అన్వేషించండి

ఓనం 2025: మిమ్మల్ని మంత్రముగ్ధులను చేసే కేరళకు చెందిన 6 శాస్త్రీయ నృత్య రూపాలు ఇవే!

Onam 2025 : ఓనం 2025 పది రోజుల వేడుకలలో సెప్టెంబర్ 5 ప్రధానమైన రోజు. ఈ రోజు కథాకళి, మోహినియాట్టం వంటి కేరళ సాంప్రదాయ నృత్యాలతో పండుగకు ఘనంగా ఆహ్వానం పలుకుతారు

Mesmerising Classical Dance Forms Of Kerala:  2025వ సంవత్సరంలో  ఆగస్టు 26న ప్రారంభమైన ఓనం వేడుక సెప్టెంబర్ 5న తిరువోనంతో ముగుస్తుంది. పూల అలంకరణలు, రుచికరమైన విందులు, సాంప్రదాయ ఆటలతో పాటు, కేరళ సాంప్రదాయ నృత్య రూపాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి, ఇవి రాష్ట్రం   సాంస్కృతిక వారసత్వాన్ని వెలుగులోకి తెస్తాయి.

సాంప్రదాయ నృత్య రూపాలు కేరళ సాంస్కృతిక వారసత్వ స్ఫూర్తిని కలిగి ఉంటాయి. ఓనం సాంస్కృతిక రూపాన్ని సుసంపన్నం చేస్తాయి.  మంత్రముగ్ధులను చేసే కథాకళి  నుంచి మోహినియాట్టం  ప్రశాంతమైన సౌందర్యం వరకు, కేరళ ప్రదర్శన కళలు సంప్రదాయం, పురాణాలు వేడుకలకు వన్నె తెస్తాయి. 

కథాకళి:

(Image Source: x/ NGMABengaluru)
(Image Source: x/ NGMABengaluru)

కథాకళి కేరళ   అత్యంత ప్రసిద్ధ శాస్త్రీయ నృత్య రూపాలలో ఒకటి, ఇది మూడు శతాబ్దాలకు పైగా చరిత్రను కలిగి ఉంది. తన నాటకీయ కథా కథనంతో, కథాకళి నృత్యం, నటన, సంగీతం కలగలపి  మహాభారతం, రామాయణం , మహాబలి రాజు కథల నుంచి ఇతిహాసాలను చెబుతుంది.  ఈ నత్యరూపకంలో ప్రతి కదలిక, ముఖ కవళికలు , ప్రకాశవంతమైన దుస్తులు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి.

కూడియాట్టం:

(Image Source: x/ CentralSanskrit)
(Image Source: x/ CentralSanskrit)

యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా గుర్తింపు పొందిన కూడియాట్టం ప్రపంచంలోని పురాతన రంగస్థల సంప్రదాయాలలో ఒకటి. ఈ కళా రూపం ద్వారా హిందూ పురాణాల కథలను ప్రదర్శిస్తారు. కూడియాట్టం కేరళకు చెందిన ఒక పురాతన సంస్కృత నాటక కళా రూపం.  సుమారు 2,000 సంవత్సరాల చరిత్రను కలిగిన  ఈ కళా రూపం సంస్కృత శాస్త్రీయ నాటకాలను ప్రదర్శిస్తుంది. కళ్లతో, చేతులతో, శరీర కదలికలతో పాత్రల భావోద్వేగాలను, ఆలోచనలను వివరిస్తుంది.  

తిరువాతిరకళి:

(Image Source: x/ TempleTrails)
(Image Source: x/ TempleTrails)

తిరువాతిరకళి" అనేది కేరళలో ప్రసిద్ధమైన సాంప్రదాయ నృత్య రూపం. ఇది సాధారణంగా ఓనం , తిరువాతిర ఉత్సవాల సందర్భంగా మహిళలు ప్రదర్శిస్తారు. ఈ నృత్యం సామూహికంగా, చక్కని అడుగులతో, గుండ్రంగా చేతులు కలిపి లయబద్ధంగా చేసే కదలికలతో ఉంటుంది. ఇది శివుడు   పార్వతీ దేవి యొక్క ఐక్యతను సూచిస్తూ, భక్తిని సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. చంద్రకాంతిలో రాత్రి సమయంలో  నృత్యం చేసే  ఇది.  స్త్రీత్వాన్ని  సామాజిక సామరస్యానికి కీర్తిస్తుంది.  

చాక્યાર కూతు:

(Image Source: x/ KeralaTourism)
(Image Source: x/ KeralaTourism)

చాక్యార కూతు (Chakyar Koothu)...ఇది కేరళలోని సంప్రదాయ నాటక కళారూపం. ప్రధానంగా హిందూ దేవాలయాలలో చాక్యార్ సముదాయానికి చెందిన కళాకారులు ప్రదర్శిస్తారు. ఇది సంస్కృత నాటకాలు , పురాణ కథలను ఆధారంగా చేసుకుని, ఒక కళాకారుడు (చాక్యార్) సంగీతం, హావభావాలు, సంభాషణల ద్వారా కథను చెప్పే ఏకవ్యక్తి ప్రదర్శన.  ఈ సోలో ప్రదర్శన కళలో హాస్యం, నాటకం, కథనం ఉంటాయి.    రామాయణం, మహాభారతాన్ని ప్రేరణగా తీసుకుంటారు.

ఒట్టంతుళ్ళల్:

(Image Source: x/ KeralaTourism)
(Image Source: x/ KeralaTourism)

ప్రముఖ మలయాళ కవి కుంచన్ నంబియార్  ఆవిష్కరించిన ఒట్టంతుళ్ళల్ నృత్యం, పాట , వ్యంగ్యాన్ని మిళితం చేస్తుంది.   సాంస్కృతిక కథలను తెలియజేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఓనం వేడుకలలో తరచుగా ఒట్టంతుళ్ళల్  హైలైట్ చేస్తుంది, ఇది వేడుకలను ఆనందంగా మరియు ఆకర్షణీయంగా ఉంచుతుంది.

మోహినియాట్టం:

(Image Source: x/ KeralaTourism)
(Image Source: x/ KeralaTourism)

 

మోహినియాట్టం కేరళ రాష్ట్రానికి చెందిన ఒక సాంప్రదాయ నృత్య రూపం. ఇది భారతీయ శాస్త్రీయ నృత్యాలలో ఒకటిగా స్త్రీలకు ప్రత్యేకమైన ఆకర్షణీయమైన, సౌమ్యమైన కదలికలకు ప్రసిద్ధి చెందింది. "మోహిని" అనే పదం సంస్కృతంలో "మోహం కలిగించే స్త్రీ" అని అర్థం.  మహిళలు ప్రదర్శించే ఈ నృత్యం మృదువైన హావభావాలు మరియు నిశ్శబ్ద వ్యక్తీకరణల ద్వారా కథలను చెబుతుంది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు

వీడియోలు

Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam
Ishan Kishan Named T20 World Cup 2026 | రెండేళ్ల తర్వాత టీ20ల్లో ఘనంగా ఇషాన్ కిషన్ పునరాగమనం | ABP Desam
Shubman Gill Left out T20 World Cup 2026 | ఫ్యూచర్ కెప్టెన్ కి వరల్డ్ కప్పులో ఊహించని షాక్ | ABP Desam
T20 World Cup 2026 Team India Squad Announced | ఊహించని ట్విస్టులు షాకులతో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ | ABP Desam
Tilak Varma Innings Ind vs SA T20 | అహ్మదాబాద్‌లో రెచ్చిపోయిన తిలక్ వర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది
Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది
Pawan Counter to YS Jagan: అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
MBBS Students Suicide: మెడికోల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు.. గ్రామీణ విద్యార్థులపై స్పెషల్ ఫోస్
మెడికోల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు.. గ్రామీణ విద్యార్థులపై స్పెషల్ ఫోస్
T20 World Cup 2026 Team India Squad :టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
Embed widget