అన్వేషించండి

డిసెంబర్ 19న మార్గశిర అమావాస్య! సరైన సమయం, పూజా విధానం, చంద్రుడి అనుగ్రహానికి ఏం చేయాలో తెలుసుకోండి.

Margashirsha Amavasya 2025 : పితృ పూజకు ముఖ్యమైన రోజు అమావాస్య. 2025 నవంబర్ 19న ఈ అమావాస్య. పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి.

Amavasya 2025: హిందూ ధర్మంలో అమావాస్య రోజున చంద్రుడిని పూజించే ఆచారం ఉంది. ఈ రోజున భక్తితో చంద్రుడిని పూజిస్తే, కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ రోజు వేకువజామునే స్నానం ఆచరించి.. పితృదేవతలను పూజించి వారికి తర్పణం సమర్పించి, దానం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీర్వచనం లభిస్తుందని పండితులు చెబుతారు. అందుకే దర్శ అమావాస్యను శ్రాద్ధ అమావాస్య అని పిలుస్తారు

అమావాస్య 2025 ఎప్పుడు?

మార్గశిర మాసం అమావాస్య 2025 డిసెంబర్ 19 న వచ్చింది. అమావాస్య తిథి వేకువజామున ప్రారంభమై రోజంతా ఉంటుంది. ఎలాంటి గందరగోళం లేకుండా సూర్యోదయం, సూర్యాస్తమయం సమయానికి అమావాస్య తిథి ఉంది. అందుకే డిసెంబర్ 19న  అమావాస్య..
 
ముహూర్తం  సమయం
బ్రహ్మ ముహూర్తం ఉదయం 04:33 నుంచి ఉదయం 05:25 వరకు
విజయ ముహూర్తం మధ్యాహ్నం 01:32 నుంచి మధ్యాహ్నం 02:15 వరకు
గోధూళి ముహూర్తం  సాయంత్రం 05:09 నుంచి సాయంత్రం 05:35 వరకు
అమృతకాలం డిసెంబర్ 19 శుక్రవారం మధ్యాహ్నం  01:09 నుంచి 02:56 వరకు  
సూర్యోదయం  ఉదయం 6 గంటల 26 నిముషాలు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 25 నిముషాలు

అమావాస్య  ప్రాముఖ్యత

నమ్మకాల ప్రకారం.. అమావాస్య రోజున ఉపవాసం చేసే వారిపై శివుడితో పాటు చంద్రుని అనుగ్రహం కూడా ఉంటుంది. చంద్రుడు శాంతిని అందిస్తాడు.  అమావాస్య రోజున పితృదోషం నుంచి విముక్తి పొందడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. 

అమావాస్య పూజా విధానం

అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయండి.
వ్రతం చేయడానికి సంకల్పం తీసుకుని పూజ పూర్తిచేయండి
శివుడు, పార్వతి దేవి, చంద్రుడు, తులసిని పూజించండి

పూజా స్థలాన్ని శుభ్రం చేసి గంగాజలం చల్లాలి. తరువాత దీపం వెలిగించి పూజ ప్రారంభించండి. శివుడు, పార్వతి దేవి విగ్రహాలను ప్రతిష్టించిన తర్వాత అభిషేకం చేయండి. అలాగే, చంద్రుడిని ఆహ్వానించండి. శివలింగంపై పాలు, పండ్లు, పువ్వులు, గంజాయి-దతురాతో పంచామృతం సమర్పించండి. శివుడు , పార్వతి దేవి ముందు నెయ్యి దీపం వెలిగించి ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. అనంతరం చంద్రుడిని స్తుతించండి. దర్శ అమావాస్య వ్రత కథను విని శివ చాలీసా పఠించండి. అనంతరం తులసి ముందు దీపం వెలిగించి పూజ పూర్తిచేసి ఫలహారం తీసుకోండి. మర్నాడు ఉదయం పూజ తర్వాత వ్రతాన్ని విరమించండి
 
అమావాస్య రోజు ఏం చేయాలి?

అమావాస్య రోజున బ్రహ్మచర్యం నియమాలను కచ్చితంగా పాటించండి.
పితృదేవతల పేరు మీద తర్పణం ఇవ్వండి
సాత్విక ఆహారం తీసుకోండి. 
అందరినీ గౌరవించండి. 
దానధర్మాలు చేయండి

భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాసం
 
భగవద్గీత 10వ అధ్యాయం, 35వ శ్లోకంలో శ్రీకృష్ణుడు

“మాసానాం మార్గశీర్షోఽహం” అని చెప్పాడు.
అంటే “మాసాలలో నేను మార్గశిర్ష మాసం”

అందుకే ఈ నెల మొత్తం చాలా పవిత్రమైనదే.. అమావాస్య కూడా అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ రోజు పుణ్య నదుల్లో స్నానం, తిల (నువ్వులు) దానం, గోదానం, వస్త్ర దానం చేయడం మహా ఫలదాయకరం. ఉపవాసం ఉండి శివుడు, విష్ణువు, దత్తాత్రేయుడు, పితృ దేవతల పూజ చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు. తమిళనాడులో ఇది “అరుద్రా దర్శనం”కు ముందు రోజు కావడంతో ప్రాముఖ్యత ఉంది. కేరళలో “త్రిక్కాకర అప్పన్” ఆరాధనకు సంబంధించిన రోజు. 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. ఇక్కడ ABPLive.com ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

ఆధ్యాత్మిక రహస్యం: అమ్మవారికి నల్లపిల్లి, మేకపోతు, దున్నపోతుని బలివ్వండి అంటారు? ఎందుకు? అసలు బలి అంటే ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

దేవతల వాహనాలను ఆధునిక టెక్నాలజీతో ముడిపెడితే! ఆశ్చర్యపరిచే రహస్యాలు! eVTOL, AVATAR ఇంకా...

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP government employees: ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
Australia terror attack: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
YSRCP Kukatpalli: కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
Advertisement

వీడియోలు

Prashant Veer Kartik Sharma CSK IPL 2026 Auction | ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ | ABP Desam
Auqib Nabi IPL 2026 Auction | ఐపీఎల్ 2026 వేలంలో భారీ ధర పలికిన అనామక ప్లేయర్ | ABP Desam
Matheesha Pathirana IPL 2026 Auction | భారీ ధరకు వేలంలో అమ్ముడుపోయిన పతిరానా | ABP Desam
Quinton de Kock IPL 2026 Auction Surprise | సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ కు అంత తక్కువ రేటా.? | ABP Desam
Cameron Green IPL Auction 2026 | ఆసీస్ ఆల్ రౌండర్ కు ఐపీఎల్ వేలంలో ఊహించని జాక్ పాట్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP government employees: ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
Australia terror attack: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
YSRCP Kukatpalli: కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
Jai Akhanda: 'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!
'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!
Bride Viral video: రెండు గంటల్లో పెళ్లీ -ఎక్స్‌తో పెళ్లికూతురు కిస్సింగ్ - జెన్‌జీ ఇంతేనా? వైరల్ వీడియో
రెండు గంటల్లో పెళ్లీ -ఎక్స్‌తో పెళ్లికూతురు కిస్సింగ్ - జెన్‌జీ ఇంతేనా? వైరల్ వీడియో
Pawan Kalyan Gift To Sujeeth: 'ఓజీ' దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఖరీదైన గిఫ్ట్... ఆ కారు రేటు ఎంతో తెలుసా?
'ఓజీ' దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఖరీదైన గిఫ్ట్... ఆ కారు రేటు ఎంతో తెలుసా?
Lionel Messi: మరోసారి భారత్‌కు లియోనెల్ మెస్సీ! టీ20 ప్రపంచ కప్‌లో భారత్-అమెరికా మ్యాచ్‌కు వచ్చే అవకాశం!
మరోసారి భారత్‌కు లియోనెల్ మెస్సీ! టీ20 ప్రపంచ కప్‌లో భారత్-అమెరికా మ్యాచ్‌కు వచ్చే అవకాశం!
Embed widget