Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు చేయాల్సినవి, చేయకూడనివి! ఈ నియమాలు పాటిస్తే శుభాలే!
Karthika Pournami Pooja: 2025 లో కార్తీక పౌర్ణమి నవంబర్ 05 బుధవారం. ఈ రోజు నియమాలు పాటించినా లేకున్నా కొన్ని తప్పులు చేయొద్దు ..

Karthika Pournami 2025: అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఉన్నాయ్. అయితే నియమాలు పాటించకపోయినా పర్వాలేదు కానీ చేయకూడనివి అనుసరించకపోవడమే మంచిది అని చెబుతున్నారు పండితులు. అవేంటో తెలుసుకుందాం...
కార్తీక పౌర్ణమి రోజు చేయాల్సినవి
కార్తీక పౌర్ణమి రోజు గంగాస్నానం ఆచరించాలి..ఈ రోజు చేసే దానధర్మాలు అనంత ఫలాన్ని అందిస్తాయి
కార్తీకం హరిహరులమాసం...చీకటిని తొలగించి వెలుగు ప్రసాదించే పౌర్ణమి రోజు శివారాధన చేయడం శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ రోజు ఆలయాల్లో, ఇంట్లో రుద్రాభిషేకం ఆచరించడం మంచిది. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే ఆ ఇంట శుభ ఫలితాలుంటాయి
పౌర్ణమి రోజు సూర్యాస్తమయం తర్వాత..శివాలయం లేదా రావిచెట్టు, తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగిస్తారు.
కార్తీక పౌర్ణమి రోజు శివుడికి నమకం, చమకం, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేయిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం సిద్ధిస్తుంది
పెళ్లికానివారు కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి-తులసి మొక్కను ఒకేదగ్గర చేర్చి ఆ పక్కనే రాధాకృష్ణుల విగ్రహం పెట్టి పూజచేస్తే ఉత్తమ జీవిత భాగస్వామి లభిస్తుంది.
కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి కాయలు దానం చేస్తే దారిద్ర్యం పూర్తిగా తొలగిపోతుంది. ఈ రోజు శివార్చన, విష్ణు సహస్రనామపారాయణం, లలితా పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠిస్తే ఆర్థికంగా వృద్ధి చెందుతారు
కార్తీక పౌర్ణమి రోజు నిరుపేదలకు అన్నదానం చేయాలి, వస్త్రదానం చేయడం అత్యుత్తమం, రోగులకు పండ్లు దానం చేస్తే పాపాలు తొలగిపోతాయి
నదీ సమీపంలో లేదంటే ఆలయం సమీపంలో దీపదానం ఇవ్వాలి
మనఃకారకుడు అయిన చంద్రదేవుడిని పూజించి అర్ఘ్యం సమర్పించాలి
కార్తీక పౌర్ణమి రోజు చేయకూడనివి
కార్తీక పౌర్ణమి రోజు వెండి పాత్రలు, పాలను ఎవరికీ దానం ఇవ్వకూడదు
పున్నమి వెలుగుల వేళ ఇంట్లో ఏ మూలా చీకటి ఉండకూడదు.. ఇల్లంతా కూడా పండు వెన్నెలలా ఉండాలి
కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారానికి దూరంగా ఉండాలి...సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి
కార్తీక పౌర్ణమి రోజు ఇంటికి వచ్చిన బిచ్చగాడికి ఆహారం పెట్టండి, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి
ఉపవాసం ఆచరించి నియమాలు పాటిస్తే ఇంకా శుభఫలితాలు పొందుతారు
కార్తీకమాసంలో పాటించే ఈ నియమాల వెనుక ఆరోగ్య రహస్యం ఉంటుంది..ఉపవాసాలు కూడా ఇదే కోవకు చెందుతాయి. కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఆచరించి సాయంత్రం దీపారాధన అనంతరం పండ్లు తినాలి. మరుసటి రోజు నైవేద్యం అనంతరం ఉపవాసం విరమించాలి
వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం
ఓం నమఃశివాయ
గమనిక: పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
కార్తీక పౌర్ణమి శుభముహూర్తం, పూజా సామగ్రి, పూజావిధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
నవంబర్ 05 కార్తీక పౌర్ణమి! మీ బంధుమిత్రులకు ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి!
కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగించాలి? ఎక్కడ, ఎప్పుడు దీపం వెలిగిస్తే శుభం?






















