Matsya Jayanti 2022: ఈ రోజు చాలా ప్రత్యేకం, శ్రీ మహావిష్ణువుని పూజించి ఈ శ్లోకం చదివితే మోక్షానికి రూట్ క్లియర్ అవుతుందట

ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు దశావతారాలు ఎత్తాడు. వాటిలో మొదటి అవతారం మత్స్యావతారం. చైత్ర బహుళ తదియ రోజు ( అంటే ఈ రోజు) మత్స్యజయంతి. ఈ సందర్భంగా ఏబీపీ దేశం ప్రత్యేక కథనం

FOLLOW US: 

మత్స్యావతారం కథ
వరాహకల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు , విష్ణు భక్తుడు. ఒకరోజు అతను కృతమాలా నదికి వెళ్ళి స్నానం చేసి , సూర్యునికి అర్ఘ్యం ఇస్తూండగా దోసిటలో చేపపిల్ల పడింది. రాజు దానిని నీటిలోనికి జారవిడిచాడు. మళ్ళీ నీటిని దోసిలి లోకి తీసుకున్నప్పుడు మళ్లీ వచ్చిన చేప ఇలా అంది  “రాజా ! నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి , దయచేసి నన్ను రక్షించు” అని ప్రార్థించినది. వెంటనే రాజు ఆ చేపపిల్లని ఒక పాత్రలో వేసాడు. మరుసటి రోజుకి ఆ చేపపిల్ల పాత్రపట్టనంత పెద్దది అయ్యింది. అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు. ఆ మరుసటిరోజుకి ఆ చేపపిల్లకి చెరువు కూడా సరిపోలేదు. అ రాజు … ఆ చేపపిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ మత్స్యం (చేప) శతయోజన ప్రమాణానికి విస్తరించింది. అప్పుడు ఆ చేప... “తాను శ్రీమన్నారాయణుడుని అని , ఏడు రోజులలో ప్రళయం రానున్నదని , సర్వజీవరాశులు నశించిపోతాయి అని , ఈ లోకమంతా మహాసాగరమవుతుందని...నీలాంటి సత్యవంతుడు బతికేఉండాలని పలికింది చేప. అప్పటికప్పుడు పెద్ నౌకను నిర్మించి అందులో పునఃసృష్టికి అవసరమైన ఔషధాలు , బీజాలు వేసుకుని సిద్ధంగా ఉండమని , సప్తఋషులు కూడా ఈ నౌకలోనికి వస్తారని చెప్పింది.  చేపరూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్ముకు మహాసర్ప రూపమైన తాడుతో నావను కట్టి , ప్రళయాంతం వరకు రక్షిస్తాడు.పురాణసంహితను రాజుకు ఉపదేశిస్తాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యునికి శ్రద్ధదేవునిగా జన్మించి , ‘వైవస్వత మనువు’ గా ప్రసిద్ధికెక్కాడు. 

Also Read:  శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో మీ రాశిఫలితం, కందాయ ఫలం ఇక్కడ తెలుసుకోండి
వేదాలు అపహరణ
ప్రళయానంతరం నిద్రలేచిన బ్రహ్మ సృష్టికార్యం చేద్దామనుకోగా వేదాలు అపహరించుకుని సముద్ర గర్భంలో దాక్కుంటాడు సోమకాసురుడు. అప్పుడు  బ్రహ్మ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా , మత్స్య రూపంలో ఉన్న విష్ణువు  సోమకాసురునితో పోరాడి , అతని కడుపుని చీల్చి వేదాలను – దక్షిణావృత శంఖాన్ని తీసుకొస్తాడు. శంఖాన్ని తాను తీసుకున్న విష్ణుమూర్తి... శిథిలమైన వేదభాగాలను పూరించమని బ్రహ్మను ఆజ్ఞాపిస్తాడు. 

మత్స్య జయంతి రోజు ఏం చేయాలి
ఈ రోజు విష్ణుమూర్తికి అంకితం చేసిన రోజు. అందుకే వైష్ణవఆలయాల్లో ప్రత్యేక పూజలు, భజనలు, ఉపవాస దీక్షలు చేస్తారు. మత్స్యజయంతి రోజు ఇలా చేస్తే మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారమని భక్తుల విశ్వాసం. 

Also Read: శుభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలావారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే అంతా శూన్యమే

మత్స్య జయంతి రోజు పఠించాల్సిన శ్లోకం
నూనం త్వం భగవాన్ సాక్షాద్ధరిర్నారాయణోవ్యయః|
అనుగ్రహాయ భూతానాం ధత్తె రూపం  జలౌకసామ్ |
నమస్తే  పురుషశ్రేష్ఠ! స్థిత్యుత్పత్త్యప్యయేశ్వర |
భక్తానాం నః ప్రపనానాం ముఖ్యొహ్యాత్మగతిర్విభో
సర్వే లీలావతారాస్తె భూతానాం భూతిహెతవః|
జ్ఞాతుమిచ్ఛామ్యదొ రూపం యథార్థం భవతా వృతమ్
న తేరవిన్దాక్ష పదోపసర్పణం మృషా భవేత్ సర్వసుహృత్ప్రియాత్మనః|
యథెతరెషాం పృథగాత్మనాం సతా మదీదృశొ యద్వపురద్భుతం హి నః

మన దేశంలో మత్స్యావతారానికి ఒకే ఒక దేవాలయం ఉంది. అది తిరుపతికి 70 కి.మీ. దూరంలో నాగలాపురం అనే గ్రామంలో ఉంది. ఇక్కడ స్వామివారిని వేదనారాయణస్వామి అని పిలుస్తారు.

Published at : 04 Apr 2022 11:07 AM (IST) Tags: matsya jayanti status matsya jayanti latest matsya jayanti status best whatsapp status matsya jayanti latest matsya jayanti whatsapp status matsya jayanti 2022 matsya jayanti 2022 date

సంబంధిత కథనాలు

Shukra Gochar 2022 : శుక్రగ్రహ సంచారం వల్ల ఈ మూడు రాశులవారు ఓ సమస్య నుంచి బయటపడితే మరో సమస్యలో ఇరుక్కుంటారు

Shukra Gochar 2022 : శుక్రగ్రహ సంచారం వల్ల ఈ మూడు రాశులవారు ఓ సమస్య నుంచి బయటపడితే మరో సమస్యలో ఇరుక్కుంటారు

Shukra Gochar 2022 zodiac: మే 23న రాశి మారుతున్న శుక్రుడు, ఈ రాశులవారి జీవితం ప్రేమమయం

Shukra Gochar 2022 zodiac: మే 23న రాశి మారుతున్న శుక్రుడు, ఈ రాశులవారి జీవితం ప్రేమమయం

Subramanian Swamy: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Subramanian Swamy: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

Horoscope Today 20th May 2022: ఈ రాశివారికి పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 20th May 2022: ఈ రాశివారికి పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం