By: ABP Desam | Updated at : 09 May 2023 09:46 AM (IST)
Representational image/pixabay
లక్ష్మీదేవి సంపదలు కలుగజేసే దేవత. లక్ష్మీ అనుగ్రహం పొందిన వారి అదృష్టం మారిపోతుందని అందరు నమ్ముతారు. ఆమె అనుగ్రహం ఉంటే ఎంతటి దురదృష్టవంతుల తలరాత అయినా మారిపోతుందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మీదేవి తమ ఇంట్లోనే కొలువై ఉండి పోవాలని అందరూ కోరుకుంటారు. లక్ష్మీకటాక్షం కలగడానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని శాస్త్రం చెబుతోంది. స్వప్నశాస్త్రం ప్రకారం కలలు మనకు భవిష్యత్తులో పుట్టబోయే అదృష్టాన్ని సూచిస్తాయని పండితులు చెబుతున్నారు. అలాంటి కలల గురించి తెలుసుకుందాం.
మీకు కలలో వర్షం పడుతున్నట్టు చూస్తే త్వరలో మీ పైన సంపద వర్షంలా కురుస్తుందని సంకేతమట. మీ ఆర్థిక స్థితి మెరుగవుతోందనేందుకు సూచనగా స్వప్నశాస్త్రం చెబుతోంది. త్వరలో కష్టాలు తొలగి ఆనందాలు మీ సొంత కాబోతున్నాయని అర్థమట.
స్త్రీలకు తాము ఎర్రని చీర ధరించినట్టు కల వస్తే త్వరలో ఆమెకు లక్ష్మీకటాక్షం కలుగబోతుందని అర్థం. జీవితంలో చాలా సంతోషాలు కలుగుతాయని అనడానికి సంకేతం.
కలలో చాలా సార్లు పసుపు రంగు పండు కలలో కనిపిస్తే అదృష్టం కలిసి వస్తుందని అర్థం. కలలో పసుపు రంగు పండు కనిపిస్తే అది లక్ష్మీ ఆగమనానికి సంకేతమట. ఇది కాకుండా, కలలో ఎరుపురంగు పువ్వులు కనిపించినా కూడా మీకు ఆర్థిక ఇబ్బందులు త్వరలో తొలగిపోతున్నాయని అర్థం.
కొన్ని సార్లు కలలో ప్రముఖ దేవాలయాలను సందర్శించినట్టు కల వస్తుంది. ఇది చాలా శుభప్రదమైన కల. స్వప్నశాస్త్రం ప్రకారం ఆలయ సందర్శన వల్ల జీవితంలోని సమస్యలు తొలగిస్తాయి. అలాంటి కలలు లక్ష్మీ, కుబేర ఆశీర్వదం లభిస్తుంది.
కొంత మందికి కలలో బావి కనిపిస్తుంది. కలలో చిన్న గొయ్యి, బావి, లేదా గుంట కనిపిస్తే అది నిక్షిప్తం చేసిన నిధికి సంకేతం. కనుక కలలో ఇలాంటివి కనిపిస్తే త్వరలో మీకు ఏదో పెద్ద ధనరాశి లభించబోతోందని అర్థం.
కలలో పువ్వులు కనిపిస్తే చాలా శుభప్రదం. కోసిన పువ్వులు, లేదా పువ్వుల చెట్టు వంటివి కనిపిస్తే త్వరలో చాలా మంచి రోజులు రానున్నాయని అర్థం. ఇది మీ ఆర్థిక కష్టాలకు త్వరలోనే తెరపడనుందని అనడానికి ఇది సంకేతం.
కలలో తెల్ల ఏనుగు కనిపిస్తే చాలా శుభప్రదం. తెల్ల ఏనుగు ఏ ప్రదేశంలో నైనా సరే నిక్షిప్త నిధి ఉంటుందని అర్థం. ఇది ఆకస్మికంగా ధన లాభం కలుగుతుందని చెప్పేందుకు ఇదొక సంకేతం.
చిన్న లేగ దూడకు పాలు ఇస్తున్నట్టు కనిపిస్తే చాలా శుభప్రదం. ఇది ఆకస్మిక లక్ష్మీ కటాక్షానికి సూచనగా చెప్పవచ్చు, ఫూర్వీకుల ఆస్తి కలిసిరావచ్చు.
చీమలు కూడబెట్టడానికి చిహ్నం. కలలో చీమలు కనిపిస్తే రాబోయే రోజుల్లో ఆర్ధికంగా బాగా ఎదగబోతున్నారని అర్థం.
చాలా సార్లు పర్వతం ఎక్కుతున్నట్టు కలలు వస్తాయి. ఇలాంటి కలలు పవిత్రమైనవి. జీవితంలో పురోగతి కోసం కొత్త దారులు ఏర్పడబోతున్నాయని అర్థం. ఉద్యోగస్తులు చాలా మంచి మార్పులు కలుగవచ్చు. వ్యాపారంలో ఉన్న వారికి మంచి లాభాలు వస్తాయనేందుకు సంకేతంగా భావించాలి.
Also Read : ఇవి పర్సులో మీ పర్సులో ఉంటే సంక్షోభం తప్పదు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.
జూన్ 10 రాశిఫలాలు, ఈ రాశివారు బలహీనతలను కవర్ చేసుకోవడం మానేస్తే మంచిది
Friday Special: శుక్రవారం ఈ 4 లక్ష్మీ మంత్రాలను పఠిస్తే ఐశ్వర్యం మీ సొంతం..!
Chanakya Niti: చాణక్య నీతి - భార్యాభర్తలు ఇలా ఉండకపోతే ఇంట్లో రోజూ యుద్ధమే
Bharani Nakshatra : ఈ నక్షత్రంలో జన్మించిన వారి వ్యూహరచన బావుంటుంది, సలహాదారులుగా బాగా రాణిస్తారు!
Love and Relationship Horoscope June 9: ఈ రాశివారు పాతప్రేమికులను కలుస్తారు
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!