Janmashtami 2025: కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ 5 వస్తువులను దానం చేస్తే కోర్కెలు నెరవేరుతాయి!
శ్రీకృష్ణ జన్మాష్టమి 2025 ఆగస్టు 16న. ఈ సందర్భంగా దానం చేయడం శుభప్రదం. ఏయే వస్తువులు దానం చేయాలో తెలుసుకోండి.

Krishna Janmashtami 2025 Daan: ఆగష్టు 16 శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అన్ని కృష్ణ మందిరాలను అలంకరించడంతో పాటు, శోభాయాత్రలు కూడా నిర్వహిస్తారు. వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు కృష్ణుని జన్మోత్సవం జరుపుకుంటారు. ఈ సదర్భంగా కృష్ణాష్టమి రోజు ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం ఉంది.
మతపరమైన , పురాణ కథల ప్రకారం, శ్రీకృష్ణుని జన్మోత్సవాన్ని జన్మాష్టమిగా జరుపుకుంటారు. అష్టమి రోజు అర్థరాత్రి జన్మించిన శ్రీ కృష్ణుడు జన్మదినాన్ని వేడుకలా జరుపుకోవడం అంటే... చీకటి నుంచి వెలుగుకు , అధర్మం నుంచి ధర్మానికి పయనించమని చిహ్నం. ఈ రోజున దానం చేయడం వల్ల జీవితంలో దుఃఖం, పేదరికం తొలగిపోతాయి.
కృష్ణునికి ప్రీతికరమైన వస్తువులైన వెన్న, మిఠాయి, పండ్లు, వస్త్రాలు, ధాన్యం దానం చేయడం వల్ల అనేక రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఇవి దానం చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు రావడమే కాకుండా మనస్సు, మెదడుకు శాంతి లభిస్తుంది. జన్మాష్టమి సందర్భంగా దానం చేయడం వల్ల ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. దానం మన జీవితంలో శ్రీకృష్ణుని కృపను, ఆశీర్వాదాన్ని తెస్తుంది.
జన్మాష్టమి నాడు ధాన్యం దానం
జన్మాష్టమి సందర్భంగా ధాన్యం దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ధాన్యం జీవితానికి అవసరమైన వాటిలో ఒకటి. పేదలకు దానం చేయడం వల్ల వారి ఆకలి తీరడమే కాకుండా జీవితంలో స్థిరత్వం , శాంతి లభిస్తుంది.
వెన్న , స్వీట్స్ దానం
శ్రీకృష్ణునికి వెన్న తియ్యటి పదార్థాలంటే చాలా ఇష్టం. వెన్న ఆవు పాలతో తయారు చేస్తారు. కృష్ణుని బాల్యంలో వెన్న పాత్ర చాలా ముఖ్యమైనది. జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణునికి వెన్న , మిఠాయి దానం చేయడం వల్ల జీవితంలో ఆనందం వస్తుంది. దీనిని దానం చేయడం వల్ల జీవితంలో మాధుర్యం రావడమే కాకుండా అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి.
పండ్లు లేదా స్వీట్లు దానం
జన్మాష్టమి రోజున పేదలకు, అవసరమైన వారికి పండ్లు లేదా స్వీట్లు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వీటిని దానం చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
నెమలి ఈకలను దానం చేయండి
శ్రీకృష్ణునికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం. జన్మాష్టమి రోజున నెమలి ఈకలను దానం చేయడం వల్ల జీవితంలో ప్రతికూలత తొలగిపోవడమే కాకుండా ఆధ్యాత్మిక స్వచ్ఛత మానసిక శాంతి కూడా లభిస్తుంది. నెమలి ఈకలను తీసుకొచ్చి ఇంట్లో పూజా మందిరంలో ఉంచినా మంచి జరుగుతుంది
నూతన వస్త్రాలు , పాదరక్షలు దానం
కృష్ణాష్టమి రోజు నూతన వస్త్రాలు, పాదరక్షలు దానం చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఈ రోజున కొత్త బట్టలు దానం చేయడం వల్ల జీవితంలో శుభం కలుగుతుంది. ఆర్థికాభివృద్ధికి మార్గాలు తెరుచుకుంటాయి.
కృష్ణం వందే జగద్గురుం
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా మాత్రమే అందించినది మాత్రమే. ఆధ్యాత్మిక గ్రంధాలు, పండితుల చెప్పిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
ఆగస్టు 16న కృష్ణాష్టమి.. తేదీ, పూజా విధానం, విశిష్టత తెలుసుకోండి! గోకులాష్టమి రోజు ఏం చేయాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















