News
News
X

Maha Siva Ratri: మహా శివరాత్రి నాడు శివునికి బిల్వ పత్రాన్ని ఎందుకు సమర్పిస్తారు?

శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైన బిల్వ పత్రాన్ని ఆమహా దేవుడికి సమర్పిస్తారు. అసలు ఇది ఎందుకు సమర్పిస్తారు?

FOLLOW US: 
Share:

ఈ ఏడాది ఫిబ్రవరి 18, శనివారం రోజున మహా శివరాత్రి పర్వదినం జరుపుకోబోతున్నాం. ఆరోజున మహాదేవుడిని రకరకాల పద్ధతుల్లో కొలుస్తారు. ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తారు. గోగుపూలు, మారేడు, బిల్వ దళాలను సమర్పిస్తారు. వీటన్నిటిలో బిల్వపత్రం చాలా శ్రేష్టమైందని చెబుతుంటారు. శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైన బిల్వ పత్రాన్ని ఆమహా దేవుడికి సమర్పిస్తారు. అసలు ఇది ఎందుకు సమర్పిస్తారు? దీని వైశిష్ట్యం గురించి పండితులేమంటున్నారు తెలుసుకుందాం.

శివభక్తులు ఏడాదంతా శివరాత్రి కోసం వేచి ఉంటారు. ఈరోజున శివుడి కళ్యాణోత్సవం జరుపుతారు. శివ పురాణం ప్రకారం.. సృష్టి ఈ రోజు నుంచే మొదలైంది. బ్రహ్మ, విష్ణులతో సహా ఈ రోజునే ఒక అగ్ని లింగం నుంచి సృష్టి ప్రారంభమైందని శివ పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున శివ లింగానికి ప్రత్యేక సేవలు చేస్తారు. ఎన్నో రకాల పద్ధతుల్లో శివపూజ చేస్తారు. వాటిలో ఒకటి శివలింగం పై బిల్వపత్రాన్ని ఉంచి చేసే పూజ. బిల్వపత్రం అంటే శివుడికి చాలా ఇష్టం. శివలింగం పై బిల్వపత్రాలను ఉంచి పూజ చేసుకుంటే  శివానుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఏకంగా శివారాధన కోసం బిల్వాష్టకమే రాశారు. శివ పూజలో బిల్వ పత్రానికి అంత ప్రాశస్త్యం ఉంది.

పర్వత రాజ కుమార్తె పార్వతి, శివుని వరించి పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. సతీ వియోగంలో మహా ద్యానంలో ఉన్న శివుని ప్రసన్నం చేసుకునేందుకు పార్వతి శివుడి కోసం తప్పస్సు చెయ్యడం మాత్రమే కాదు.. ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి, ఎన్నో ఉపవాసాలు చేసింది, ఎన్నో పూజలు చేసింది, చాలా ప్రయాత్నాలు చేసింది. బిల్వ వృక్షం కింద ఒకసారి మహాదేవుడు తప్పస్సు చేస్తున్నపుడు పార్వతి శివ పూజకు అవసరమయ్యే పూజా సామాగ్రి తీసుకురావడం మరచిపోయింది. అక్కడే పడి ఉన్న బిల్వపత్రాలను పుష్పాలుగా ఉపయోగించి పూజ చేయడం ప్రారంభించింది. వాటితో శివుడిని పూర్తిగా కప్పేసింది. ఆ పూజ  ఆయనకు ఎంతో నచ్చింది కూడా, చాలా సంతోషించాడు. అప్పటి నుంచి శివారాధనకు బిల్వపత్రాలను ఉపయోగిస్తున్నారని పండితులు చెబుతున్నారు.

బిల్వపత్రాలతో పూజ వల్ల కలిగే ప్రయోజనాలివే: మహా శివరాత్రి నాడు బిల్వ పత్రాలను సమర్పించిన భక్తులకు ఆర్థిక కష్టాలు తీరుతాయి. అన్ని రకాలుగా సంవృద్ధి కలుగుతుందని నమ్మకం. కనుక చాలామంది శివరాత్రిన ప్రత్యేకంగా బిల్వార్చన చేస్తారు. దంపతులు ఈ రోజున బిల్వ పత్రాలతో శివపూజ చేసుకుంటే వారి దాంపత్య జీవితం అనందమయం అవుతుంది. అంతే కాదు, సంతానం లేని వారికి  సంతాన ప్రాప్తి కూడా జరుగుతుందని నమ్మకం.

శివాభిషేకం ఇలా..: శివుడు అభిషేక ప్రియుడు. శివరాత్రి పర్వదినాన శివలింగాన్ని తేనెతో అభిషేకిస్తే చాలా మంచిది. చేసే ఉద్యోగంలో సమస్యలు ఉన్నపుడు వృత్తి జీవితంలో ఒడిదొడుకులు దూరం చేసుకోవడానికి ఈ అభిషేకం దోహదం చేస్తుంది. శివరాత్రిన ఈ పూజ చేసుకున్న వారికి శివానుగ్రహం సదా ఉంటుంది. శివలింగాన్ని పెరుగుతో పెరుగుతో అభిషేకిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అప్పులు తీరుతాయి. చెరుకురసంతో రుద్రాభిషేకం చేస్తే లక్ష్మీ దేవి ప్రసన్నురాలవుతుంది.  అందువల్ల సంపద చేకూరుతుంది. దారిద్ర్యం నాశనం అవుతుంది.

Published at : 12 Feb 2023 06:29 PM (IST) Tags: shiva abhishekam Maha Shivaratri 2023 shiva ratri bilva patra bilva dalam shiva puja

సంబంధిత కథనాలు

మార్చి 24 రాశిఫలాలు, ఈ రాశివారికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి

మార్చి 24 రాశిఫలాలు, ఈ రాశివారికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి

Ramdan 2023: రంజాన్ మాసం ఎందుకంత ప్రత్యేకం? పవిత్ర ఖురాన్‌లో ఏం పేర్కొన్నారో తెలుసా?

Ramdan 2023: రంజాన్ మాసం ఎందుకంత ప్రత్యేకం? పవిత్ర ఖురాన్‌లో ఏం పేర్కొన్నారో తెలుసా?

Ramadan 2023: ఈ సారి మన దేశంలో ఈద్ కా చాంద్ ఆలస్యం

Ramadan 2023: ఈ సారి మన దేశంలో ఈద్ కా చాంద్ ఆలస్యం

సూర్యస్తమయం వేళ ఇలా చేస్తే అదృష్టం మీ వెంటే!

సూర్యస్తమయం వేళ ఇలా చేస్తే అదృష్టం మీ వెంటే!

Srirama Navami Special 2023: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!

Srirama Navami Special 2023: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!

టాప్ స్టోరీస్

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు -  మళ్లీ ఎప్పుడంటే ?

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు