అన్వేషించండి

Narmada Pushkaralu 2024 : నర్మదా నది పుష్కరాలు ప్రారంభం - 12 రోజుల్లో ఏ రోజు ఏ దానం చేయాలి!

Narmada River Pushkaralu 2024 : ఈ ఏడాది నర్మదా నది పుష్కరాలు మే 1 నుంచి 12 రోజుల పాటూ జరుగుతాయి. ఈ 12 రోజుల్లో ఏ రోజు ఏ దానం చేయాలంటే...

Narmada Pushkaralu 2024 : ప్రతి నదికి పన్నెండేళ్లకోసారి పుష్కరాలొస్తాయి.బృహస్పతి వృషభరాశిలో ప్రవేశించిన రోజు నుంచి 12 రోజుల పాటూ నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. పుష్కర సమంలో నదీ స్నానం, దానం, పిండ ప్రధానం ముఖ్యమైనవి. అయితే ఈ 12 రోజులు ఏ రోజు ఏ దానం చేయాలంటే...

 పుష్కర సమయంలో చేయవలసిన దానాలు గురించి పురాణాల్లో ఇలా ఉంది...

మొదటి రోజు
బంగారం, వెండి, ధాన్యం , భూధానం చేస్తే..ఈ లోకలం సమస్త భోగాలు అనుభవించి మరణానంతరం స్వర్గానికి చేరుకుంటారు

రెండో రోజు
వస్త్ర దానం, ఉప్పు దానం, రత్న దానం చేస్తే...ఈ లోకంలో సంతోషంగా జీవితాన్ని గడిపి..మరు జన్మలో సార్వభౌముడు అవుతారు

Also Read: ఇవాల్టి నుంచి నర్మదానది పుష్కరాలు - ఘాట్ల వివరాలివే!

మూడో రోజు
బెల్లం, ఫలాలు దానం ఇస్తే.. సుఖవంతమైన జీవితాన్ని పొందుతారు

నాలుగో రోజు
నెయ్యి , నూనె, పాలు, తేనె దానం చేసినవారు... అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, దీర్ఘాయుష్షు పొందుతారు

ఐదో రోజు
ధాన్యం, గోదానం, హలం దానం ఇచ్చినవారు..ఇహలోకంలో భోగాలు అనుభవించి దేహం విడిచిన తర్వాత శివుడి సన్నిధికి చేరుతారు

ఆరో రోజు 
ఔషధదానం, కర్పూరదానం, చందనదానం, కస్తూరి దానం చేస్తే ఆరోగ్యవంతులవుతారు

Also Read: చిన్న చిన్న లాభాల కోసం మీ బంధాన్ని రిస్క్ లో పెట్టొద్దు - రాశి ఫలాలు 1 మే 2024 !

ఏడో రోజు
గృహదానం, పీట దానం, శయ్య దానం చేసినవారు...ఈ జన్మ మరుజన్మలో విలాసవంతమైన జీవితం పొందుతారు

ఎనిమిదో రోజు
చందన దానం, కందమూలాల దానం, పుష్ప మాల దానం చేసిన వారు సకల ఐశ్వర్యాలు పొందుతారు

తొమ్మిదో రోజు
పిండ ప్రదానం, కంబళి దానం చేస్తే...పుణ్యలోకాలు పొందుతారు

పదో రోజు
 కూరగాయలు, సాలగ్రామం, పుస్తకాలు దానం చేస్తే...ఆరోగ్యం, ఆయుష్షు

పదకొండో రోజు
గజ దానం చేస్తే మరణానంతరం వైకుంఠంలో అడుగుపెడతారు

Also Read: శివుడిని నేరుగా దర్శించుకోకూడదా!

పన్నెండో రోజు
పుష్కరాల్లో ఆఖరి రోజు నువ్వులు దానం ఇస్తే సకల సమస్యల నుంచి విముక్తి పొందుతారు....

బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తే ఏ నదికి పుష్కరాలు

  • బృహస్పతి మేష రాశిలో ప్రవేశించినప్పుడు గంగానది - ( 2023)
  • బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు నర్మదా నది -  ( 2024)
  • బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతి నది-  ( 2025)
  • బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నది -  ( 2026)
  • బృహస్పతి సింహ రాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నది -  ( 2027)
  • బృహస్పతి  కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణా నది  -  ( 2028)
  • బృహస్పతి తులా రాశిలో ప్రవేశించినప్పుడు కావేరి నది  - ( 2029)
  • బృహస్పతి వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు భీమా నది -  ( 2030)
  • బృహస్పతి ధనస్సు రాశిలో ప్రవేశించినప్పుడు తపతి/బ్రహ్మపుత్రా నది -  ( 2031)
  • బృహస్పతి మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్రా నది - ( 2032)
  • బృహస్పతి కుంభ రాశిలో ప్రవేశించినప్పుడు సింధు నది -  ( 2033)
  • బృహస్పతి మీన రాశిలో ప్రవేశించినప్పుడు ప్రాణహిత నది -  ( 2034)

Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే

పన్నెండు జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ ఒకటి . మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో న‌ర్మ‌దా న‌ది తీరంలో కొలువయ్యాడు  ఓంకారేశ్వరుడు. ఇక్కడున్న అమ్మవారిని అన్నపూర్ణదేవిగా కొలుస్తారు. సంస్కృత ఓం ఆకారంలో వెలసిన ఈ క్షేత్రంలో ఓంకారేశ్వర లింగం , అమలేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం. ఇక్కడ అమర్‌కంటక్ ఆలయం, ఓంకారేశ్వర్ ఆలయం, చౌసత్ యోగిని ఆలయం, చౌబీస్ అవతార్ ఆలయం, మహేశ్వర్ ఆలయం, నెమవార్ సిద్ధేశ్వర్ మందిరం , భోజ్‌పూర్ శివాలయం చాలా పురాతనమైనవి.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget