Panchang 12th June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, అనారోగ్యాన్ని తొలగించే సూర్యుడి శ్లోకాలు
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..
జూన్ 12 ఆదివారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 12- 06 - 2022
వారం: ఆదివారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం
తిథి : త్రయోదశి ఆదివారం రాత్రి 10.08 వరకు తదుపరి చతుర్థశి
వారం : ఆదివారం
నక్షత్రం: విశాఖ రాత్రి 10.16 వరకు తదుపరి అనూరాధ
వర్జ్యం : ఉదయం 6.12 తిరిగి రాత్రి 2.02 నుంచి 3.32 వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 4.46 నుంచి 5.38 వరకూ
అమృతఘడియలు : మధ్యాహ్నం 1.51 నుంచి 3.22 వరకు
సూర్యోదయం: 05:28
సూర్యాస్తమయం : 06:౩౦
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Alos Read: శని తిరోగమనం ఈ రాశులవారికి సంపద, సంతోషాన్నిస్తుంది
Also Read: శని తిరోగమనం, ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి
ఆదివారం సూర్యునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ప్రపంచానికి వెలుగులు పంచే సూర్యున్ని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందడమే కాదు..జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా సూర్యారాధన ద్వారా ఉపశమనం లభిస్తుందని చెబుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నిత్యం సూర్యుని ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రోజు మీకోసం శ్రీ సూర్య నమస్కార మంత్రం
శ్రీ సూర్య నమస్కార మంత్రం
ఓం ధ్యాయేస్సదా సవితృమండలమధ్యవర్తీ
నారాయణస్సరసిజాసన సన్నివిష్టః |
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ||
ఓం మిత్రాయ నమః | 1 |
ఓం రవయే నమః | 2 |
ఓం సూర్యాయ నమః | 3 |
ఓం భానవే నమః | 4 |
ఓం ఖగాయ నమః | 5 |
ఓం పూష్ణే నమః | 6 |
ఓం హిరణ్యగర్భాయ నమః | 7 |
ఓం మరీచయే నమః | 8 |
ఓం ఆదిత్యాయ నమః | 9 |
ఓం సవిత్రే నమః | 10 |
ఓం అర్కాయ నమః | 11 |
ఓం భాస్కరాయ నమః | 12 |
ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే |
ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే ||
ఇతి శ్రీ సూర్య నమస్కార మంత్రం సంపూర్ణం ||
Also Read: ఆరోగ్యం, ఆనందం, ఆదాయం-జూన్ నెలలో ఈ రాశులవారికి అద్భుతంగా ఉంది
Also Read: జూన్ నెలలో ఈ ఆరు రాశులవారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు