Narsimha Jayanti 2022, Shani Thrayodashi : మే 14 శనిత్రయోదశి, నృసింహ జయంతి- ఇలా చేస్తే చాలా మంచి జరుగుతుంది

నారసింహుడిని హృదయపూర్వకంగా ఆరాధిస్తే ఎన్నో సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం. శ్రీ మహా విష్ణువు అవతారాల్లో ఒకటైన నృసింహ జయంతి మే 14 శనివారం వచ్చింది. ఇదే రోజు శనిత్రయోదశి కావడం మరింత విశిష్టత…

FOLLOW US: 

శ్రీ మహావిష్ణువు అవతారాల్లో నారసింహ అవతారం నాల్గవది. మానవ శరీరం, సింహం శిరస్సుతో  ఉన్న నారసింహ స్వామి జయంతి వైశాఖ శుక్ల చతుర్ధి నాడు జరుపుకుంటారు. ఈ రోజన శ్రీ మహా విష్ణువు  హిరణ్యకశిపుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి నృసింహ జయంతిని వేడుకగా జరుపుకుంటారు. 

పురాణగాథ
పురాణ గాథ ప్రకారం కశ్యప మహర్షి-దితి సంతానం హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. విష్ణుభగవానుడు లోకకళ్యాణార్ధం రాక్షసుడైన హిరణ్యాక్షుడుని సంహరించాడు. ఇది భరించలేని సోదరుడైన హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువుతో  వైరం పెంచుకున్నాడు. కోపోద్రిక్తుడైన హిరణ్యకశిపుడు తీవ్రంగా తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాక మరణం లేకుండా వరం కోరుకుంచాడు.  అయిన తర్వాత చావులేకుండా వరం పొందుతాడు. ఆకాశం మీద కానీ నేల మీద కానీ, మనిషితో కానీ జంతువుతో కానీ, పగలు కానీ రాత్రి కానీ అస్త్రాలతో కానీ మరణం రాకుండా వరం అనుగ్రహించాలంటాడు. సరే అంటాడు బ్రహ్మ. ఆ తర్వాత హిరణ్యకశిపుడు అన్ని లోకాలను శాసించడం మొదలెట్టాడు. 

Also Read: అప్పులు,కష్టాలు, ఆర్థిక నష్టాలు, అనారోగ్యం తొలగిపోవాలంటే ఈ తిథుల్లో ఇలా చేయండి

నృసింహ జయంతి కథ
హిరణ్యకశిపుడప-లిలావతికి ప్రహ్లాదుడు జన్మిస్తాడు. ఆ పిల్లవాడు శ్రీ మహావిష్ణువు భక్తుడు. కొడుకుని శ్రీహరి దారి నుంచి మళ్లించేందుకు హిరణ్యకశిపుడు శతవిధాల  ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి పహ్లాదుడిని సంహరించేవరకూ పరిస్థితి వెళ్లింది. విషప్రయోగం చేసినా, ఏనుగులతో తొక్కించినా లోయలో పడేసినా ఎప్పటికప్పుడు శ్రీహరి రక్షిస్తూ ఉండేవాడు. ఇక విసిగిపోయిన హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పమంటాడు. ఇందుగలడని అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెదికిన అందందే కలడు నా శ్రీహరి అని సమాధాం చెబుతాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభంలో చూపించు అని తన గదతో పగులగొడతాడు.అంతే.... భయంకరాకారుడై, తల సింహం రూపంలో మొండెం మనిషి ఆకారంలో గర్జిస్తూ ఒక్క ఉదుటున ఆ రాక్షసుడిని తన తొడలమీద పడుకోబెట్టి  గోళ్లతో వక్షస్థలాన్ని చీల్చి చెండాడి హిరణ్యకశిపుడిని అంతమొందిస్తాడు నారసింహ స్వామి. ఆ రోజు ఈ రోజే కావడంతో నారసింహుడి జయంతి జరుపుకుంటారు.

చతుర్దశి తిథి 2022 మే 14  శనివారం సాయంత్రం 1.30 కి ప్రారంభమై ఆదివారం ఉదయం 11.58 వరకూ ఉంది. చతుర్థశి రోజు భక్తులు ఉపవాసం చేసి.. సూర్యాస్తమయం సమయంలో నరసింహ స్వామిని పూజించాలి. సంధ్యా సమయంలో నారసింహుడు స్తంభంలోంచి ఉద్భవించినందున ఆ సమయంలో పూజిస్తే స్వామి ఆశీర్వాదాలు మెండుగా లభిస్తాయి. ద్వారం వద్ద సంధ్యాదీపం వెలిగించడం ఇంకా శుభకరం.

'ఓం నమో నారసింహాయ' అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే స్వామివారి కటాక్షం దక్కుతుందంటారు పండితులు

నారసింహ గాయత్రి
'నారసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి 
తన్నః సింహః ప్రచోదయాత్‌' 

Also Read: అక్వేరియం ఇంట్లో ఉండొచ్చా, ఉంటే ఏ దిశగా ఉండాలి, ఎన్ని చేపలుండాలి

నృసింహుడి పూజ వల్ల కలిగే ప్రయోజనాలు

  • కోర్టు కేసులు, చట్టపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు
  • అనారోగ్య సమస్యలు తీరుతాయి
  • అప్పులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి
  • శత్రువుల నుంచి, పీడనుంచి రక్షణ ఉంటుంది

ఇదే రోజు శని త్రయోదశి కూడా కావడంతో పొద్దున్నే నువ్వులనూనె రాసుకుని తలకు స్నానం చేసి ఉదయం శని ఆరాధన, సాయంత్ర నారసింహుడి ఆరాధన చేస్తే మంచిదంటున్నారు పండితులు.

Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే

Published at : 13 May 2022 04:59 PM (IST) Tags: Shani shani mantra shani trayodashi importance of shani trayodashi significance of shani trayodashi shani trayodashi pooja shani trayodasi narasimha jayanti narasimha jayanthi utsavam

సంబంధిత కథనాలు

Horoscope Today 28th May 2022:  ఈ రాశులవారు తమ పనిని  పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Today Panchang 28 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శనిని ప్రశన్నం చేసుకునే శాంతిమంత్రం

Today Panchang 28 May 2022:  తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శనిని ప్రశన్నం చేసుకునే శాంతిమంత్రం

Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!

Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!

Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట

Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట

Astrology: ఆగస్టులో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు

Astrology: ఆగస్టులో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు

టాప్ స్టోరీస్

NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

NTR Centenary birth celebrations :   తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !

IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !

Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్‌ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్

Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్‌ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్

100 Years Of NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటో- శత జయంతి వేళ అభిమానులకు అదిరిపోయే న్యూస్

100 Years Of NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటో- శత జయంతి వేళ అభిమానులకు అదిరిపోయే న్యూస్