అన్వేషించండి

Magh Purnima 2026: గ్రహ దోషాల నుంచి విముక్తికి మార్గం! మాఘ పూర్ణిమ రోజు చేయాల్సిన దానాలు ఇవే!

మాఘ పూర్ణిమ 2026: ఫిబ్రవరి 1 మాఘ పూర్ణిమ  రోజు ఈ వస్తువులను దానం చేయడం వల్ల శని, రాహు, కేతువుల మహాదశ ప్రభావం నుంచి మీకు విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు

Magh Purnima 2026: మాఘ పూర్ణిమ 2026  ఫిబ్రవరి 1 ఆదివారం వచ్చింది. ఈ రోజు చాలా పవిత్రమైన రోజు.  జాతకంలో శని, రాహువు , కేతువుల మహాదశ కారణంగా ఏర్పడే ప్రతికూల ప్రభావాలను నివారించేందుకు ఈ రోజు అత్యుత్తమం అని జ్యోతిష్య శాస్త్ర పండితులు సూచిస్తున్నారు. మాఘ పౌర్ణమి రోజు స్నానం ఆచరించి  కొన్నివస్తువులు దానం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని వివరిస్తున్నారు. మాఘపౌర్ణమి రోజు ఏం చేయాలి? దానం చేయాల్సిన వస్తువులేంటి? ఇక్కడ తెలుసుకుందాం.

గంగానదీ స్నానం

 మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పుణ్యప్రదంగా పరిగణిస్తారు. ఈ రోజున గంగానదిలో స్నానం చేయడం మాఘ మాసం అంతా గంగలో స్నానమాచరించినంత విశేష ఫలితం వస్తుందని నమ్ముతారు. ఈ రోజు దేవతలు భూమికి దిగివస్తారని.. విష్ణువుతో పాటూ నీటిలో కొలువై ఉంటారని చెబుతారు.  అందుకే మాఘ పౌర్ణమి రోజు చేసే స్నానం, దానం వల్ల ఆనందం , అదృష్టం కలుగుతాయి. గంగాస్నానం ఆచరించే అవకాశం లేనివారు గంగ ఇంట్లో ఉంటే స్నానం చేసే నీటిలో కలుపుకోవచ్చు..లేదంటే మీకు సమీపంలో ఉండే నదిలో స్నానం ఆచరించవచ్చు. 
 
వస్త్రదానం

మీ జాతకంలో ప్రస్తుతం శనిమహాదశ నడుస్తుంటే మాఘ పూర్ణిమ రోజు నల్ల నువ్వులు, ఆవాల నూనె , నల్లని వస్త్రాలను దానం చేయండి. ఈ వస్తువులను దానం చేయడం వల్ల శనిగ్రహం శాంతించి, మీ పనిలో అడ్డంకులు తొలగిస్తుంది
 
చీమలకు ఆహారం

రాహువు ప్రతికూల ప్రభావం కారణంగా చదువులో సమస్యలు ఎదురవుతుంటే, ఉద్యోగంలో విజయం సాధించకపోతే, సంబంధాలలో చీలికలు ఉంటే, మాఘ పూర్ణిమ రోజు  కుక్కలకు, చీమలకు పిండి వేయండి... పేదలకు దుప్పట్లు దానం చేయండి
 
బియ్యం దానం

కేతువు ప్రతికూల ప్రభావం నుంచి బయటపడేందుకు మాఘ పూర్ణిమ రోజు నలుపు ,  తెలుపు దుస్తులను దానం చేయాలి.  ఈ వస్తువులను దానం చేయడం వల్ల జాతకంలో కేతువుకు శుభం కలుగుతుందని , ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతారు.
 
గోధుమలు దానం

సూర్యుడిని బలోపేతం చేయడానికి మాఘ పూర్ణిమ నాడు బెల్లం , గోధుమలను దానం చేయండి. చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి పాలు, చక్కెర మిఠాయి , బియ్యం దానం చేయండి. కుజుడికి ఎర్రటి దుస్తులు, గోధుమలు, తేనె , నువ్వులు దానం చేయండి.
 
పెసలు, ఉసిరి, పచ్చి కూరగాయలు

బుధుడిని శాంతింపజేయడానికి  పచ్చి కూరగాయలు, పెసలు,  ఉసిరికాయ  దానం చేయండి. బృహస్పతికి  పసుపు రంగు దుస్తులు, అరటిపండ్లు, పసుపు  పప్పుధాన్యాలు దానం చేయండి. శుక్రుడిని బలోపేతం చేయడానికి, తెల్ల నువ్వులు  నెయ్యి దానం చేయండి. ఇది భౌతిక సుఖాలను పెంచుతుంది.
 
శుభ యోగాల సంయోగం

మాఘ పూర్ణిమ నాడు, ఆయుష్మాన్ యోగం, పుష్య నక్షత్రం, ప్రీతి యోగం , సర్వార్థ సిద్ధి యోగాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి, ఈ శుభ సంయోగాల సమయంలో చేపట్టే మతపరమైన కార్యకలాపాలు శుభ ఫలితాలను ఇస్తాయని విశ్వాసం

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, పంచాంగం నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget