అన్వేషించండి

Horoscope Today 1 May 2024 : చిన్న చిన్న లాభాల కోసం మీ బంధాన్ని రిస్క్ లో పెట్టొద్దు - రాశి ఫలాలు 1 మే 2024 !

Daily Horoscope: మే నెలలో మొదటి రోజు ఏ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి, ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...

2024 మే 1 రాశిఫలాలు

మేష రాశి

నగదు సమస్య పరిష్కారం అవుతుంది. మీ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటారు. మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. దూరప్రాంతం ప్రయామం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు.

వృషభ రాశి

గతంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించగలుగుతారు. మీ చుట్టూ ఉండే ప్రతికూల వ్యక్తుల కారణంగా మీరు ఇబ్బంది పడతారు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో అనవసర వాదనలు పెట్టుకోవద్దు. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. 
 
మిథున రాశి

ఏదో అసమ్మతి ఉంటుంది. కొత్తగా పరిచయం అయిన వారిని త్వరగా నమ్మేయకండి. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న లాభాల కోసం మీ బంధాన్ని రిస్క్ లో పెట్టొద్దు. 

Also Read: శివుడిని నేరుగా దర్శించుకోకూడదా!

కర్కాటక రాశి

ఏదో తెలియని చికాకు ఉంటుంది. వ్యక్తిగత సమస్యలను ఇతరులతో ఎక్కువగా పంచుకోవద్దు. కార్యాలయంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. అధిక ఒత్తిడి కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. పిల్లల  కెరీర్ విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. ప్రేమ సంబంధాలలో భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. 

సింహ రాశి

రోజంతా సంతోషంగా ఉంటారు. ప్రణాళికాబద్ధంగా అన్ని పనులు పూర్తిచేస్తారు. ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. కొన్నాళ్లుగా మీకు రావాల్సిన డబ్బు చేతికందుతుంది. కోర్టు కేసులలో మీకు అనుకూల తీర్పు ఉంటుంది. 

కన్యా రాశి

కుటుంబ వివాదాలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లోని వ్యక్తుల బదిలీలపై చర్చ జరుగుతుంది.  శత్రువులు మీకు స్నేహ హస్తం అందించవచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ ప్రతిభకు తగిన ప్రశంసలు అందుకుంటారు.

Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే

తులా రాశి

ఈ రాశివారు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది. ఎవ్వర్నీ తొందరగా నమ్మేయవద్దు. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించాలి. ఆరోగ్యం జాగ్రత్త.

వృశ్చిక రాశి

ఈ రాశివారు స్నేహితుల కారణంగా బాధపడతారు. కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అధికారులతో మీకున్న విభేదాలు తొలగిపోతాయి.  పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచండి. ప్రేమ సంబంధాలలో తీవ్రత ఉంటుంది.  తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి

Also Read: సింహాద్రి అప్పన్న నుంచి కాటమరాయుడి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నారసింహ క్షేత్రాలు

ధనుస్సు రాశి

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  వ్యాపారంలో అకస్మాత్తుగా పెద్ద ఆర్డర్‌లను పొందవచ్చు. పిల్లలు చదువులో అద్భుతంగా రాణిస్తారు. ఆలోచనల్లో సానుకూలత కొనసాగించండి. కార్యాలయంలో రాజకీయాలకు మీరు బాధితులుగా మారే అవకాశం ఉంది...జాగ్రత్త పడండి. 

మకర రాశి

ఈ రోజు చాలా బిజీగా ఉంటారు. వ్యక్తిగత జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో పెద్దల అభిప్రాయాలను గౌరవించండి.  కోపం తగ్గించుకోవాలి. 

కుంభ రాశి

ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ పని చేసినా, ఆలోచనాత్మకంగా చేయండి.   కోపాన్ని నియంత్రించుకోండి. పాత అప్పులు తీర్చాలని ఒత్తిడి ఉంటుంది. ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించవద్దు..కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేయండి. 

Also Read: యాదాద్రి సహా తెలంగాణలో నారసింహస్వామి కొలువైన మహిమాన్వితే క్షేత్రాలివే

మీన రాశి

ఈ రాశివారికి పదోన్నతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ భాగస్వామి మద్దతు మీలో ధైర్యాన్ని పెంచుతుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం. 

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

14-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
14-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
Solar Eclipse 2026: మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
Solar Eclipse 2026: సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
ఆగష్టు 12న సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget