News
News
వీడియోలు ఆటలు
X

March Month Astrology: మార్చి నెలలో పుట్టినవారు మోనార్క్ లు వీళ్లని ఎవ్వరూ మోసం చేయలేరు

Astrology: ఒకరి వ్యక్తిత్వం…వారు పుట్టిన తేదీ, సమయం, రాశి, తిథి, గ్రహస్థితి ఆధారంగా మాత్రమే కాదు...పుట్టిన నెల ఆధారంగా కూడా చెప్పొచ్చంటారు జ్యోతిష్యులు. మరి డిసెంబరులోో పుట్టినవారెలా ఉంటారంటే...

FOLLOW US: 
Share:

మార్చి నెలలో జన్మించిన వారు చాలా తెలివైన వారు. ఎలాంటి వాతావరణంలో అయినా తమని తాము ప్రూవ్ చేసుకోగలుగుతారు. పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచి నాయకులుగా నిలబడతారు. ఈ నెలలో జన్మించిన వారు ఎక్కువగా రాజకీయాల్లో రాణిస్తారు.  మార్చి నెలలో పుట్టినవారి లక్షణాలు ఎలా ఉంటాయంటే...

మార్చి నెలలో పుట్టినవారి లక్షణాలు

 • మార్చిలో పుట్టినవారు చాలా సహజంగా ఉంటారు.
 • వీరు చాలా తెలివైనవారు, మోసం చేయడం చాలా కష్టం. వీరికి వ్యతిరేకంగా ఎవరైనా పథకం వేసినట్టైతే ఈజీగా పసిగట్టేయగలరు
 • మార్చిలో పుట్టిన వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఏ పని చేసినా సక్సెస్ అవుతారు
 • ఈ నెలలో పుట్టిన వారు ఎక్కువ మంది నాయకులుగా ఉన్నత స్థానంలో ఉంటారు
 • వీరిలో సృజనాత్మకత ఎక్కువ. ప్రతిభావంతులు, కళాత్మక మనస్సు కలిగి ఉంటారు
 • మార్చి నెలలో పుట్టినవారికి గర్వం, తొందరపాటు రెండూ ఎక్కువే
 • ఇతరులను త్వరగా ద్వేషించి వారి కోపానికి గురవుతారు.అందుకే వీరితో స్నేహం ఎక్కువ కాలం నిలవదు
 • వీరికి జాలి, ప్రేమ కూడా తక్కువే. మాటల్లో ఉన్న జోరు సాయం చేయడంలో ఉండదు
 • రాజకీయాల్లో బాగా రాణిస్తారు
 • వీరి ఆలోచనలు చాలా ఫాస్ట్ గా ఉంటాయి
 • స్వతంత్ర్య భావాలు ఎక్కువ, ఎవ్వరినీ లెక్కచేయరు
 • ఈనెలలో పుట్టినవారి సంసార జీవితం అంత సాఫీగా సాగదు
 • ఎదుటివారి పొగడ్తలకు లొంగిపోయి వారికి పనులు చేసి పెడుతుంటారు
 • శతృత్వం కొని తెచ్చుకునే రకం
 • వీరు ఏ వ్యాపారం చేసినా కలిసొస్తుంది, ఆకస్మిక ధనలాభం పొందుతారు
 • 37 ఏళ్లు దాటినప్పటి నుంచీ బాగా కలిసొస్తుంది, ఆర్థికంగా నిలదొక్కుకుంటారు, సుఖపడతారు

Also Read: మీరు డిసెంబరులో జన్మించారా, అయితే మీరు పుట్టుకతోనే టీచర్లు, నిత్య విద్యార్థులు

మార్చిలో పుట్టిన వారి ఆరోగ్యం: తలనొప్పి, కంటికి సంబంధించిన సమస్యలొస్తాయి

మార్చిలో పుట్టిన వారి ఆదాయం: ధైర్యానికి అదృష్టం కూడా తోడవుతుంది..బాగా సంపాదిస్తారు

కలిసొచ్చే వారాలు: మంగళ, గురు, శుక్రవారం కలిసొస్తాయి

కలిసొచ్చే రంగులు:  పసుపు, ఆకుపచ్చ రంగులు కలిసొస్తాయి

సర్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, కల్పనా చావ్లా,  జాకీర్ హుస్సేన్, అమీర్ ఖాన్ ఇలా చాలామంది ప్రముఖులు మార్చిలో జన్మించినవారే.

Note: ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

Also Read: అక్టోబరులో పుట్టారా, మీరు సింహం లాంటోళ్లని మీకు తెలుసా!

Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి

Published at : 07 Jun 2022 08:22 AM (IST) Tags: Astrology Zodiac Months characteristics of March born

సంబంధిత కథనాలు

Dwarkadhish Temple in Ratlam: ప్రతి రాత్రి ద్వారకాధీశుని విగ్రహం మాయం.. రత్లాంలోని ఈ ఆలయం గురించి తెలుసా?

Dwarkadhish Temple in Ratlam: ప్రతి రాత్రి ద్వారకాధీశుని విగ్రహం మాయం.. రత్లాంలోని ఈ ఆలయం గురించి తెలుసా?

జూన్ 6 రాశిఫలాలు, ఈ రాశివారు క్లిష్టమైన విషయాన్ని ఈ రోజు పరిష్కరించుకుంటారు!

జూన్ 6 రాశిఫలాలు, ఈ రాశివారు క్లిష్టమైన విషయాన్ని ఈ రోజు పరిష్కరించుకుంటారు!

Bhagavad Gita Sloka: గీతాసార‌మంతా ఈ 5 శ్లోకాలలోనే ఉంది

Bhagavad Gita Sloka: గీతాసార‌మంతా ఈ 5 శ్లోకాలలోనే ఉంది

Peepal Tree : రావిచెట్టును పూజిస్తే శ‌ని అనుగ్ర‌హం ఖాయం

Peepal Tree : రావిచెట్టును పూజిస్తే శ‌ని అనుగ్ర‌హం ఖాయం

Decoding dreams: కలలో బంగారం కనిపిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా?

Decoding dreams: కలలో బంగారం కనిపిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా?

టాప్ స్టోరీస్

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్‌ ఎంత పెరగొచ్చు?

RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్‌ ఎంత పెరగొచ్చు?

Bro Special Song Cost : ఏంటిది పవన్ 'బ్రో' - ఊర్వశి స్పెషల్ సాంగ్‌కు అంత ఖర్చా?

Bro Special Song Cost : ఏంటిది పవన్ 'బ్రో' - ఊర్వశి స్పెషల్ సాంగ్‌కు అంత ఖర్చా?

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!