అన్వేషించండి

Spirituality : అప్పులు,కష్టాలు, ఆర్థిక నష్టాలు, అనారోగ్యం తొలగిపోవాలంటే ఈ తిథుల్లో ఇలా చేయండి

వారంలో ఏడు రోజులూ ఒక్కో రోజు ఒక్కో దేవుడికి కేటాయించి పూజలు చేస్తుంటారు. మరి అలాగే 16 తిథులకు కూడా ప్రత్యేకంగా దేవుళ్లున్నారు తెలుసా. ఏ తిథి రోజు ఏ దేవుడిని పూజించాలో ఇక్కడ తెలుసుకోండి.

తేదీలు, రోజుల కన్నా తిథుల ఆధారంగానే పండుగలు, పెళ్లిళ్లు, పుట్టినరోజులు, ఇతర ముహూర్తాలు నిర్ణయించేవారు. ఇప్పుడు తిథులపై పెద్దగా అవగాహన లేక డేట్స్ హడావుడి మొదలైంది. ఇప్పటికీ దేవతల పుట్టిన రోజులన్నీ జన్మతిథిని బట్టి నిర్ణయిస్తారు. అంటే ప్రతి తిథికి ఓ దేవుడు ప్రాతినిథ్యం వహిస్తాడన్నమాట. మరి ఏ తిథి రోజు ఏ దేవుడిని పూజించాలి, ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం...

మొత్తం తిథులు 16
పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి,షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య . అమావాస్య నుంచి పౌర్ణమి వరకు 15 రోజులను శుక్ల పక్షం అని, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు  15 రోజులను కృష్ణపక్షం అని పిలుస్తారు.

ఏ తిథిరోజు ఏ దేవుడిని పూజించాలంటే

  • పాడ్యమి రోజు అగ్ని దేవుడిని పూజించడం వల్ల అపరిమితమైన సంపద కలుగుతుంది.
  • విదియ రోజు బ్రహ్మదేవుడిని పూజిస్తే అన్ని రకాల విద్యల్లో ముందుంటారు
  • తదియ రోజు గౌరీదేవిని ఆరాధిస్తారు. గౌరీ కళ్యాణం తదియనాడు జరిగినందున ఈ తిథి అంటే అమ్మవారికి ఇష్టం
  • చవితి రోజు వినాయకుడిని పూజిస్తే తలపెట్టిన పనుల్లో విఘ్నాలు తొలగి విజయం సాధిస్తారు
  • పంచమి రోజు నాగదేవతను ఆరాధిస్తే..సర్పదోషాలు తొలగిపోతాయి
  • షష్టి రోజు కార్తికేయుడిని పూజిస్తే కీర్తి ప్రతిష్టలు పొందుతారు
  • సప్తమి సూర్యభగవానుడికి ఇష్టమైన తిథి. ఈ రోజు సూర్యారాధన చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి
  • అష్టమి దుర్గాదేవి అష్టమాతృకలు ఆవిర్భవించిన తిథి. అష్టమాతృకలను, దుర్గాదేవిని పూజిస్తే శుభం కలుగుతుంది.
  • నవమి రోజు దుర్గామాతను పూజిస్తే చెడును నశింపచేసి విజయాన్నిస్తుంది
  • దశమి రోజు దిక్కుల సృష్టి జరిగింది. ఇంద్రాదిదేవతలు ఈ దిక్కులకు పాలకులు. అష్టదిక్పాలకులను పూజిస్తే పాపాలు తొలగిపోతాయి
  • ఏకాదశి రోజు కుబేరుడిని పూజిస్తే సిరిసంపదలు కలుగుతాయి. ఎందుకంటే కుబేరుడు సంపదకు మూలకారకుడు
  • ద్వాదశి రోజు విష్ణువుకు ఇష్టమైన తిథి. ఈ తిథిరోజే విష్ణుమూర్తి, వామన రూపంలో జన్మించాడు. ద్వాదశినాడు ఆవునెయ్యితో వ్రతం చేస్తే పుణ్యం లభిస్తుంది.
  • త్రయోదశి యమధర్మరాజు పుట్టిన తిథి.ఈ రోజు ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మరణబాధలు తప్పిపోతాయి.
  • చతుర్దశి- రుద్రుని తిథి. ఈ రోజు రుద్రాభిషేకం చేస్తే శివానుగ్రహం లభిస్తుంది
  • పౌర్ణమి కి చంద్రుడు అధిపతి. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి చంద్రుడిని పూజిస్తే ధనధాన్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి.
  • అమావాస్య పితృదేవతలకు ఇష్టమైన తిథి. దర్భలు, నువ్వులు, నీళ్ళతో పితృదేవతలకు తర్ణణమిస్తే వారు సంతోషించి సంతానసౌఖ్యం అనుగ్రహిస్తారు.

