Panchang 15th June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, సిరి సంపదలిచ్చే శ్రీ వినాయక దండకం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..
జూన్ 15 బుధవారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 15- 06 - 2022
వారం: బుధవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం
తిథి : పాడ్యమి బుధవారం సాయంత్రం 3.33 వరకు తదుపరి విదియ
వారం : బుధవారం
నక్షత్రం: మూల సాయంత్రం 6.02 వరకు తదుపరి పూర్వాషాడ
వర్జ్యం : సాయంత్రం 4.31 నుంచి 6.01 వరకు తిరిగి రాత్రి 2.52 నుంచి 4.20 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11.34 నుంచి 12.27 వరకు
అమృతఘడియలు : మధ్యాహ్నం 12.00 నుంచి 1.38 వరకు
సూర్యోదయం: 05:29
సూర్యాస్తమయం : 06:31
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: వ్యవసాయం ఓ యజ్ఞం,ఏరువాక పౌర్ణమికి పురాణాల్లోనూ ఎంతో ప్రాధాన్యం
బుధవారం వినాయకుడికి, అయ్యప్ప స్వామికి ప్రీతికరమైన రోజు. విఘ్నాధిపతి అయిన వినాయకుడు సిరిసంపదలను కూడా ప్రసాదిస్తాడు. ఈ దండకం చదువుకుంటే ఆర్థిక సమస్యలు తరుతాయని పండితులు చెబుతారు.
సిరి సంపదలిచ్చే శ్రీ వినాయక దండకం
శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పణ్యచారిత్ర
భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీ నాధ సంజాతస్వామి
శివాసిద్ధి విఘ్నేశ, నీ పాద పద్మంబులన్,నిదు కంటంబు
నీ బొజ్జ నీ మోము నీ మౌలి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబు
నీ కరలంబు నీ పెద్ద వక్త్రంబు నీ పాద హస్తంబు లంబో దరంబున్
సదమూషకాశ్వంబు నీ మంద హాసంబు నీచిన్న తొండంబు
నీ గుజ్జ రూపంబు నీ సూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు
నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్
గుంకుమంబక్ష తాల్జాజులున్ చంపకంబుల్ తగన్ మల్లెలున్మోల్లులు న్ముంఛి
చేమంతులున్ దేల్లగాన్నేరులున్ మంకెనలన్ పోన్నలన్ పువ్వులు న్మంచి
దూర్వంబులన్ దెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగముంచేసి
విఘ్నేశ్వరా నీకుతేంకాయ పోన్నంటిపండ్లున్ మఱిన్మంచివౌ
నిక్షుఖండంబులన్ రేగుబండ్లప్పడాల్ వడల్ నేయిబూరెల్ మరిన్
గోదుమప్పంబులు న్వడల్ పునుగులున్భూరేలున్ న్గారెలున్
చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ దేనెయుంజున్ను బాలాజ్యము న్నాను
బియ్యంచామ్రంబు బిల్వంబు మేల్ బంగురున్ బల్లెమందుంచి
నైవేద్య బంచనీరానంబున్ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరా!
నిన్ను బూజింపకే యన్యదైవంబులం బ్రార్ధనల సేయుటల్
కాంచనం బోల్లకే యిన్ము దాగోరు చందంబుగాదే మహాదేవ !
యోభక్తమందార ! యోసుందరాకారా ! యోభాగ్య గంభీర !
యోదేవ చూడామణీ లోక రక్షా మణీ ! బందు చింతామణీ !
స్వామీ నిన్నెంచ, నేనంత నీ దాసదాసాది దాసుండ శ్రీ దొంతరాజాన్వ వాయుండ
రామాబిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునించేసి శ్రీమంతుగన్ జూచి
హృత్పద్మ సింహాసనారూడతన్ నిల్పి కాపాడుటేకాడు విన్గోల్చి ప్రార్ధించు
భక్తాళికిన్ గోంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్
బుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ కల్గగాజేసి పోషించు మంటిన్ గృహన్ గావుమంటిన్
మహాత్మా యివే వందనంబుల్ శ్రీ గణేశా ! నమస్తే నమస్తే నమస్తే నమః ||
ఇతి శ్రీ వినాయక దండకం ||
Also Read: ఈ వారం ఈ రాశులవారికి ధనలాభం, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Also Read: ఈ వారం ఈ రాశులవారు అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి