Manikarnika Ghat: మణి కర్ణిక ఘాట్ - మీ పూర్వీకుల వివరాలు లభించే అరుదైన పుణ్య స్థలం!
Manikarnika Ghat: మణి కర్ణిక ఘాట్ - హిందూ పూర్వీకుల వివరాలు లభించే అరుదైన పుణ్య స్థలం...మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక కథనం

Manikarnika Ghat Varanasi: కాశి లోని గంగా ఘాట్ లలో దేని ప్రత్యేకత దానిదే. అలాంటి వాటిలో ఒకటి మణి కర్ణిక ఘాట్. ఈ ఘాట్లో ఒక అరుదైన విశేషం ఉంది. అదే హిందువుల పూర్వీకుల జాతకాలు లభించే "హిందూ వంశావళి రిజిస్టర్". ఇది చాలా విచిత్రమైనది. కొన్ని వందల సంవత్సరాలుగా హిందువులు తమ పూర్వీకుల పిండ ప్రధానం, జాతక కర్మల పనుల కోసం వారణాసి వెళ్లడం పరిపాటిగా మారింది. అలా వెళ్ళిన వారు అక్కడ ఉన్న పురోహితులతో తమ పూర్వీకులకు పిండ ప్రధానం చస్తూ వారి వివరాలను అక్కడ నమోదు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత తరం వారూ అదే పని చేసారు. ఇలా తరతరాలుగా కాశీ వెళ్లే హిందువులు తమ వివరాలను తెలియకుండానే అక్కడి పురోహితులకు ఒక రిజిస్టర్ రూపంలో అందజేస్తూ వచ్చారు. అక్కడ ఉన్న పురోహితులు వాటిని చాలా జాగ్రత్త చేయడంతో ఇప్పటి తరానికి తెలియని గుర్తులేని తమ తమ పూర్వికుల వివరాలన్నీ వారణాసిలోని మణి కర్ణికా ఘాట్ వద్ద ఉండే పురోహితులు వద్ద హిందూ వంశావళి రిజిస్టర్ ల పేరుతో నిక్షిప్తమై ఉన్నాయి.
Also Read: కన్నప్పగా మారిన తిన్నడు అసలు కథ ఇదే!
మీరు హిందువులై ఉండి కాశీలో పిండ ప్రధానం చేసే అలవాటు మీ కుటుంబంలో ఉంటే కచ్చితంగా మీ పూర్వకల వివరాలు అక్కడ లభించే అవకాశం ఉంటుందనేది ఒక నమ్మకం. నిజం చెప్పాలంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా లేని కొన్ని ముఖ్యమైన కుటుంబాల పూర్వీకుల వివరాలు మణికంఠ ఘాట్ లో దొరుకుతాయని నమ్మకం. అలాగే పూర్వకాలంలో తమ చివరి దశలో కాశీకి వెళ్లిపోయి అక్కడే తనువు చాలించే ఆచారం ఒకటి ఉండేది . అలాంటి వారి వివరాలూ అక్కడ లభిస్తాయి అని అంటారు. చారిత్రికంగా మణికర్ణిక ఘాట్ ఎంత పురాతనమైందంటే గుప్తుల కాలం నుండే దీని ప్రస్తావన ఉంది.
Also Read: శివరాత్రి మహత్యాన్ని చెప్పే అద్భుతమైన కథలివి.. లింగోద్భవ సమయానికి ఇలా చేయండి!
సతీదేవి చెవి పోగు పడిన ప్రాంతం ఇది
దక్షప్రజాపతి యాగానికి పిలవకుండా వెళ్లిన సతీదేవికి అవమానం జరుగుతుంది. ఆ అవమాన భారంతో అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేస్తుంది. సతీదేవి దేహాన్ని భుజంపై మోస్తూ తిరుగుతున్న శివుడిని తిరిగి కార్యోన్ముఖున్ని చేయడం కోసం విష్ణువు తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు చేసినప్పుడు ఆమె చెవి పోగులు ఇక్కడ పడడంతో మణికర్ణిక ఘాట్ అనే పేరు వచ్చింది అంటారు. ఇది ఒక శక్తి పీఠం. ఇక్కడ దహనం జరిగితే మనిషి మోక్షాన్ని పొందుతాడని హిందువుల నమ్మకం. ఈ ఘాట్ లోని ఒకటి రెండు పురాతన దేవాలయాలు గంగా నదిలో సగం వరకు కూరుకు పోయి ఉంటాయి. వీటిని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుంది. దశాశ్వమేధ ఘాట్ కి పక్కనే ఉండే మణికర్ణికా ఘాట్ ను శివరాత్రి రోజు దర్శించడం చాలా పుణ్యమని చెబుతారు పండితులు.
Also Read: ఈ రోజు కళ్లారా చూసింది కూడా రేపు తెల్లారేసరికి మాయే.. శివుడివి ఈ పాటలు వింటే మీకు పూనకమే!
Also Read: పంచారామాలు, పంచభూత లింగాలు మాత్రమే కాదు..పంచకేదార క్షేత్రాల గురించి తెలుసా!





















