By: ABP Desam | Updated at : 25 Mar 2022 11:10 AM (IST)
Edited By: RamaLakshmibai
Spirituality
గాయత్రి మంత్రం
ఓం భూర్భువః సువః తత్ సవితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్"
ఇందులోని ప్రతి బీజాక్షరం మహిమాన్వితమైంది. ఈ మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లేనని రుగ్వేదంలో పేర్కొన్నారు. ఈ మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్దతిలో జపించినా, విన్నా తద్వారా వెలువడే ధ్వని తరంగాలు మనసుని,శరీరాన్ని ఉల్లాసపరిచి, తేజోవంతం చేస్తాయి. దీన్ని ప్రయోగాత్మకంగా నిరూపించేందుకు చాలామంది ప్రయత్నించి నిజమే అని అంగీకరించారు కూడా.
Also Read: అఖండ సినిమాలో బాలయ్య చెప్పిన చక్రాలు విన్నారు కదా-అవేంటో తెలుసా
గాయత్రీ మంత్రం జపిస్తే శరీరంలో జాగృతం అయ్యే గ్రంధులివే
ఓం- శిరస్సు పైన సుమారు ఆరు అంగుళములు
భూ:- కుడి కన్ను పైన 4 అంగుళములు.
భువః -మూడవ నేత్రము పైన 3 అంగుళములు
స్వ: - ఎడమ కన్ను పైన 4 అంగుళములు
అక్షరం - గ్రంధి పేరు - శక్తి -శరీరంలోని కేంద్రం
1. తత్ - తాపీని - సఫలత - ఆజ్ఞాచక్రము
2. స - సఫలత - పరాక్రమము - ఎడమకన్ను
3. వి - విశ్వ - పాలన - కుడికన్ను
4. తు: - తుష్టి - మంగళకరము - ఎడమ చెవి
5 వ - వరద - యోగము - కుడిచెవి
6. రే - రేవతి - ప్రేమ - నాసికా
7. ణి - సూక్ష్మ - ఘనము - పై పెదవి
8. యం - జ్ఞాన - తేజము - క్రింది పెదవి
9. భర్ - భర్త - రక్షణ - కంఠము
10 గో - గోమతి - బుద్ధి కంఠ కూపము
11. దే - దేవిక - దఘనము - ఎడమ ఛాతి
12. వ - వరాహి - నిష్ఠ - కుడిఛాతీ
13. స్య - సింహని - ధారణ - ఉదరము పైన చివరి
14. ధీ - ధ్యాన - ప్రాణ - కాలేయము
15. మ - మర్యా ద - సంయమము - ప్లీహ్యము
16. హి - మూలము - స్పుట - తపము - నాభి
17. ది - మేధ - రూరదర్శిత - వెన్నుపూస చివరి భాగము
18. యో - యోగమాయ - జాగృతి - ఎడమ భుజము
19. యో - యోగిని - ఉత్పాదన - కుడి భుజము
20. నః - ధారిణీ - సరసత - కుడి మోచేయి
21. ప్ర - పభవ - ఆదర్శము - ఎడమ మోచేయి ఆగ్ర భాగం
22. చో - ఉష్మ - సాహసము - కుడి మణికట్టు
23. ద - దృశ్య - వివేకము - కుడి అర చేయి అగ్రభాగం
24. యాత్ - నిరంజన - సేవ - ఎడమ అరచేయి
గాయత్రీ మంత్రం జపిస్తే శరీరంలో ఉన్న ఈ 24 గ్రంథుల్లో స్పందన ఉంటుంది.ఈ 24 అక్షరాలతో పాటు 24 దేవతమూర్తుల శక్తి అంతర్హితమై ఉంటుందని చెబుతారు. ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ ఇరవైనాలుగు దేవతల ఆశీస్సులు, శక్తి చేకూరుతాయని మన పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.
Also Read: శరీరంలో ఏడు చక్రాలకి - తిరుమల ఏడుకొండలకి ఏంటి సంబంధం
Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Today Panchang 28 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శనిని ప్రశన్నం చేసుకునే శాంతిమంత్రం
Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!
Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట
Astrology: ఆగస్టులో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !
TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి