Maha Shivaratri 2022: మీ బంధుమిత్రులకు శివరాత్రి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి
మంత్రం అంటే పరివర్తనం కలిగించేది. క్రమపద్ధతిలో మంత్రోచ్చారణ వల్ల శరీరంలో ప్రకంపనలు ఏర్పడతాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈ శ్లోకాల కోట్స్ తో మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి
మహా శివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా శైవ ఆలయాలు పంచాక్షరి మంత్రంతో పరవశించిపోతున్నాయి. ఈ సందర్భంగా శివుడి అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రార్ఠిస్తూ బంధుమిత్రులకు పంపించే సందేశాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి...
1. ఓం నమఃశివాయ..
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
2.ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్
మహాశివరాత్రి శుభాకాంక్షలు
3. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం
అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు
4.బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగం..
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
హర హర మహాదేవ, శంభో శంకర.
అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు
5.అనాదిమల సంసార రోగ వైద్యాయ శంభవే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు
6.వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం..
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం..
వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం..
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం..
- అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.
7.శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం..
శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం..
నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే..
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి..
అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు
8. చర్మాంబరాయ శివభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్య దు:ఖ దహనాయ నమశ్శివాయ
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
9. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీనిరన్తర విభూషితవామభాగమ్ |
నారాయణప్రియమనఙ్గమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
10. జటాకటాహ సమ్భ్రమ భ్రమన్నిలిమ్ప నిర్ఝరీ
విలోలవీచి వల్లరీ విరాజమానమూర్ద్ధని |
ధగద్ధగద్ ధగజ్జ్వల లలాట పట్ట పావకే
కిశోర చన్ద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ
అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు
11. పవిత్రమైన శివరాత్రి రోజు.. అందరికీ మేలు జరగాలని, ఆ పరమ శివుడు అందరికి సుఖ సంతోషాలను ఇవ్వాలని ప్రార్థిస్తూ... ఓం నమ శివాయ!!
12. మీకు, మీ కుటుంబ సభ్యులకు మహా శివుడి అనుగ్రహం కలగాలని.. ఈ పవిత్రమైన శివరాత్రి మీ ఇంట్లో అనందాన్ని, ప్రశాంతతను రెట్టింపు చేయాలని ఆశిస్తూ... మహా శివరాత్రి శుభాకాంక్షలు.
13. మహా శివుడు అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ... మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు.
14. మహాశివరాత్రి రోజు శివుడి అనుగ్రహం లభించాలని, ఈ ప్రత్యేకమైన రోజు మీకు అన్నీ శుభాలే కలగాలని కోరుతూ మీకు, మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు.
Also Read: లయకారుడైన శివుడి ప్రత్యేకత ఏంటి, అర్థనారీశ్వర తత్వం ఏం చెబుతోంది, శివరాత్రి ప్రత్యేక కథనాలు
Also Read: పురుషుడు స్థిర స్వభావం- స్త్రీ మాయాస్వరూపం ఇదే అర్థనారీశ్వర తత్వం