Raksha Bandhan 2025: రక్షాబంధన్ స్పెషల్! సోదర సోదరీమణులు హ్యాపీగా వెళ్లొచ్చేందుకు 5 అందమైన ప్రదేశాలివి!
Raksha Bandhan 2025 Best Travel Destinations: ఈ రక్షాబంధన్ సెలవుల్లో ప్రయాణానికి ప్లాన్ చేయండి, సోదర సోదరీమణుల బంధాన్ని చిరస్మరణీయంగా మార్చే భారతదేశంలోని 5 అందమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.

Raksha Bandhan 2025 Special: రక్షాబంధన్ కేవలం రాఖీ కట్టే పండుగ మాత్రమే కాదు.. ఇది సోదర సోదరీమణుల అనుబంధం , ప్రేమను వ్యక్తం చేసే ప్రత్యేకమైన సందర్భం. ఈసారి మీరు రాఖీ పండుగను కొంచెం భిన్నంగా, మరపురానిదిగా ప్లాన్ చేసుకోండి. మీ సోదరుడు లేదా సోదరితో కలిసి ఒక అందమైన ప్రదేశానికి యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. భారతదేశంలో కొన్ని ప్రదేశాలు మీ ఆనందాన్ని రెట్టింపుచేస్తాయి. ఇక్కడ తిరగడం మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. రక్షాబంధన్ సమయంలో మీరు మీ సోదరులు మరియు సోదరీమణుల కోసం ప్లాన్ చేయగల కొన్ని ప్రదేశాలు మీకోసం..
రిషికేష్ - సాహసాలు ఇష్టపడేవారికోసం
మీరు సహాసాలు చేసేందుకు ఆసక్తి చూపేవారు అయితే మీ సోదరుడు లేదా సోదరితో కలసి రిషికేష్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ గంగా నదిలో రివర్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్ , క్యాంపింగ్ తో బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని ఇష్టపడితే, త్రివేణి ఘాట్ వద్ద గంగా ఆరతి లక్ష్మణ్ ఝూలా వంటి మతపరమైన ప్రదేశాలు మీకు శాంతినిస్తాయి. ఈ ప్రదేశం సహజ సౌందర్యం, సానుకూల వైబ్స్ సోదరులు మరియు సోదరీమణులతో గడిపిన సమయాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయి.
ఉదయపూర్ - అందమైన సరస్సులు
చరిత్ర, సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్న సోదరులు మరియు సోదరీమణులకు ఉదయపూర్ ఒక ఆదర్శవంతమైన ప్రదేశం. ఇక్కడి సరస్సులు, కోటలు పాత మార్కెట్లు అందరినీ ఆకర్షిస్తాయి. మీరు లేక్ పిచోలాలో బోట్ రైడింగ్ ఆనందించవచ్చు. దీనితో పాటు, సిటీ ప్యాలెస్, సహేలియోన్ కి బాడి వింటేజ్ కార్ మ్యూజియం వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు. స్థానిక మార్కెట్ల నుంచి రాజస్థానీ హస్తకళలు, దుస్తులను షాపింగ్ చేయడం కూడా ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది.
గోవా - ప్రశాంతమైన వాతావరణం
మీరు సోదరులు మరియు సోదరీమణులు సముద్రపు అలలతో పార్టీ మూడ్‌లో ఉంటే గోవా కంటే మంచి ప్రదేశం ఉండకపోవచ్చు. ఇక్కడి బాగ, కాలంగూట్ , పాలోలం వంటి బీచ్‌లు పగటిపూట విశ్రాంతి తీసుకోవడానికి మరియు రాత్రిపూట సందడి చేయడానికి ఉత్తమమైనవి. నార్త్ గోవా నైట్‌లైఫ్ ప్రతి ఒక్కరినీ పార్టీ మూడ్ లోకి తీసుకెళుతుంది. అయితే సౌత్ గోవా యొక్క ప్రశాంతమైన వాతావరణం మీకు ఆహ్లాదాన్నిస్తుంది.
మున్నార్ - జలపాతాల సందడి
మీరు నగర రద్దీకి దూరంగా శాంతియుతంగా కొన్ని క్షణాలు గడపాలనుకుంటే, మున్నార్ లోయలు ఒక గొప్ప ఎంపిక. టీ తోటలలో నడవడం, జలపాతాల హోరుని వినడం, జలపాతాల్లో సందడి చేయడం అద్భుతమైన అనుభూతి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ప్రకృతి మధ్య గడిపేందుకు ఇది మంచి వాతావరణం
పుదుచ్చేరి - అందమైన బీచ్ లు
పుదుచ్చేరి నగరంలో ఫ్రెంచ్ వాస్తుశిల్పం, శుభ్రమైన బీచ్‌లు ప్రశాంతమైన వాతావరణ సమ్మేళనం కనిపిస్తుంది. ఇక్కడ సోదరులు , సోదరీమణులు కలిసి ప్రొమెనేడ్ బీచ్‌లో నడవవచ్చు. కేఫ్‌లలో స్థానిక ఆహారాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెంచ్ క్వార్టర్స్‌లో తిరుగుతూ సంస్కృతిని చూడవచ్చు.
ఈ రక్షాబంధన్‌లో మీరు రాఖీనే కాకుండా..మీరు మీ సోదరీమణులతో సరదాగా గడిచే క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆనందానికి మించిన బహుమతి ఏముంటుంది..
2025లో శ్రావణ పూర్ణిమ, రక్షాబంధన్ ఆగష్టు 09 శనివారం వచ్చింది..






















