Simhachalam Chandanotsavam: సింహాచల చందనోత్సవానికి గంధపు చెక్కలు ఎక్కడ నుంచి తీసుకొస్తారో తెలుసా?

సింహాచలం చందనోత్సవం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గంటకి 3600 మందికి దర్శనం కలిగేలా అలాగే అందరికీ కదంభ ప్రసాదం, లక్షా యాభై వేల లడ్డూల ప్రసాదం దక్కేలా ఏర్పాట్లు చేశారు.

FOLLOW US: 

తిరుపతి వెంకన్న బ్రహ్మోత్సవాలు ఎంత ఫేమస్సో ఉత్తరాంధ్రలో సింహాచలం అప్పన్న చందనోత్సవం కూడా అంతే ఫేమస్ . ఏడాది మొత్తం అంతా చందనంతో కప్పి ఉంచే స్వామిని ఏడాదికి ఒక్కసారి కేవలం పన్నెండు గంటలు భక్తులకు దర్శనం కల్పిస్తారు. దీనినే నిజరూప దర్శనం అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసంలో శుద్ధ తదియ నాడు సాధరణంగా మే  నెలలో వస్తుంది. ఆ సమయంలో లక్షకు తగ్గకుండా భక్తులు స్వామిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు చెబుతుంటారు . తిరుమల తిరుపతి దేవాస్థానం తరువాత అత్యంత ధనిక క్షేత్రంగా సింహాచలాన్ని చెబుతారు. 

వెయ్యేళ్ళ పైబడ్డ ఆలయం సింహాచలం 

చారిత్రక ఆధారాల బట్టీ, శాసనాలను బట్టీ ఈ ఆలయం 11వ శతాబ్దం ముందు నుంచీ ఉంది. అలాగే అంతకు ముందు నుంచి కూడా ఇక్కడి ఆలయంలో పూజలు నిర్వహించేవారనడానికి కూడా ఆధారాలు ఉన్నాయంటారు చరిత్రకారులు. సామాన్య శకం 1087లో ఇక్కడి ప్రధాన దైవాన్ని సింహగిరి స్వామి నరసింహదేవరగా కొలుస్తూ ఒక శాసనం ఉంది. స్వామి ప్రసూనాల కోసం తిరునందనవనం కల్పించే శాసనం ఇది. అప్పటి నుంచే ఈ దేవాలయంలో ద్రావిడ శ్రీవైష్ణవ సంప్రదాయం నడుస్తుందని ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. 

రెండు అవతారాలు కలసి ఉన్న అరుదైన దేవాలయం ఇది

సాధారణంగా ఒక వైష్ణవ దేవాలయంలో ఒకే అవతారాన్ని ప్రధాన దైవంగా కొలుస్తుంటారు. తిరుమలలో గోవిందరాజ స్వామి ఆలయం ఉన్నా అది కొండ కింద ఉంటుంది. తిరుమలలో మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మాత్రమే ప్రధాన క్షేత్రంగా  ఉంటుంది. అయితే సింహాచలంలో మాత్రం రెండు అవతారాలు ప్రధాన దైవాలుగా పూజలు అందుకుంటాయి. ఒకటి వరాహ నరసింహ స్వామి కాగా, రెండవది లక్ష్మీ నరసింహ స్వామి. రెండింటినీ కలిపి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడి ప్రధాన దైవంగా కొలుస్తారు. అలాగే ఆలయం మిగిలిన దేవాలయాలకు భిన్నంగా పశ్చిమాభిముఖముగా ఉండడం విశేషం. 

స్థల పురాణం 

హిరణ్య కశిపుడి నుంచి అతని కుమారుడు ప్రహ్లాదుణ్ని రక్షించడానికి అవతరించిన నరసింహ స్వామి హిరణ్య కశిపుణ్ణి అంతమొందించిన తరువాత ప్రహ్లాదుడి ఇక్కడ వరాహ నరసింహ స్వామిని ఆరాధించాడని, ఆయన తరువాత పురూరవుడు అనే రాజు స్వామికి దేవాలయం నిర్మించాడని స్థల పురాణం చెబుతుంది. స్వామి విగ్రహం నుంచి వెలువడుతున్న వేడిని చల్లార్చడానికి విగ్రహం నిండా చందనం పూసి ఉంచుతారు. కేవలం ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఆ చందనం తీసివేసి మరలా కొత్త చందనం పూస్తారు. ఆ సమయంలోనే భక్తులకు నిజరూప దర్శనం లభిస్తుంది. 

నిజరూపదర్శనం అంటే ఏమిటి :

ఇక్కడ స్వామివారు 4 రూపాల్లో ఉంటారు. వరాహం, నరుడు, సింహం రూపాలు కలగలసిన అవతారం కేవలం చందనం తీసినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. దీన్నే నిజరూపదర్శనం అంటారు. ఈ రూపంలో వరాహ తల, మనిషి శరీరం, సింహం తోక తో త్రిభంగ ఆసనంలో వరాహ నరసింహ స్వామి అవతారం ఉంటుంది. ఇక మిగిలిన ఏడాది మొత్తం చందనంతో కప్పి ఉండే రూపం నాలుగోది. ప్రతీ ఏడూ వైశాఖ శుద్ధ తదియ నాడు కనిపించే జరిగే చందనోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. 

చందనోత్సవం ఇలా జరుగుతుంది :

ఏటా అక్షయ తృతీయ రోజు సింహాచలంలో చందనోత్సవం కోసం భారీ కసరత్తే జరుగుతుంది. స్వామివారికి చందనపు పూతను పూసేందుకు అవసరమయ్యే గంధపు చెక్కలని తమిళనాడులోని మారుమూల ప్రదేశం నుంచి తెప్పిస్తారు. జాజిపోకల అనే మేలు రకం గంధాన్నే ఇందుకు వినియోగిస్తారు. చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు నుంచే ప్రత్యేకమైన పూజలని నిర్వహించి, గంధపు చెక్కల నుంచి గంధాన్ని తీసే ప్రక్రియను మొదలుపెడతారు. తెల్లవారితే అక్షయ తృతీయ అనగా, అర్థరాత్రి నుంచే బంగారు బొరుగులతో స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగిస్తారు. స్వామివారి మీద చందనాన్ని పూర్తిగా తొలగించిన తరువాత అక్షయతృతీయ తెల్లవారుజాము నుంచి స్వామివారి నిజరూపం భక్తులకు అందుబాటులో ఉంటుంది. స్వామివారిని తొలిగా దర్శించుకునే అవకాశం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులకు లభిస్తుంది. 

అక్షయ తృతీయ రాత్రి వేళ వరకూ భక్తుల దర్శనం సాగిన తరువాత స్వామి వారి అభిషేకం మొదలవుతుంది. ముందుగా సింహాచలం కొండ మీద ఉన్న గంగధార నుంచి వెయ్యి కలశాలతో సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆ తరువాత 108 వెండి కలశాలతో స్వామి వారికి పంచామృత అభిషేకాన్ని నిర్వహిస్తారు. అటు మీదట మూడు మాణుగలు అంటే సుమారు  120 కిలోల చందనాన్ని స్వామి వారికి లేపనం చేస్తారు. ఆ చందనంతో స్వామివారు నిజరూపం నుంచి నిత్యరూపంలోకి మారతారు. ఇక స్వామి వారి నుంచి వలిచి చందనాన్ని భక్తులకు కానుకగా ఇస్తారు. 

అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు :

సింహాచలం చందనోత్సవం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గంటకి 3600 మందికి దర్శనం కలిగేలా అలాగే 
అందరికీ కదంభ ప్రసాదం, లక్షా యాభై వేల లడ్డూల ప్రసాదం దక్కేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ఎవరికీ ఇబ్బంది లేకుండా 
పకడ్బందీగా పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపార. ఓఆర్‌ఎస్ ప్యాకిట్లు, మెడికల్ క్యాంపులు భక్తులను తరలించేందుకు దేవస్థానం, ఆర్‌టిసి కలిసి సంయుక్తంగా ప్రత్యేక బస్సులు లాంటివి ఏర్పాటు చేశారు. విధుల్లో వైద్య, ఆరోగ్య సిబ్బంది, దేవాదాయ శాఖ అదనపు సిబ్బంది ఏర్పాటు చేసినట్టు కూడా ఇక్కడి సిబ్బంది చెబుతున్నారు.

Published at : 02 May 2022 08:00 PM (IST) Tags: Vizag news Simhachalam Chandana Utsavam

సంబంధిత కథనాలు

Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు

Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు

Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

Today Panchang 21st May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిబాధలు తొలగించే స్త్రోత్రం

Today Panchang 21st May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిబాధలు తొలగించే స్త్రోత్రం

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశులవారికి ఇకపై భలే కలిసొస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశులవారికి ఇకపై భలే కలిసొస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Russia Ukraine War : ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !

Russia Ukraine War :  ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !

Subrahmanyam Death Case: టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు, సుబ్రహ్మణ్యం మృతి కేసులో కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్తత

Subrahmanyam Death Case: టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు, సుబ్రహ్మణ్యం మృతి కేసులో కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్తత

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు