అన్వేషించండి

ఆధ్యాత్మిక రహస్యం: అమ్మవారికి నల్లపిల్లి, మేకపోతు, దున్నపోతుని బలివ్వండి అంటారు? ఎందుకు? అసలు బలి అంటే ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Spirituality News: అమ్మవారికి నల్లపిల్లి, మేకపోతు, దున్నపోతుని బలివ్వండి అని చెబుతుంటారు...అంటే అమ్మవారి ముందు వీటిని చంపేయమనా? రక్తం చిందించమనా? దీనివెనుకున్న అసలు కారణం తెలుసా? 

Spiritual Mysteries: జాతర జరిగేటప్పుడు అమ్మవారికి(దేవీ శక్తి స్వరూపిణి) నల్లపిల్లి, మేకపోతు, దున్నపోతు బలివ్వాలని చెబుతుంటారు. బలులు ఇప్పటికీ కొనసాగుతున్నాయ్. అయితే దీనివెనుకున్న ఆధ్యాత్మిక సందేశం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నిజంగా అమ్మవారు కోరుకున్నది రక్తతర్పణం కాదని అర్థమవుతుంది..

నల్లపిల్లి, మేకపోతు, దున్నపోతు...ఈ మూడు మూడు దుర్గణాలకి సంకేతం

పిల్లి దొంగతనానికి సంకేతం - పైగా చీకట్లో నల్లపిల్లి అస్సలు కనిపించదు

మేక మూర్ఖత్వానికి ప్రతీక.. తలకు పగిలేట్టు కొట్టుకుంటాయ్

దున్నపోతు పిరికితనానికి గుర్తు.. పిరికితనమే పునర్జన్మకి హేతువు

ఈ దుర్గణాలను అమ్మవారి దగ్గర వదిలేయమని అర్థం

నల్లపిల్లి - దొంగబుద్ధి

నల్లపిల్లి చీకట్లో కనిపించదు..పైగా దాని పాదాల్లో మాంసపుముద్దలుంటాయి అందుకే పిల్లి నడిచినప్పుడు శబ్దం రాదు. అదే మనలోని దొంగబుద్ధి – ఎవరికీ కనిపించకుండా, ఎవరికీ తెలియకుండా చేసే పాపాలు, కపటాలు, మోసాలు..ఇవన్నీ ఈ కోవకే చెందుతాయి. ఇలాంటి చీకటి మనస్సును అమ్మవారి పాదాల చెంత వదిలిపెట్టి నన్ను ఇలాంటి ఆలోచన నుంచి విడిచిపెట్టు అమ్మా అని ప్రార్థించమని అర్థం

మేకపోతు – మూఢత్వం, మూర్ఖత్వం

మేకలు తలలు పోటాపోటీగా ఢీకొట్టుకుంటాయ్. తలలు పగిలిపోయినా వెనక్కు తగ్గవు. ఇదే మనలోని మూర్ఖత్వం.  కోపం, ఆవేశంలో కుటుంబ బంధాలు తెంచుకోవడం, గురువుల మాట వినకపోవడం, జ్ఞానం లేకుండా అహంకారంతో డబ్బుమదంతో నడుచుకోవడం..ఇవన్నీ ఈ కోవకే చెందుతాయి. 

శాస్త్రాలు చెప్పేదీ ఇదే… 

“మూర్ఖోపి మేకవజ్జన్మ” 

అంటే మూర్ఖుడు తర్వాత జన్మలో మేకగా పుడతాడట. ఆ మూర్ఖత్వాన్ని అమ్మవారికి సమర్పించి “నాకు వివేకం ప్రసాదించు” అని దీనివెనుకున్న ఆంతర్యం
 
దున్నపోతు – పిరికితనం, భయం

దున్నపోతుకి ఎంత బలమైన శరీరం ఉన్నా.. చిన్న కర్ర చూపించగానే లొంగిపోతుంది. ఇదే మనలోని పిరికితనం – “శరీరం నేను కాదు, ఆత్మను” అనే ధైర్యం లేకపోవడం. ఈ భయమే పునర్జన్మకు మూల కారణం. “అభయం సర్వభూతేభ్యో” అని ఉపనిషత్తులు చెప్పినట్టు… ఆ భయాన్ని విడిచి, ఆత్మ ధైర్యం పొందమని దున్నపోతు బలివ్వమని చెప్పేందుకు సంకేతం.

ఈ మూడు దుర్గుణాలనూ (దొంగతనం, మూర్ఖత్వం, పిరికితనం)... అమ్మవారి సన్నిధిలో పూర్తిగా సమర్పించి... “నేను నీ దాసుడిని, పరమేశ్వరుడే నా యజమాని” అని శరణాగతి కోరుకోవడమే నిజమైన బలి. అప్పుడే మనసు శుద్ధి అవుతుంది, మోక్షం సమీపిస్తుంది. 

అహంకారాన్ని, దుర్గుణాలను చంపడమే అసలైన “త్రిపశు బలి”..రక్తం చిందించడం కాదు. ఈ  మూడు దుర్గణాలను అమ్మవారి దగ్గర విడిచిపెట్టడం...

త్రిపశు బలి చరిత్ర గురించి చెప్పుకుంటే...

త్రిపశు బలి (నల్లపిల్లి – మేక – దున్నపోతు) ...
“త్రిపశు బలి” అనే పదం తాంత్రిక-శాక్తేయ సంప్రదాయంలో  అతి ప్రాచీనమైన భావన. దీని చరిత్రను మూడు దశల్లో చూడవచ్చు

వైదిక – పురాణ కాలం  
వేదాల్లో పశుబలి ఉంది కానీ అది బాహ్య యాగాలకే (అశ్వమేధ, గోమేధ మొదలైనవి). కానీ ఉపనిషత్తు కాలం నాటికి (బృహదారణ్యక, ఛాందోగ్య) “అంతర్యాగం” ఆరంభమైంది. అంటే బాహ్య బలి కన్నా మనస్సులోని దుర్గుణాల బలి గొప్పదని చెప్పారు. 

ఛాందోగ్యోపనిషత్తు (3.17.4)లో
 “ఆత్మానమేవ పశునా యజేత” అని ఉంది – అంటే తన అహంకారాన్నే పశువుగా బలి ఇవ్వాలి.

తంత్ర – ఆగమ కాలం 

“త్రిపశు బలి” స్పష్టమైన రూపం తీసుకుంది ఇక్కడే. ముఖ్య గ్రంథాలు:కాళికా పురాణం (అ. 60-62)
అమ్మవారికి మూడు రకాల పశువులు బలి ఇవ్వాలని చెబుతూ… వెంటనే “ఏతే పశవః మనుజాకారాః” అని వివరిస్తుంది – అంటే ఈ మూడూ మనిషి రూపంలోని దుర్గుణాలే. నల్లపిల్లి = కామ (దొంగచూపు), మేక = క్రోధ (మూర్ఖత్వం), మహిష (దున్నపోతు) = మోహ (భయం).

అంటే..“పశుబలి కాదు, పశుత్వ బలినే కోరుతుంది దేవీ” అని స్పష్టంగా చెబుతుంది.
 
ఆధునిక సంస్కర్తలు & ఆచార్యుల వివరణ 

రామకృష్ణ పరమహంస, వివేకానందులు – ఈ బలి అంతర్గతమేనని బోధించారు. భాస్కరరాయ మాఖీంద్రుడు (లలితా సహస్రనామ భాష్యంలో) – “త్రిపురసుందరి సన్నిధిలో కామ-క్రోధ-మోహాలను బలి ఇవ్వాలి” అని వ్రాశారు. శ్రీ విద్యా సంప్రదాయంలో ఇప్పటికీ “త్రిపశు సమర్పణ మంత్రం” ఉంది

“కామేశ్వరి కామపశుం, క్రోధేశ్వరి క్రోధపశుం, మోహేశ్వరి మోహపశుం సమర్పయామి” 

దక్షిణ భారతంలోని పలు ప్రాంతాల్లో గ్రామదేవత ఆలయాల్లో కొందరు బలి ఇస్తే..మరికొందరు వాటిని అమ్మవారి సన్నిధిలో వదిలేస్తారు..

కాబట్టి 
“త్రిపశు బలి” అనేది మొదటి నుంచి రెండు స్థాయిలుగా ఉంది

1. పశుత్వంలో ఉన్నవారికి బాహ్య బలి (రక్తం)

2. దివ్య స్థితిలో ఉన్నవారికి అంతర్గత బలి (దుర్గుణ నాశనం) 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi In Lok Sabha: వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
Vijayawada Crime News: సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
Allu Cinemas Dolby Screen : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?
Actor Dileep : హీరోయిన్‌కు వేధింపులు - మలయాళ నటుడు దిలీప్‌కు క్లీన్ చిట్... 8 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు
హీరోయిన్‌కు వేధింపులు - మలయాళ నటుడు దిలీప్‌కు క్లీన్ చిట్... 8 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు
Advertisement

వీడియోలు

Gambhir Warning to DC Owner | ఐపీఎల్ ఓనర్ కు గంభీర్ వార్నింగ్
DK Shivakumar Chinnaswamy Stadium IPL 2026 | ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ పై శివకుమార్ ట్వీట్
Ravi Shastri Comments on Team India | టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్
Coach Gautam Gambhir About Ro - Ko |  రో - కో జోడీపై గంభీర్ షాకింగ్ కామెంట్స్
మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi In Lok Sabha: వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
Vijayawada Crime News: సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
Allu Cinemas Dolby Screen : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?
Actor Dileep : హీరోయిన్‌కు వేధింపులు - మలయాళ నటుడు దిలీప్‌కు క్లీన్ చిట్... 8 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు
హీరోయిన్‌కు వేధింపులు - మలయాళ నటుడు దిలీప్‌కు క్లీన్ చిట్... 8 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు
Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
Dhurandhar Collections : 100 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ 'ధురంధర్' - కేవలం 3 రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్
100 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ 'ధురంధర్' - కేవలం 3 రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్
Hyderabad Crime News: నరికి, తుపాకీతో కాల్చి.. హైదరాబాద్ లో రియల్టర్ దారుణహత్య.. పట్టపగలే నడిరోడ్డుపై ఘాతుకం
నరికి, తుపాకీతో కాల్చి.. హైదరాబాద్ లో రియల్టర్ దారుణహత్య.. పట్టపగలే నడిరోడ్డుపై ఘాతుకం
Upcoming Telugu Movies : ఒకే వారంలో 8 మూవీస్ - ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌ల ఫుల్ లిస్ట్ ఇదే!
ఒకే వారంలో 8 మూవీస్ - ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌ల ఫుల్ లిస్ట్ ఇదే!
Embed widget