Shravan Maas 2023: శంకరునికి ప్రీతిపాత్రమైన బిల్వపత్రం గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
Shravan Maas 2023: పరమేశ్వరుడికి బిల్వ పత్రం అంటే చాలా ప్రీతి అని మన పురాణాలు చెబుతున్నాయి. శివునికి ఇష్టమైన ఈ బిల్వపత్రం ప్రాముఖ్యత, దీనితో పూజిస్తే కలిగే ప్రయోజనం మీకు తెలుసా..?
Shravan Maas 2023: హిందూ సంప్రదాయంలో శివపూజలో బిల్వ పత్రం చాలా ముఖ్యమైనది. బిల్వ పత్రాలను మహాదేవునికి అత్యంత ఇష్టమైనవిగా చెబుతారు. బిల్వ దళాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతిరూపంగా భావిస్తారు. గ్రంధాల ప్రకారం, బిల్వ దళంలోని మూడు ఆకులు శివుని మూడు నేత్రాలను సూచిస్తాయి. హిందువులే కాదు, జైనులు కూడా బిల్వ పత్రాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసం వస్తే శివపూజలో బిల్వ పత్రం ముఖ్య పాత్ర పోషిస్తుంది. బిల్వ పత్రం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
బిల్వ వృక్షం ఏ దేవత రూపం..?
మత విశ్వాసాల ప్రకారం, బిల్వ వృక్షం పార్వతీ దేవి చెమట నుంచి ఉద్భవించింది. ఈ బిల్వ వృక్షంలో పార్వతి దేవి అన్ని రూపాలు ఉన్నాయని నమ్ముతారు. బిల్వ వృక్షం ఆకులలో పార్వతీ దేవి, కొమ్మలో శివుడు, పండ్లలో కాత్యాయిని, పుష్పాలలో గౌరీ, వేరులో గిరిజ, మొక్కలో లక్ష్మీదేవి ఉంటారని చెబుతారు.
Also Read : మహా శివరాత్రి నాడు శివునికి బిల్వ పత్రాన్ని ఎందుకు సమర్పిస్తారు?
సంతాన భాగ్యం
సంతానం కోరుకునే బిల్వ మొక్కను నాటితే వారికి సంతానం కలుగుతుందని శివ పురాణంలో పేర్కొన్నారు. బిల్వ వృక్షం కింద శివుడిని పూజిస్తే లేదా శివలింగాన్ని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. బిల్వ మొక్కను నాటడం వల్ల ప్రయోజనం ఉన్నట్లే, బిల్వ మొక్కను నరికివేయడం వల్ల పాపం చుట్టుకుంటుంది. బిల్వ వృక్షాన్ని నరికివేయడం వలన వ్యక్తి జీవితం దుఃఖంతో నిండిపోతుంది.
బిల్వ మొక్క ఏ దిక్కున నాటాలి..?
వాస్తు శాస్త్రం ప్రకారం, సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకునే వ్యక్తి తన ఇంటికి వాయవ్య దిశలో బిల్వ మొక్కను నాటాలి. దీని ద్వారా అతనికి కీర్తి లభిస్తుంది. అంతే కాకుండా ఇంటి ఉత్తర-దక్షిణ దిశలో బిల్వ మొక్కను నాటడం వల్ల సంతోషం, శాంతి కలుగుతాయి.
పితృ దోషం నుంచి విముక్తి
పితృ దోషంతో బాధపడుతున్న వారు లేదా ఇప్పటికే పితృ దోషం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న వారు, పితృ దోషం నుంచి విముక్తి పొందడానికి, పితృ దేవతల అనుగ్రహాన్ని పొందడానికి బిల్వ చెట్టుకు ప్రతిరోజూ నీటిని సమర్పించాలి. శివ పురాణం ప్రకారం, మరణించినకి బిల్వ చెట్టు నీడలో దహన సంస్కారాలు నిర్వహిస్తే, మృతదేహం ఆత్మ మోక్షాన్ని పొంది శివ లోకం చేరుతుందని చెబుతారు.
పాపాల నుంచి విముక్తి
"దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం"
అంటే బిల్వ వృక్షాన్ని స్పర్శించినంత మాత్రాన, ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించినంత మాత్రాన మానవ జాతి పాపాలన్నీ నశిస్తాయి అని బిల్వాష్టకంలో పేర్కొన్నారు. శివునికి బిల్వపత్రాన్ని సమర్పించడం ద్వారా కూడా ఒక వ్యక్తి ఘోరమైన పాపాల నుంచి విముక్తుడవుతాడు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.