాదశే సిద్ధిలక్ష్మీర్ద్వాదశే లలితాత్మికా || 
ఏతత్ స్తోత్రం పఠంతస్త్వాం స్తువంతి భువి మానవాః |
సర్వోపద్రవముక్తాస్తే నాత్ర కార్యా విచారణా || 
ఏకమాసం ద్విమాసం వా త్రిమాసం చ చతుర్థకమ్ |
పంచమాసం చ షణ్మాసం త్రికాలం యః పఠేన్నరః || 
బ్రాహ్మణాః క్లేశతో దుఃఖదరిద్రా భయపీడితాః |
జన్మాంతరసహస్రేషు ముచ్యంతే సర్వక్లేశతః || 
అలక్ష్మీర్లభతే లక్ష్మీమపుత్రః పుత్రముత్తమమ్ |
ధన్యం యశస్యమాయుష్యం వహ్నిచౌరభయేషు చ || 
శాకినీభూతవేతాలసర్వవ్యాధినిపాతకే |
రాజద్వారే మహాఘోరే సంగ్రామే రిపుసంకటే || 
సభాస్థానే శ్మశానే చ కారాగేహారిబంధనే |
అశేషభయసంప్రాప్తౌ సిద్ధిలక్ష్మీం జపేన్నరః || 
ఈశ్వరేణ కృతం స్తోత్రం ప్రాణినాం హితకారణమ్ |
స్తువంతి బ్రాహ్మణా నిత్యం దారిద్ర్యం న చ వర్ధతే ||
యా శ్రీః పద్మవనే కదంబశిఖరే రాజగృహే కుంజరే
శ్వేతే చాశ్వయుతే వృషే చ యుగలే యజ్ఞే చ యూపస్థితే |
శంఖే దేవకులే నరేంద్రభవనే గంగాతటే గోకులే
సా శ్రీస్తిష్ఠతు సర్వదా మమ గృహే భూయాత్సదా నిశ్చలా ||
ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఈశ్వరవిష్ణుసంవాదే దారిద్ర్యనాశనం సిద్ధిలక్ష్మీ స్తోత్రం సంపూర్ణమ్ ||

Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?

Published at : 17 Jun 2022 05:07 AM (IST) Tags: Day nakshtra thidi rahukal varjyam durmuhurtram Shiva Aksharamala Stotram Today Panchang june 17th

సంబంధిత కథనాలు

Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!

Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!

వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు

వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు

ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది

ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది

Tirumala Vasanthotsavam : ఏప్రిల్ 3 నుంచి తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు, పలు సేవల రద్దు!

Tirumala Vasanthotsavam : ఏప్రిల్ 3 నుంచి తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు, పలు సేవల రద్దు!

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం