News
News
X

janmashtami 2022: తొలి ప్రేమలేఖ అందుకున్నది కృష్ణుడే, ఎవరు రాశారు - కన్నయ్య ఎలా రియాక్టయ్యాడు!

మొదటి ప్రేమలేఖ..ఈ పదంలోనే ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది కానీ అప్పట్లో లేఖల ద్వారానే తెలియజేసేవారు. ఈ ట్రెండ్ కూడా కలియుగంలో మొదలైందేం కాదు..ద్వాపర యుగంలోనే ప్రారంభమైంది..

FOLLOW US: 

janmashtami 2022: ఆట, అల్లరి, స్నేహం, ప్రేమ, నాయకత్వం, బంధం..ఇలా ఓ కోణంలో చూసినా శ్రీకృష్ణుడే నంబర్ వన్. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఏ రంగంలో అయినా నిష్ణాతుడు ఎవరంటే శ్రీ కృష్ణుడనే చెప్పాలి. ప్రేమను ఇవ్వడమే కాదు ప్రేమను అందుకోవడం కూడా వరమే. అప్పట్లో ప్రేమలేఖ అందుకున్నాడు కన్నయ్య. ఇంతకీ ఎవరి మనసు దోచాడంటే...

కృష్ణుడి గురించి వింటూ వింటూ ప్రేమలో పడిపోయింది రుక్మిణి. విదర్భ రాజు భీష్మకుడి కుమార్తె రుక్మిణి అందంలోనూ, గుణంలోనూ తనకు తానే సాటి. ఆమె అనుకూల ప్రవర్తన వల్లే కృష్ణుడికి తన అష్టభార్యల్లో రుక్మిణి చాలా ప్రత్యేకం. అయితే తన మనసులో మాటను తండ్రికి తెలియజేసింది రుక్మిణి. తండ్రి అంగీకరించినా ఆమె సోదరుడైన రుక్మికి ఇష్టంలేదు. ఎందుకంటే తన సోదరిని శిశుపాలుడికిచ్చి వివాహం చేస్తానని అప్పటికే ప్రకటించాడు రుక్మి. సోదరుడి పట్టుదల చూసిన రుక్మిణికి ఏం చేయాల అర్థంకాలేదు. శిశిపాలుడితో పెళ్లి ఇష్టంలేదు..శ్రీకృష్ణుడిని మనసులోంచి చెరిపేసుకోలేదు. అందుకే పెళ్లికి ముందు రోజు శ్రీకృష్ణుడికి లేఖ రాసిన రుక్మిణి తన అంతరంగాన్ని తెలియజేసింది. 

Also Read: శ్రీకృష్ణుడు అంటే దైవం మాత్రమే కాదు - స్నేహితుడు, గురువు, ప్రేమికుడు - ఇదే కృష్ణతత్వం

రుక్మిణి తాను రాసిన ప్రేమలేఖలో ఏముందంటే..."ఓ కృష్ణా మీ సౌందర్యం గురించి విన్నాను. మీ పేరు వింటే దు:ఖం నశించి, మనసులోని కోరికలు నెరవేరతాయని అంటారు. నా మనసులో నిరంతరం మీ ధ్యాసే, అందం, జ్ఞానం, యవ్వనం సంపదలో మీకు మీరే సాటి. మిమ్మల్ని నమ్ముకున్న వారి మనసులు సంతోషంగా ఉంటాయి. యుక్తవయసుకు వచ్చిన అమ్మాయి శ్రేష్ఠమైన, మంచి మనసున్న కుటుంబానికి చెందిన వ్యక్తిని భర్తగా పొందాలనుకుంటుంది. ఓ దేవా ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మీరే నా భర్తగా రావాలని కోరుకుంటున్నాను. నాకు నేనుగా మీకు అప్పగించుకుంటున్నాను. దయచేసి నన్ను మీ భార్యగా స్వీకరించండి". రుక్మిణి రాసిన లేఖ చూసిన కృష్ణుడు..ఆమె గురించి తెలుసుకుని తన పరివారంతో కలసి విదర్భకు చేరుకున్నాడు. రుక్మిని ఓడించి శిరోముండనం చేసి..రుక్మిణిని పెళ్లి మండపం నుంచి ఎత్తుకుపోయి  వివాహం చేసుకున్నాడు.

