Horoscope Today 19 December 2024: ఈ రాశులవారు శత్రువులపై పైచేయి సాధిస్తారు
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today 19th December 2024
మేష రాశి
మేషరాశి వారు వైవాహిక సంబంధాలలో అపనమ్మకం కలిగి ఉంటారు. విద్యార్థులకు ఉపాధ్యాయుల నుంచి ఆశించిన సహకారం అందదు. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో సత్ఫలితాలుంటాయి. Aries Year Astrology
వృషభ రాశి
ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన సమావేశానికి ఆహ్వానం పొందుతారు. రియల్ ఎస్టేట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ రోజు చాలా మంచి ప్రతిపాదనలను అందుకుంటారు. మీరు మీ ప్రతిభను గొప్పగా ఉపయోగించుకోగలుగుతారు. కుటుంబానికి సంబందిచి ఆందోళనలు ఉండవచ్చు. మీరు మీ ప్రియమైన వారితో ఒంటరిగా గడుపుతారు. Taurus Year Astrology Prediction 2025
మిథున రాశి
చేపట్టిన పనుల విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ రోజు డబ్బు అప్పుగా ఇవ్వకండి.. లేకుంటే దాన్ని తిరిగి పొందడం కష్టమవుతుంది. అపరిచితులను విశ్వసించడం మానుకోవాలి. ఇతరులతో వివాదాలకు దిగొద్దు. కారంగా ఉండే ఆహారాన్ని తినడం మానుకోవాలి. Gemini Year Astrology Prediction 2025
కర్కాటక రాశి
కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఇది మంచి రోజు. మీ దినచర్య క్రమబద్ధంగా ఉంటుంది. మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు ఇంటిని పునరుద్ధరించడానికి ప్లాన్ చేయవచ్చు. కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. డబ్బు సమస్య తీరుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో విజయం సాధిస్తారు. Cancer Year Astrology Prediction 2025
సింహ రాశి
సింహరాశి వారు వివాహేతర సంబంధాల వైపు ఆకర్షితులవుతారు. కీళ్లు, మోకాళ్లలో నొప్పి సమస్య ఉండవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. యువత ఉద్యోగాలు పొందుతారు. పెండింగ్‌లో ఉన్న డబ్బు తిరిగి పొందలేరు. కోపం కారణంగా మీ సంబంధాలు దెబ్బతింటాయి. మీరు బీమాలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. Leo Yearly Horoscope 2025
కన్యా రాశి
ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ ముందు శత్రువులు ఓడిపోతారు. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు విజ్ఞతతో కొన్ని పెద్ద పనులు చేయగలరు. వివాహ సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది.
తులా రాశి
మీరు ఈరోజు వ్యాపార పనుల నిమిత్తం ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఉన్నత పదవుల్లో ఉన్నవారు ముఖ్యమైన పత్రాలను భద్రంగా ఉంచుకోవాలి. అతి విశ్వాసంతో పనిచేయడం మానుకోండి. శ్రేయోభిలాషుల సలహా తీసుకున్న తర్వాత పని చేయడం లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు అద్భుతమైన రోజు అవుతుంది.
వృశ్చిక రాశి
ఇతరుల విషయాలలో మీ అభిప్రాయాన్ని తెలియజేయవద్దు. చిన్న చిన్న పొరపాట్లు చేయడంతో ఎక్కువ నష్టపోతారు. సంభాషణ సమయంలో అసభ్యకరమైన భాషను ఉపయోగించవద్దు.
ధనుస్సు రాశి
పర్యాటక రంగానికి సంబంధించిన వ్యక్తులకు మంచి రోజు. మీ ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. మీరు వ్యాపారంలో కొత్త పద్ధతులను ఉపయోగిస్తారు. అప్పు చేయాల్సి రావచ్చు. ఎవరినీ వెంటనే నమ్మవద్దు
మకర రాశి
మకర రాశి వారు ఈ రోజు ప్రారంభించే పనుల్లో విజయాన్ని పొందుతారు. మీరు గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. మీ ప్రవర్తనలో సానుకూల మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వాహన యోగం ఉంది
కుంభ రాశి
ఎవరితోనూ అనవసరంగా వాదించకండి. విద్యార్థులకు రోజు చాలా మంచిది. మీ లక్ష్యాల గురించి చాలా స్పృహతో ఉంటారు. ఉద్యోగులు కార్యాలయంలో రాజకీయాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు అనవసరమైన విషయాలపై ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది
మీన రాశి
ఈ రోజు మీకు కొన్ని సమస్యలు తలెత్తుతాయి. రహస్య శాస్త్రాలు నేర్చుకోవాలనే కోరిక ఉంటుంది. వాతావరణంలో మార్పుల ప్రభావం మీ ఆరోగ్యంపై ఉంటుంది. ఆదాయం గురించి ఆందోళన చెందుతారు. మీ పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచండి.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.