నోట‌్: కొన్ని పుస్తకాలు, పండితుల సూచనల మేరకు రాసిన వివరాలివి...వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

Also Read: అక్వేరియం ఇంట్లో ఉండొచ్చా, ఉంటే ఏ దిశగా ఉండాలి, ఎన్ని చేపలుండాలి

Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే

Also Read: వాస్తుప్రకారం ఇలాంటి స్థలం కొంటే మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cockroach Janta Party:2029 ఎన్నికల్లో CJP గెలుస్తుందా?
2029 ఎన్నికల్లో CJP గెలుస్తుందా? "నేను కూడా ఒక బొద్దింకనే" జెన్ Z ఉద్యమం విజయం సాధిస్తుందా?
Shri Kedarnath Dham: కేదార్‌నాథ్‌లో వృషభం ఆకారంలో శివలింగం ఎందుకు? పురాణ రహస్యం & అద్భుతాలు!
కేదార్‌నాథ్‌లో వృషభం ఆకారంలో శివలింగం ఎందుకు? పురాణ రహస్యం & అద్భుతాలు!
Dhul Hijjah 2026: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?
ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?
Mulank 1 Personality Traits: మీ పుట్టిన తేదీ 1,10,19 లేదా 28 అయితే ఈ లక్షణాలు మీలో ఉంటాయి!
మీ పుట్టిన తేదీ 1,10,19 లేదా 28 అయితే ఈ లక్షణాలు మీలో ఉంటాయి!

వీడియోలు

MI vs KKR IPL 2026 Highlights | ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఊచకోత
KKR Bowlers Destroy MI Batting IPL 2026 | ముంబైకు చుక్కలు చూపించిన నరైన్, గ్రీన్
Sanju Samson vs Heinrich Klaasen | క్లాసెన్‌తో గొడవకు ఎండ్ కార్డ్ వేసిన సంజూ
Virat Kohli Comments On Captaincy Stress | ద్రవిడ్ చేసిన సాయంపై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
Hardik Pandya Shocking Comments IPL 2026 | కేకేఆర్ చేతిలో ఓటమిపై హార్దిక్ పాండ్యా అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Mahanadu 2026 Theme: మహానాడు-2026 - స్త్రీ శక్తి థీమ్‌తో టీడీపీ వార్షిక వేడుక.. 20 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం!
మహానాడు-2026 - స్త్రీ శక్తి థీమ్‌తో టీడీపీ వార్షిక వేడుక.. 20 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం!
PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?
ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన: యూఏఈ, ఇటలీ, నెదర్లాండ్స్ నుంచి ఏం తెచ్చారు? మీ జేబు, ఉద్యోగాలు, భద్రతపై ప్రభావం ఏంటీ?
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతా బ్లాక్! అరెస్టు ఖాయమంటున్న అభిజీత్! 
బొద్దింక పార్టీకి షాక్, కాక్రోచ్‌ జనతా పార్టీ ఎక్స్ ఖాతా నిలిపివేత!
Peddi Review : పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
PoK Terrorist Killings: పాక్‌లో ధురంధర్ ఆపరేషన్స్ - పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్‌ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో హతం!
పాక్‌లో ధురంధర్ ఆపరేషన్స్ - పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్‌ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో హతం!
Wife Stabs Husband Case Telangana: భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
Vaddi Kaasula Vaada Glimpse : కాలేజీ కట్టి 25 పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ - తండ్రిపై మంచు మనోజ్ సెటైర్!
కాలేజీ కట్టి 25 పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ - తండ్రిపై మంచు మనోజ్ సెటైర్!
Bold Comedy Movie : అడల్ట్ కామెడీ విత్ బోల్డ్ డైలాగ్స్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త మూవీ
అడల్ట్ కామెడీ విత్ బోల్డ్ డైలాగ్స్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త మూవీ
Embed widget