Katti Mekkathil Devi Temple: సునామీని కూడా తిప్పికొట్టిన అమ్మవారు, ఇది సమర్పిస్తే చాలు మీ కోర్కె నెరవేరతుందట
కట్టిల్ మెక్కతిల్ భాగవతి అమ్మవారు…కేరళలో ఉన్న ఈ అమ్మవారు చాలా ప్రత్యేకం. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం మాత్రమే కాదు కోరిన కోర్కెలు నెరవేర్చే తల్లిగా ప్రసిద్ధి.
సరస్సు-సముద్రం మధ్య ఉన్న పుణ్యభూమిలో కొలువైన కట్టిల్ మెక్కతిల్ భాగవతి అమ్మవారిని చూసేందుకు నిత్యం వేలాది భక్తులు తరలివస్తారు. ఇక్కడ అమ్మవారు భద్రకాళిలా దర్శనమిస్తుంది. 2004లో ఇండోనేషియా తీరంలో ఏర్పడిన సునామీ అల్లకల్లోలం సృష్టించింది. కేరళ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఇవి సేఫ్ అనుకున్న ప్రాంతాలు కూడా నీట మునిగాయ్. కానీ కొల్లాం జిల్లాలో అరేబియా సముద్రానికి-జలమార్గానికి మధ్య ఉన్న చిన్న దీవిలో ఉన్న కట్టిల్ మొక్కతిల్ భాగవతి అమ్మవారి ఆలయం మాత్రం చెక్కుచెదరలేదు. అమ్మవారి మహిమ గురించి ఇంతకన్నా ఏం చెబుతాం అంటారు భక్తులు.
స్థలపురాణం
స్థలపురాణం ప్రకారం భాగవతి అమ్మవారు... చంపక్కులం నుంచి మొసలిపై వచ్చి స్వయంభువుగా వెలిశారు. వెలవడమే కాదు ఈ ఆలయంలో అమ్మవారే స్వయంగా దీపం వెగిలించారట అందుకే ఆ దీపం కొండెక్కదని (కెడవిలక్కు అంటే ఎప్పటికీ కొండెక్కదని అర్థం) వెలుగుతూనే ఉంటుందని చెబుతారు. ఏటా జరిగే ఉత్సవాలకు చంపక్కులం నుంచి ధ్వజం రావడం అక్కడి సంప్రదాయం. కేరళ పాలకుల్లో అగ్రవీరుల్లో ఒకరైన రాజా మార్తాండవర్మ ఇక్కడకు వచ్చి అమ్మవారిని ఆరాధించి అక్కడే ఓ భవంతి నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి.
Also Read: గాయత్రి మంత్రం ఎందుకంత పవర్ ఫుల్
మెక్కు చెల్లించుకునేందుకు గంటలిస్తే చాలు
అమ్మవారికి మొక్కుకున్న భక్తులు తమ కోరికలు తీరిన అనంతరం ఇత్తడి గంటలు ఇస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రిచెట్టు కొమ్మలకు ఈ గంటలు కడతారు. నెలకు దాదాపు 4 లక్షల గంటలు కడతారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. అంటే ఈ లెక్కన ఎంతమంది కోరిన కోర్కెలు అమ్మవారు నెరవేర్చారో అర్థం చేసుకోవచ్చు. అంతపెద్ద మర్రిచెట్టు మొత్తం గంటలతో నిండిపోయి ఉంటుంది.
Also Read: పుట్టింట్లో అవమానాన్ని భరించలేక అగ్నిలో దూకిన పార్వతి, పరమేశ్వరుడు ఏం చేశాడంటే
గంట కట్టడం ఎప్పటి నుంచి మొదలైంది
ఓ సారి ఆలయ ధ్వజస్తంభం నుంచి ఓ గంట కిందకు పడిపోయిందట. అది గమనించిన అర్చకుడు ఒకరు దాన్ని తీసి మర్రిచెట్టు కొమ్మకు కట్టారట. అప్పటి నుంచి ఆ గంట కట్టిన అర్చకుడి జీవితంలో అద్భుతం చోటుచేసుకుందని...ఆ ప్రచారం పెరిగి ఇలా కోర్కెలు కోరుకుని తీరాక గంటలు కట్టే సంప్రదాయం అనుసరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే
ఇక్కడ అమ్మవారితో పాటూ వినాయకుడు, దుర్గాదేవి, నాగదేవత సహా పలు ఆలయాలున్నాయి. శుక్రవారం, ఆదివారం ఇక్కడ అత్యంత రద్దీగా ఉంటుంది. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకూ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.