Also Read: కన్నయ్య మధురకే కాదు ప్రేమ మాధుర్యానికీ అధిపతి, మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం శ్రీ కృష్ణుడు

వలచిన శ్రీకృష్ణుడి కోసం రుక్మిణి ఆరాటం (పోతన భాగవతంలోని పద్యాలు)
ప్రాణేశ! నీమంజుభాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల?
భువనమోహన! నిన్ను బొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల?
దయత! నీయధరామృతంబానగాలేని జిహ్వకు ఫలరససిద్ధి యేల?
నీరజాతనయన! నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేల?
ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని జన్మమేల యెన్ని జన్మములకు?

భావం: శ్రీకృష్ణ! నీ మనోఙ్ఞమైన పలుకులు వినలేని చెవులు ఎందుకు దండగ. పురుషోత్తమ! నీవు భోగించని వంటికి అంద మెందుకు దండగ. ప్రాణేశా! నిన్ను చూడలేని కళ్ళకి చూపెందుకు దండగ. ప్రభూ! నీ అధరామృతం అందని నాలుకకు రుచెందుకు దండగ. పద్మాక్షా! నీ మెడలోని పూలహారం వాసన చూడలేని ముక్కు ఎందుకు దండగ. మహాత్మా! కృష్ణభగవాన్! ఎన్నిజన్మలకైనా నీ సేవచేయలేని దండగ జన్మ ఎందుకు. నాకు వద్దు.”

Published at : 18 Aug 2022 12:13 PM (IST) Tags: Udupi Krishna Lord Krishna Goddess Rukmini krishna janmashtami 2022 janmashtami 2022 Lord Krishna Received First Love Letter

సంబంధిత కథనాలు

Karwa Chauth Atla Taddi 2022:   'అట్ల తదియ' ఆంతర్యం ఏంటి, మొదటగా ఈ నోము నోచిందెవరు, తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలేంటి!

Karwa Chauth Atla Taddi 2022: 'అట్ల తదియ' ఆంతర్యం ఏంటి, మొదటగా ఈ నోము నోచిందెవరు, తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలేంటి!

Horoscope Today 7th October 2022: ఈ రాశివారు ఎవరికైనా అప్పిస్తే ఆ డబ్బులు తిరిగి రావు, అక్టోబరు 7 రాశిఫలాలు

Horoscope Today 7th  October 2022:  ఈ రాశివారు ఎవరికైనా అప్పిస్తే ఆ డబ్బులు తిరిగి రావు, అక్టోబరు 7 రాశిఫలాలు

Ambajipeta News : అంబాజీపేటలో విజయ బేతాళస్వామి ఉత్సవాలు, 56 ఏళ్లుగా వాహన మహోత్సవం

Ambajipeta News : అంబాజీపేటలో విజయ బేతాళస్వామి ఉత్సవాలు, 56 ఏళ్లుగా వాహన మహోత్సవం

Dhanteras 2022 Date: ఈ ఏడాది ధన త్రయోదశి ఎప్పుడొచ్చింది,ధంతేరాస్ కి బంగారానికి లింకేంటి!

Dhanteras 2022 Date: ఈ ఏడాది ధన త్రయోదశి ఎప్పుడొచ్చింది,ధంతేరాస్ కి బంగారానికి లింకేంటి!

Karwa Chauth and Atla Taddi 2022: కర్వా చౌత్(అట్ల తదియ) ఎప్పుడొచ్చింది, ఆ రోజు ప్రత్యేకత ఏంటి!

Karwa Chauth and Atla Taddi 2022: కర్వా చౌత్(అట్ల తదియ) ఎప్పుడొచ్చింది, ఆ రోజు ప్రత్యేకత ఏంటి!

టాప్ స్టోరీస్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!

Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy :  మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు