అన్వేషించండి

Sri Rajarajeshwari Ashtakam: సకల విజయాలను అందించే అష్టకం, దసరా రోజు చదువుకుంటే మంచిది

Navratri 2022 Sri Rajarajeshwari : దసరా రోజు అమ్మ అనుగ్రహించే రూపం శ్రీ రాజరాజేశ్వరి. అపరాజితగా పిలుచుకునే రాజరాజేశ్వరిని స్మరిస్తే అపజయమే ఉండదని భక్తుల విశ్వాసం....

sri rajarajeshwari ashtakam: దసరా ఉత్సవాల్లో విజయదశమి రోజు దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరిదేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది. సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయములో పూజలందుకుంటుంది. అమ్మను అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజిస్తారు. ఈమె స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి.  ఇఛ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుంది. అమ్మ యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దేపితం చేస్తుంది. అనంత శక్తిస్వరూపమైన శ్రీచక్రమునకు అమ్మ అధిష్టాన దేవత.  పరమ శాంత స్వరూపంలో చిరునవ్వులు చిందిస్తూ చెరుకుగడను చేతిలో పట్టుకుని ఉన్న అమ్మవారిని విజయదశమినాడు దర్శించుకుంటే అన్నింటా విజయం సాధిస్తారని నమ్మకం. ఈరోజు చదవాల్సిన శ్రీ రాజరాజేశ్వరి అష్టకం...

Also Read: దసరా రోజు రావణదహన వేడుకలు ఎందుకు చేస్తారు, దశకంఠుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!

దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం పుట్టిన రోజే విజయదశమి అంటారు. ఏపనైనా తిథి,వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం చూసుకుంటారు. కానీ విజయదశమిరోజు ఏ సమయంలో ఏ కార్యక్రమం చేపట్టినా విజయం తథ్యం అంటారు. ఈ పర్వదినంలో చేసే శమీపూజ చాలా విశేషమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్షాన్ని పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను పొందుతారు...శమీవృక్ష రూపంలో ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాధించారు. 

Also Read:  విజయ దశమికి ఆయుధ పూజ ఎందుకు చేస్తారు


శ్రీ రాజరాజేశ్వరీ అష్టకం (Sri Rajarajeshwari Ashtakam)

అంబాశాంభవి చంద్రమౌళి రబలా పర్ణా ఉమాపార్వతీ
కాళీ హైమావతీ శివాత్రిణయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనీ శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 1 ||

అంబామోహినిదేవతా త్రిభువనీ ఆనంద సంధాయినీ
వాణీ పల్లవపాణి వేణు మురళీ గాన ప్రియలోలినీ
కళ్యాణీ ఉడురాజ బింబవదనా ధూమ్రాక్ష సంహారిణీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 2 ||

అంబానూపుర రత్నకంకణధరీ కేయూర హారావళీ
జాజీచంపక వైజయంతి లహరీ గ్రైవేయ వైరాజితా
వీణావేణు వినోద మండితకరా వీరాసనే సంస్థితా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 3 ||

అంబా రౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్జ్వలా
చాముండీ శ్రిత పోషజననీ దాక్షాయణీ పల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 4 ||

అంబా శూలధనుః కశాంకుధరీ అర్ధేందు బిబాధరీ
వారాహీ మధుకైటభ ప్రశమనీ వాణీరమా సేవితా
మల్లాద్యాసుర మూక దైత్యదమ్నీ మహేశ్వరీ అంబికా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 5 ||

అంబా సృష్టివినాశ పాలనకరీ ఆర్యా విసంశోభితా
గాయత్రీ ప్రణవాక్ష రామృతరసః పూర్ణానుసంధీకృతా
ఓమ్కారాదినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 6 ||

అంబా శాంకరి ఆగమాదివినుతా ఆర్యామహాదేవతా
యాబ్రహ్మాదిపిపేవికాంత జననీ యావై జగన్మోహినీ
య పంచ ప్రణవాది రేఫజననీ యాచిత్కళా మాలినీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 7 ||

అంబ పాలిత భక్త రాజిరనిశం అంబాష్టకం యఃపటేత్
అంబాలోక కటాక్ష వీక్షలతా ఐశ్వర్య సమృద్దితా
అంబోపాసన మంత్ర రాజపఠ నాదంత్యే చ మోక్ష ప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 8 ||

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Gemini and ChatGPT Pro Plans Free: ఫ్రీగా జెమిని, చాట్‌జిపిటి ప్రోవెర్షన్! ఈ పని చేస్తే వేల రూపాయల ప్లాన్‌లు ఉచితంగా వాడుకోవచ్చు!
ఫ్రీగా జెమిని, చాట్‌జిపిటి ప్రోవెర్షన్! ఈ పని చేస్తే వేల రూపాయల ప్లాన్‌లు ఉచితంగా వాడుకోవచ్చు!
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Psych Siddhartha OTT: సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Happy News Year 2026: 2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు!అవేంటో చూద్దామా?
2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు!అవేంటో చూద్దామా?
Embed widget