Mahalaya Amavasya 2023: మహాలయ అమావాస్య రోజు పితృ దేవతలు ఆహారం ఇలా స్వీకరిస్తారు
Mahalaya Amavasya 2023: మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం, తర్పణం ఇవ్వడం ఆనవాయితీ. మహాలయ అమావాస్య రోజు మనం సమర్పించే ఆహారాన్ని పితరులు ఎలా స్వీకరిస్తారు..?
Mahalaya Amavasya 2023: మహాలయ అమావాస్య శనివారం, అక్టోబర్ 14, 2023 నాడు వస్తుంది. ఈ రోజున, పూర్వీకుల పుణ్యతిథి తెలియకపోయినా లేదా ఎవరికైనా విధిగా శ్రాద్ధకర్మలు చేయలేదో వారికి పిండ ప్రదానం, తర్పణం ఇస్తారు. అయితే మనం పూర్వీకులకు అందించే తర్పణం లేదా ఆహారం వారికి ఎలా చేరుతుంది అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది. మీరు సమర్పించిన శ్రాద్ధంతో మీ పూర్వీకులు నిజంగా సంతృప్తి చెందారో లేదో తెలుసుకోవడం ఎలా..? శ్రాద్ధాహారం పూర్వీకులకు ఎలా చేరుతుంది..? దానం పూర్వీకులకు ఎలా చేరుతుంది?
పితృదేవతల స్వభావం
పురాణాల ప్రకారం పితృదేవతలు, పూర్వీకుల స్వభావం ఏమిటంటే, మనం చేసే శ్రాద్ధకర్మలను వారు దూరం నుంచి గమనిస్తారు. మనం భక్తితో సమర్పించే ఆహారాన్ని, సంప్రదాయబద్ధంగా అర్పించే తర్పణాన్ని స్వీకరించి సంతృప్తి చెందుతారు.
Also Read : మహాలయ పక్షంలో మరణిస్తే మంచిదేనా లేదంటే అశుభమా!
జీవితం సులభతరం
మర్త్యలోకంలో చేసే శ్రాద్ధకర్మ పితృలోకానికి వెళ్లే మానవ పూర్వీకులను మాత్రమే సంతృప్తిపరుస్తుంది. తృప్తి చెంది వారు ఎక్కడున్నా తమ వారి జీవితాలను బాగుచేస్తారు. తమవారి జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకినీ తొలగిస్తారు.
ఆత్మ తృప్తి
గోత్రనామాల సహాయంతో, హవన సమయంలో అందించే దైవ పితృ తర్పణ మొదలైన వాటిని పూర్వీకులు స్వీకరించేలా అగ్నిదేవుడు చేస్తాడు. దీంతో వారు తమ కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా వారి ఆత్మ సంతృప్తి చెందుతుంది.
స్వర్గలోకంలో పితరులు
దేవలోకంలో అంటే స్వర్గ లోకంలో పితరులకు స్థానం ఉంటే, అక్కడ దేవతలు అమృతం మాత్రమే తాగుతారు కాబట్టి ఇక్కడ వారిని ఉద్దేశించి సమర్పించే ఆహారం, నీరు అమృత కణాల రూపంలో అందుతాయి. వారికి మనం ఇచ్చే ఆహారం అమృతం రూపంలో వారికి చేరుతుంది.
వాయు రూపంలో ఉన్న పితరులు
వాయు రూపంలో పూర్వీకుల ఆత్మలు పాములు మొదలైన రూపాలలో సంచరించగా, పానీయాలను యక్ష రూపంలో వారు మహాలయ అమావాస్య రోజు సమర్పించిన వస్తువులను స్వీకరిస్తారు.
Also Read : పితృ పక్షంలో బిడ్డ పుడితే కుటుంబంలో జరగబోయే మార్పులేంటో తెలుసా!
మానవ లోకంలో పితృదేవతలు
పూర్వీకులు మానవ రూపంలో మళ్లీ జన్మించి ఉంటే, వారి కోసం శ్రాద్ధ సమయంలో మనం అందించే ఆహారాన్ని పక్షులు, జంతువుల రూపంలో తీసుకుంటారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.